ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత కథనానికి దారి చూపిస్తూ సినిక్ సంస్థ ఏర్పాటు చేసిన జెన్ ఏఐ మైక్రోఫిలిం హ్యాకథాన్‌లో యువ చిత్రకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో నిర్వహించిన ఫిలిం హ్యాకథాన్‌లో 60 మందికి పైగా ప్రతిభావంతులైన ఫిలిం చిత్రాకారులు పాల్గొని సత్తా చాటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరిగిన ఈ హ్యాకథాన్‌లో వారు ఏఐని వినియోగించి 90 సెకన్ల మైక్రో సినిమాలను రూపొందించారు. మొత్తంగా వచ్చిన మైక్రో ఫిలింలలో మూడింటిని ఉత్తమ చిత్రాలుగా గుర్తించి వారికి సినిక్ వ్యవస్థాపకుడు భరత్ గుప్తా, సహ వ్యవస్థాపకులు పద్వీ రెడ్డి దేవిరెడ్డి, ఆకాశ్ చోడే బహుమతులు అందజేశారు.


