ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై ఐపీఎస్‌ అధికారుల సంఘం ఫైర్‌ | IPS Officers Association is serious about MLA Padi Kaushik Reddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై ఐపీఎస్‌ అధికారుల సంఘం ఫైర్‌

Jan 30 2026 5:05 PM | Updated on Jan 30 2026 5:29 PM

IPS Officers Association is serious about MLA Padi Kaushik Reddy

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్‌ సీపీ గౌస్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది

ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్‌ సీపీ గౌస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సీపీ గౌస్‌ మత మార్పిడులపై పాల్పడుతున్నారని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఐపీఎస్‌ అధికారుల సంఘం ఖండించింది. కౌషిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి’అని స్పష్టం చేసింది. 

గురువారం కరీంనగర్‌ జిల్లాలోని వీణవంక స్థానిక సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్తున్న పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో కలిసి వెళ్తున్న తమని పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్‌ రెడ్డి హుజూరాబాద్‌ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కరీంనగర్‌ సీపీ గురించి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కొద్ది సేపటి క్రితం ఐపీఎస్‌ అధికారుల సంఘం ఖండించింది. క్షమాపణ చెప్పాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement