Karim nagar
-
నేను kcr అంత మంచోడిని కాదు: కేటీఆర్
సాక్షి,కరీంనగర్ : తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కేటీఆర్. కరీంనగర్ బీఆర్ఎస్ సన్నాహక సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘ఇవాళ సన్నాహక సమావేశాన్ని చూస్తే బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో అర్థమైతుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ కరీంనగర్. తెలంగాణ సెంటిమెంట్ లేదన్న రోజున కేసీఆర్‌ను 2 లక్షల మెజారిటీతో గెలిపించి వాదాన్ని నిలబెట్టిన గడ్డ కరీంనగర్.గత పదిహేను నెలలుగా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రతిపక్షం బీఆర్ఎస్. ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపమన్న నాయకుడు కేసీఆర్. ఇవాళ భూమికి జానెడున్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. వానపాములు బుసలు కొడుతున్నై, గ్రామసింహాలు సింహాలనుకుంటున్నై. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. బీజేపీ 1992లోనే ఒక్క ఓటు పేరు, రెండు రాష్ట్రాల పేరిట మోసం చేసింది. కాంగ్రెస్ మోసాలు చేస్తూనే ఉంటుంది ఇవాళ ఏం రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. ఇవాళ రైతులకు కేసీఆర్ గుర్తుకొస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ, అణిచివేత రాజ్యం. నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు. మనకు సమయం వస్తుంది. అప్పుడు అన్ని లెక్కలు తేలుస్తాం. విదేశాల్లో దాక్కున్నా పట్టుకొస్తాం. ఈ ప్రభుత్వం 5 డీఏలు బాకీ ఉంది. 16 నెలల్లో 6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని యువత బాధ పడుతోంది. ఈ ఏడాది మొత్తం రజతోత్సవం చేసుకుందాం.ఏప్రిల్ 27న ఆవిర్భావ సభకు అందరూ కదిలి రావాలి. దక్షిణ భారతానికి నష్టం వాటిల్లబోతోందని తమిళనాడు సదస్సు నిర్వహించింది. కుటుంబ నియంత్రణ పాటించినందుకు మనకు ఉత్తరాది నాయకులు ప్రాతినిథ్యం తగ్గించి దక్షాణాదిని చిన్నచూపు చూస్తున్నాయి. ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడ సీట్లు తగ్గిస్తామంటోంది.అయోధ్య తలంబ్రాల పేరిట సెంటిమెంట్ పూసారు. అవి అయోధ్య వి కావు, ఉత్తినే. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ని ఏదడిగినా శివం, శవం ముచ్చట తప్ప వేరే లేదు. బడి కట్టినా, గుడి కట్టినా బీఆర్ఎస్ నాయకులే కట్టారు. పదేళ్లలో కడుపులో సల్ల కదలకుండా చూసుకున్నాడు కేసీఆర్. తెలంగాణాలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారు. బీఆర్ఎస్ మీద ద్వేషం, అసూయ, ఆశ అనే అంశాలను ప్రయోగించి దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం’అని పిలుపునిచ్చారు. -
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు.. ఆశ్చర్యంలో మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి,హైదరాబాద్ : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్‌లో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 2లక్షల 50వేల ఓట్లు పోలైతే దాదాపు 40వేల ఓట్లు పైచిలుకు చెల్లనివి కావడంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.ఈ క్రమంలో కౌంటింగ్ ప్రక్రియపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరా తీశారు. చెల్లని ఓట్లు వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చదువుకున్నవాళ్లకు ఓట్లు ఎలా వేయాలో తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చెల్లని ఓట్లపై ఏర్పడ్డ గందరగోళంపై అభ్యర్థుల ఆందోళన బాటపట్టారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 చిరు వ్యాపారుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అరటి పండ్ల బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వాహనాలు, ఇతర దుఖాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదం..షార్ట్ సర్క్యూట్ వల్లేనని తెలుస్తోంది. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
జమ్మికుంట తహశీల్దార్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు!
సాక్షి, కరీంనగర్: జమ్మికుంట తహశీల్దార్ రజినీ ఆస్తులను ఏసీబీ ప్రకటించింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.20 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 22 ఓపెన్ ఫ్లాట్స్, 7 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు పేర్కొంది. కిలోలకొద్దీ బంగారం, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బినామీ పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తుల కొనేందుకు తహశీల్దార్ రజినీ అడ్వాన్స్ చెల్లించినట్లు తెలిపింది. జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇంట్లో ఇవాళ ఏసీబీ సోదాలు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేశారు. హన్మకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహశీల్దార్ రజని బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. -
కరీంనగర్ జిల్లాలోనూ కుక్కలు స్వైర విహారం
-
వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో జియో ట్రూ 5జీ సేవలు
హైదరాబాద్: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను తెలంగాణ లోని వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్ లో రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి,ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుందని జియో తెలిపింది. జియో ట్రూ 5జీ పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్టచివరి అడుగు వరకు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొంది. తెలంగాణలో జియో ట్రూ 5జీని విస్తరిండం పట్ల జియో తెలంగాణ సీఈఓ కే సీ రెడ్డి సంతోషం ప్రకటించారు. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికిట్రూ-5జీని అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తెలంగాణను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ ప్రకటన
-
మావోల హిట్‌లిస్టులో ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్..!
సాక్షి , కరీంనగర్: ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్లో రెండువారాలుగా కలకలం రేగుతోంది. మావో యిస్టు రాష్ట్ర కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, యాక్షన్ కమిటీ సభ్యుడు పాండు అలియాస్ మంగులు దళాలు ప్రవేశించాయని పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి నది దాటి వీరు పెద్దపల్లి జిల్లాలోనూ ప్రవేశించే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సోమవారం సీఎం పెద్దపల్లి పర్యటనలో ఆఖరు నిమిషాన రోడ్డు మార్గం వద్దని పోలీసులు కేసీఆర్‌ను ఆకాశమార్గం (హెలీక్యాప్టర్) ద్వారా రప్పించారు. 2005 తరువాత మావోయిస్టు పార్టీ పాత కరీంనగర్ జిల్లాలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. 2020 లాక్డౌన్ సమయంలో జిల్లాలో కార్యకలాపాలు సాగించేందుకు తిరిగి యత్నాలు ప్రారంభించింది. సిరిసిల్లలో ఓ కాంట్రాక్టరు వద్ద డబ్బులు వసూలు చేయడం, జగిత్యాలలోనూ రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నించడం వంటి ఘటనలు వెలుగుచూశాయి. ఎక్కడికక్కడ అణిచివేత..! మావోలతో సంబంధాలున్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉమ్మడి జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ భగ్నం చేశారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమలలో పనిచేసే కొందరితో మావోలు కొంతకాలం రహస్య సంబంధాలు నెరిపారు. ఈ వ్యవహారంపై కన్నేసిన కరీంనగర్ సీపీ సత్యనారాయణ గంగాధర, చొప్పదండి, బావుపేట, హుస్నాబాద్‌లకు చెందిన పలువురిని అరెస్టు చేసి మావోల నెట్‌వర్క్‌ను తెంచారు. అలాగే.. జనశక్తి పేరిట కొందరు మాజీలు సిరిసిల్లలో కార్యకలాపాలకు పూనుకునేందుకు సిద్ధమైనా.. ఎస్పీ రాహుల్ హెగ్డే వీరిని ఆదిలోనే అణిచివేశారు. ఇదే జనశక్తికి చెందిన పలువురు ఆయుధాలతో జగిత్యాలలో సంచరిస్తుండగా.. ఎస్పీ సింధు శర్మ బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఎలాంటి కదలికల్లేకుండా జాగ్రత్తపడుతున్నారు. సున్నిత ప్రాంతంగా పెద్దపల్లి జిల్లా.. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని ఆర్ఎఫ్సీఎల్లో వెలుగుచూసిన కుంభకోణంలో మావోయిస్టు కార్యదర్శి వెంకటేశ్ పేరుతో విడుదలవుతున్న లేఖలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఆ లేఖల్లో పలువురు నేతల పేర్లు ప్రస్తావించడంతో అవి ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అదే విధంగా మాజీ మావోలపైనా రహస్యంగా నిఘా కొనసాగిస్తున్నారు. ఈ లేఖలు తొలుత ఆగస్టు 25న, ఆ తరువాత 31న మావోయిస్టు పార్టీ జయశంకర్– మహబూబాబాద్– వరంగల్2– పెద్దపల్లి జిల్లాల డివిజన్ కమిటీ పేరుతో వచ్చాయి. తొలుత ఈ లేఖను కొందరు ఆకతాయిలు విడుదల చేశారని పోలీసులు భావించారు. కానీ.. వీటిని మావోయిస్టులే విడుదల చేశారని ఇటీవల పోలీసులు కూడా నిర్ధారించినట్లు సమాచారం. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని కొందరు నాయకులకు ముప్పు అధికంగా ఉందని, దీన్ని సున్నిత ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులు, కొత్త వ్యక్తుల సమాచారాన్ని నిరంతరం తెప్పించుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల వద్ద సీసీ కెమెరాలు, ఇన్ఫార్మర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. చదవండి: Hyderabad: చూస్తుండగానే బాలుడిపైకి దూసుకెళ్లిన కారు.. భయానక దృశ్యాలు టీఆర్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్..! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని మావోలు దాడులకు పాల్పడతారన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది. తద్వారా పాత జిల్లాలో తిరిగి ఉనికిని చాటుకోవాలన్నది మావోల వ్యూహమని పోలీసులు చెబుతున్నారు. దీంతో మావోల జాబితాలో ఉన్న సదరు నేతలను పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడా పర్యటించవద్దని స్పష్టంచేశారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నేతలకు ముప్పు అధికంగా పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నెట్వర్క్ నాశనమైందన్న ఆందోళనలో ఉన్న మావోలు దాన్ని పునరుద్ధరించుకోవాలన్నా.. పార్టీకి నిధులు సమకూర్చుకోవాలన్నా.. వారి ముందున్న ఏకైక మార్గం హింస. అందుకే.. పోలీసులు వీఐపీ నేతల రక్షణకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. భద్రత విషయంలో చిన్న లోపమున్నా.. మావోలు హింసకు పాల్పడతారన్న సమాచారంతో అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
ఎంబీఏ చదువు, మంచి ఉద్యోగం వదిలి.. పాడితో ఉపాధి!
జగిత్యాల అగ్రికల్చర్: ఉన్నత చదువులు చదివిన యువకులు వ్యవసాయంతోపాటు పాడి వంటి అనుబంధ రంగాల వైపు వెళ్లేందుకు నామోషీగా ఫీలవుతుంటారు. దీంతో, చాలీచా లని జీతంతో పట్టణాల్లో మగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీఏ చదివి, ప్రైవేట్ ఉద్యోగాన్ని వదులుకొని, ఉన్న ఊరిలో జెర్సీ ఆవుల ఫాం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన తీపిరెడ్డి సురేశ్‌రెడ్డి(99893 54414). ఉరుకుల పరుగుల జీవితం నచ్చక.. సురేశ్‌రెడ్డి ఎంబీఏ పూర్తయ్యాక రెండేళ్లు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశాడు. కానీ ఉరుకుల పరుగుల జీవితం అతనికి నచ్చలేదు. దీంతో వ్యవసాయం చేద్దామని ఇంటికి వచ్చాడు. కానీ చదువుకున్నది వ్యవసాయం చేయడానికి కాదు.. ఏదో ఒక ఉద్యోగం చూసుకో అని తల్లితండ్రులు ముఖం మీదే చెప్పేశారు. అయినప్పటికీ తనకున్న పట్టుదల, ధైర్యంతో మొండిగా ఆవుల ఫాం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకొని, తమకున్న వ్యవసాయ భూమిలోనే 5 జెర్సీ ఆవులతో ఫాం ప్రారంభించాడు. ప్రస్తుతం 25 ఆవులున్నాయి.. ఫాంలో ప్రస్తుతం 25 జెర్సీ ఆవులు, 10 దూడలున్నాయి. పాలు పితికేందుకు సురేశ్‌రెడ్డి ఇద్దరు బిహార్ కూలీలను నియమించుకున్నాడు. ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాంలోనే ఉంటూ ఆవులను స్వయంగా పర్యవేక్షిస్తుంటాడు. వాటికి మేత కోసం, ఎకరంలో పచ్చిగడ్డి వేశాడు. ఉదయం, సాయంత్రం ఆవులకు దాణా పెట్టి, పాలు పితుకుతారు. ఆవులు, దూడల పేడ, మూత్రంతో ఈగలు, దోమలు రాకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాడు. లీటర్‌కు రూ.50లకు విక్రయం ప్రతీరోజు ఉదయం, సాయంత్రం 100 లీటర్ల పాల దిగుబడి సాధిస్తున్నట్లు సురేశ్‌రెడ్డి తెలిపాడు. వీటిలో 30 లీటర్లను స్థానిక వినియోగదారులకు లీటర్‌కు రూ.50 చొప్పున పోస్తున్నాడు. మిగిలిన పాలను పాల డిపోకు తీసుకెళ్తున్నాడు. అక్కడ పాలల్లో వెన్న శాతాన్ని బట్టి లీటర్‌కు రూ.30 నుంచి రూ.33 వరకే ఇవ్వడం వల్ల ఆదాయానికి గండి పడుతోంది. అలా కాకుండా వినియోగదారులు పెరిగితే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందంటున్నాడు. దాణా రేట్లు ఏడాదిలో రెట్టింపు కావడం వల్ల ఫాం నిర్వహణ ఖర్చులు పెరిగాయి. దీనికితోడు, ప్రభుత్వం ఇస్తామన్న లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ రూ.2 లక్షలు రెండేళ్లుగా అందక కొంత ఇబ్బందిగా ఉందని చెబుతున్నాడు. ఎండుగడ్డి సేకరణ పాడి పశువులకు మేత ప్రధానం. ఓవైపు పచ్చిమేత ఇస్తూనే, మరో వైపు ఎండుగడ్డిని ఓ పూట వేస్తుంటారు. ఇందుకోసం సురేశ్‌రెడ్డి వరి పొలాల సమయంలో వరి గడ్డిని కట్టలు కట్టించి, షెడ్డులో నిల్వ చేస్తున్నాడు. రూ.వేలకు వేలు పెట్టి, కొత్తగా పాడి పశువులను కొనుగోలు చేయకుండా, ఆవులకు పుట్టిన పిల్లలకే సమీకృత దాణా ఇస్తూ త్వరగా ఎదిగేలా చేస్తున్నాడు. జగిత్యాలలో షాప్ పెట్టాలనుకుంటున్న జెర్సీ ఆవుల ఫాం ప్రారంభించాక మొదట్లో ఎన్నో కష్టనష్టాలు చూశా. కానీ ఏనాడూ అధైర్యపడలేదు. ఫాంని మరింత లాభాల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్న. జగిత్యాలలో వినియోగదారుల కోసం షాప్ పెట్టాలనుకుంటున్న. దాణా రేట్లు తగ్గితే ఆదాయం బాగుంటుంది. – తీపిరెడ్డి సురేశ్‌రెడ్డి, పాడి రైతు, లక్ష్మీపూర్ -
మేం వచ్చాక యూనిఫారాలు ఊడదీయిస్తాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సైదాబాద్: టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల యూనిఫారాలను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఊడదీయిస్తామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి భగవంత్ ఖుబా హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ, 317 జీవోకు సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. అంతకుముందు కరీంనగర్ జైల్లో ఉన్న సంజయ్‌ని ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీ ఇంటినౌకరుగా ప్రవర్తిస్తున్నారని, ఐపీఎస్ శిక్షణ సమయంలో ప్రజారక్షకుడిగా ఉంటానని ప్రమాణం చేసి, ప్రజాభక్షకుడిగా మారారని విమర్శించారు. జరిగిన ఉదంతానికి త్వరలోనే ఆయన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తే, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ లాంటివారినే ప్రజలు ఓడించారని, కుటుంబపాలన చేస్తున్న కేసీఆర్‌కు అదే పరిస్థితి తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని విమర్శించారు. 317 జీవోతో రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందుల పాలు జేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం సంజయ్ దీక్ష చేపట్టిన కార్యాలయాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే శోభ అరెస్టు సంజయ్ ఈ నెల 2న తలపెట్టిన జాగరణ దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అదే కేసులో నిందితులుగా ఉన్న కార్పొరేటర్ రాపర్తి ప్రసాద్, బీజేపీ నేత ఉప్పరపల్లి శ్రీనివాస్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. వైద్యపరీక్షల అనంతరం వీరిని మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ విధించడంతో ముగ్గురినీ జిల్లా జైలుకు పంపారు. -
డాక్యుమెంట్ రైటర్లదే హవా..
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉద్యోగుల కంటే ఎక్కువగా డాక్యుమెంట్ రైటర్ల హవా నడుస్తోంది. డాక్యుమెంట్లు చేయడంతోపాటు ఆఫీసులో సైతం వారే పెత్తనం చెలాయిస్తున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజల నిరక్షరాస్యతతో పాటు విద్యావంతులు సైతం ఆన్లైన్లో సర్వే నంబర్ల పరిశీలన డాక్యుమెంట్ కోసం చేయాల్సిన పనులు తెలిసినప్పటికీ డాక్యుమెంట్ రైటర్లను సంప్రదిస్తుండంతో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోందని రియల్ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) 50 నుంచి 90 వరకు డాక్యుమెంట్లు.. జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు పెద్దపల్లిలో 20నుంచి 50 వరకు డాక్యుమెంట్లు మిగతా ప్రాంతాల్లో 10నుంచి 15వరకు డాక్యుమెంట్ రైటర్లు డాక్యుమెంట్ చేస్తుంటారు. పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చాలావరకు వివరాల నమోదును ఆన్లైన్ చేసింది. అయితే ఆన్లైన్ వివరాల నమోదులోనూ డాక్యుమెంట్ రైటర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి ఆన్లైన్ పై సరైన అవగాహన లేకపోవడంతో డాక్యుమెంట్ రైటర్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ఒక్కో సేవకు ఒక్కో రేటు చొప్పున వసూలు చే స్తు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీకి పట్టించిన డాక్యుమెంట్ రైటర్... పెద్దపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్న ఒకరు.. గతంలో పనిచేసిన సబ్‌రిజిస్ట్రార్ వద్ద తనమాట చెల్లకపోవడంతో సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీకి పట్టించాడు అయినప్పటికీ తిరిగి డాక్యుమెంట్ రైటర్‌గా కొనసాగుతుండడం విశేషం. అక్రమ వసూళ్లలో రిజిస్ట్రార్ కార్యాల య అధికారులు, సిబ్బందికి కూడా వాటాలు ముడుతుండడంతో అధికారుల వద్ద రైటర్ల హవా నడుస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు మ్యుటేషన్ ఉచితమే... రిజిస్ట్రేషన్ సమయంలో మ్యుటేషన్ ఉచితంగానే రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు చేస్తారు. కానీ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారుల పేరుచెప్పి సమీపంలోని డాక్యుమెంట్ రైటర్లు మ్యుటేషన్ చేస్తా మని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ధరణి మాదిరిగా చేయాలి ధరణి మాదిరిగా భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే డాక్యుమెంట్ రైటర్ల అవినీతిని అరికట్టవచ్చని సబ్ రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు. ధరణిలో రిజిస్ట్రేషన్ చేస్తే అవకతవకలు నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. డబ్బులు వసూలు చేస్తే చర్యలు మ్యుటేషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇలా ఎవరైనా అవినీతికి పాల్పడితే తమదృష్టికి తీసుకురావాలి. ఈ విషయమై తమకు ఫిర్యాదులు కూడా అందాయి. డాక్యుమెంట్రైటర్లపై ప్రత్యేక దృష్టిసారించాం. – సురేశ్‌బాబు, సబ్ రిజిస్ట్రార్, పెద్దపల్లి (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
టీఆర్ఎస్ కార్యకర్తలను తరలిస్తున్న టాటాఏస్ బోల్తా..
-
బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా: ‘పేపర్ వేస్తే తప్పేంటి’
సాక్షి, హైదరాబాద్: బాల్యం ప్రతి మనిషి జీవితంలో అందమైన జ్ఞాపకం. ఎంత వయసు వచ్చినా.. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా.. బాల్య స్మృతులు తలుచుకోగానే మనసులో తెలియని ఆనందం. అవును మరి రేపటి గురించి దిగులు లేదు.. నేడు ఎలా గడుస్తుందో అన్న బెంగ లేదు. అమ్మనాన్నల ప్రేమ.. స్నేహితులతో ఆటలు.. బడిలో గెంతులు. బాల్యం అనగానే వినిపించే మాటలు. అయితే ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు.. పలకబలపం పట్టాల్సిన చిన్నారులు పనిలో తలమునకలవుతున్నారు. చిన్న తనంలోనే వారి మీద పెద్ద బాధ్యత. వెరసి మనచుట్టూ ఎందరో బాల కార్మికులు. కోవిడ్‌తో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇంట్లోని ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల. ఈ క్రమంలో కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని.. చదువుకుంటునే పని చేస్తున్న చిన్నారులెందరో ఉన్నారు. (చదవండి: కంటోన్మెంట్ విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ ) తాజాగా ఈ కోవకు చెందిన వీడియోని ఒకదాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగవైరలవుతోంది. ఈ బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి కేటీఆర్ సైతం ఫిదా అయ్యాడు. చిన్నారి భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నారు. ‘‘ఈ చిన్నారి ఆత్మవిశ్వాసం, ఆలోచనల్లో స్పష్టత, హావభావాలు నాకు చాలా నచ్చాయి’’ అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేశారు కేటీఆర్. ఈ వీడియోలోని సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న జై ప్రకాశ్ ఉదయం పూట పేపర్ బాయ్‌గా పని చేసుకుంటున్నాడు. ఇది గమనించి ఆ దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి.. జై ప్రకాశ్‌ని పలకరించాడు. ఏం చేస్తున్నావ్.. ఎక్కడ చదువుతున్నావ్ అని ప్రశ్నించాడు. అనంతరం సదరు వ్యక్తి ఈ ఏజ్‌లో నువ్వు పేపర్ వేస్తున్నావ్ ఎందుకు అని ప్రశ్నించగా.. అప్పుడు జై ప్రకాశ్ ‘ఏం.. పేపర్ వేయొద్దా’ అని తిరిగి ప్రశ్నిస్తాడు. (చదవండి: కేటీఆర్‌పై ఆ విమర్శలు చేయొద్దు.. రేవంత్‌కు సిటీ సివిల్ కోర్టు ఆదేశం ) అప్పుడు ఆ వ్యక్తి చిన్నారి జై ప్రకాశ్‌ని ప్రశంసించి.. ‘చదువుకునే ఏజ్‌లో పని చేస్తున్నావ్ కదా’ అంటే.. అందుకు జై.. ‘చదువకుంటున్నా.. పని చేస్తున్నా.. దానిలో తప్పేం ఉంది’ అని తిరిగి ప్రశ్నిస్తాడు. ఈ ఏజ్‌లో నువ్వు ఇలా కష్టపడటం చాలా నచ్చింది అని సదరు వ్యక్తి అనగా.. ‘కష్టపడితే ఏం అయితది.. భవిష్యత్తులో నాకు మేలు చేస్తుంది’ అని సమాధానం ఇస్తాడు జై. ఇక వీడియో మొత్తంలో బుడ్డోడి ఎక్స్ప్రెషన్స్, కాన్ఫిడెన్స్ వేరే లెవల్. Loved this video from Jagtial Town This young lad a Govt school student called Jai Prakash; loved his confidence, composure and clarity of thought & expression 👏👏 He says what’s wrong in working while studying & goes on to say it’ll keep him in good stead in future pic.twitter.com/Ug4wYIGn8a — KTR (@KTRTRS) September 23, 2021 ఈ వీడియో చూసిన నెటిజనులు చిన్నారి జైని ప్రశంసిస్తున్నారు. పిల్లలు, పెద్దలు నిన్ను చూసి నేర్చుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 5 వేల మందికి పైగా లైక్ చేయగా.. 900 మందికి పైగా రీట్వీట్ చేశారు. ఒక్కరోజులో చిన్నారి జై ప్రకాశ్ స్టార్ అయ్యాడు. చదవండి: శభాష్ పోలీస్.. నిండు ప్రాణాన్ని నిలిపిన కానిస్టేబుల్ -
మెరిసిన ‘తెల్ల బంగారం.. క్వింటాల్ పత్తి ధర రూ.7,800
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తికి రికార్డు ధర పలికింది. పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు పోటీ పడ్డారు. నాణ్యంగా ఉన్న పత్తికి క్వింటాల్‌కు రూ.7,800 గరిష్ట ధర పలికింది. అలాగే కనిష్టంగా రూ.6,000 వరకు వేలం పాటలో రైతులకు చెల్లించారు. నారాయణపేట జిల్లాలో కూడా మంచి ధర వచ్చింది. ఊట్కూర్ మండలం తిప్రాస్‌పల్లి సమీపంలోని విజయ్ కాటన్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు నాణ్యతను బట్టి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,300 ధర చెల్లించారు. అలాగే కనిష్టంగా రూ.6,500 చెల్లించారు. – జమ్మికుంట/నారాయణపేట -
సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన
-
రాజన్న సిరిసిల్లలో బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన నర్స్
-
శభాష్ పోలీస్.. నిండు ప్రాణాన్ని నిలిపిన కానిస్టేబుల్
సాక్షి, కరీంనగర్: కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆగిన గుండెకు పోలీస్ కానిస్టేబుల్ ఊపిరి పోశారు. కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద బొమ్మకల్ కు చెందిన ఎండి అబ్దుల్ ఖాన్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీ అతన్ని కొట్టింది. దీంతో అబ్దుల్ ఖాన్ అక్కడికక్కడే పడిపోయి అపస్మారక స్థితికి చేరాడు. చుట్టుపక్కల జనం చూస్తూ ఉండి పోయారు. కానీ అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అపస్మారక స్థితికి కు చేరుకున్న యువకుడు ఛాతిపై ప్రెసింగ్ చేశాడు. అలా మూడు,నాలుగు నిమిషాలు చేయడంతో యువకుడిలో చలనం వచ్చింది. వెంటనే ఆ యువకుడిని 108లో ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తి పట్ల సీపీ కమలాసన్ రెడ్డి తో పాటు పలువురు అభినందించారు. సిపి కమలాసన్ రెడ్డి మాటలును ప్రేరణగా తీసుకుని, ట్రైనింగ్ లో నేర్చుకున్న అంశాలతో సకాలంలో స్పందించి యువకుడు ప్రాణాలు కాపాడానని కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ తెలిపారు. ఖలీల్ గొప్ప పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ద్విచక్ర వాహనం ఢీకొట్టిన వెంటనే కుప్పకూలిపోయిన యువకుడి హార్ట్ బీట్ ఆగిపోయింది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ ప్రథమ చికిత్సలో భాగంగా గుండె పైన నిమిషం పాటు పంపింగ్ చేయండంతో యువకుడికి మొదలయిన హార్ట్ బీట్, వెంటనే అతనిని హాసుపత్రికి తరలించడమైనది. pic.twitter.com/zZEYMVHal1 — Telangana State Police (@TelanganaCOPs) June 23, 2021 చదవండి:జీవిత సమస్య: పోరుబాట వదలడమా? ప్రాణాలు పోవడమా? -
Huzurabad: చిలక పలుకుల మంత్రులకు ఆత్మగౌరవం ఉందా?
సాక్షి, కరీంనగర్ జిల్లా: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత కాషాయ కండువాతో తొలిసారి నియోజకవర్గంలో అడుగు పెట్టారు. దారి పొడవునా అభిమానులు, బీజేపి కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో ఈటల రోడ్ షో నిర్వహించగా ఆయన సతీమణి జమున కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల మద్దతు కోరారు. ఈటల దంపతుల తొలి రోజు ప్రచారం బీజేపీకి కొత్త ఊపునివ్వగా.. గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప ఎన్నికతో ప్రజలు.. టీఆర్ఎస్ అహంకారానికి ఘోరీ కడతారని వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికలకు.. ఈ ఉప ఎన్నిక రిహార్సల్‌గా ఆయన అభివర్ణించారు. తనకు మద్దతిస్తున్న వారిని ఇంటిలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు. ప్రజలు ప్రేమకు లొంగుతారని. బెదిరింపులకు కాదనన్నారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మ గౌరవం ఉందా అని ప్రశ్నించారు. ఆత్మ గౌరవం పోరాటానికి హుజురాబాద్ వేదిక అని రేపటి నుంచి ఇంటింటికి వెళ్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు. చదవండి: Huzurabad: టార్గెట్ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో? ‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు -
Huzurabad: పట్టుబిగిస్తున్న అధిష్టానం.. ఈటల ఒంటరేనా?!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ కేడర్‌ను దూరం చేసేలా పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది. రాజీనామా చేయకుండా పోటాపోటీగా ప్రెస్మీట్ల ద్వారా ఎదురుదాడి చేస్తున్న ఆయనను ఒంటరిని చేసేందుకు వ్యూహం అమలు చేస్తోంది. ఒకవేళ రాజేందర్ పార్టీ వీడినా టీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ చేజారకుండా హుజూరాబాద్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ పట్టు బిగిస్తోంది. సుమారు వారం పాటు స్థబ్దత నెలకొనగా... రెండు రోజులుగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇన్ని రోజులు వేచిచూసే ధోరణి ప్రదర్శించిన నాయకులు ‘కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తాం... టీఆర్ఎస్లోనే ఉంటాం’ అని ప్రకటిస్తున్నారు. హుజూరాబాద్‌పై ‘ఆపరేషన్ గంగుల’ పేరిట బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాపూర్ కమలాపూర్, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటుండగా, త్వరలోనే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ టి.హరీష్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ రంగంలోకి దిగుతారన్న ప్రచారం కమలాపూర్‌లో సాగుతోంది. ఫలిస్తున్న టీఆర్ఎస్ వ్యూహం.... మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురై ఇరవై రోజులు గడుస్తున్నా మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అమలు చేస్తున్న వ్యూహాలు సత్పలితాలు ఇస్తున్నాయి. రాజేందర్ తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి వెళ్లాక పరిస్థితులు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇరవై రోజుల పాటు వేచిచూసిన పలువురు టీఆర్ఎస్ సీనియర్లు బుధవారం ప్రెస్మీట్ల ద్వారా తమ వైఖరి స్పష్టం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టాక తర్వాత తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేస్తుండగా, ఒక్కొక్కరుగా ఆయన శిబిరం నుంచి బయట పడుతున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సమయంలో రాజేందర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పలువురు ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నారు. కరీంనగర్లో మకాం వేసిన గంగుల కమలాకర్‌ను కలిసొచ్చి హుజూరాబాద్, కమలాపూర్‌ల్లో ప్రెస్మీట్లు పెడుతున్నారు. కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తాం టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న పలువురు సీనియర్లతో పాటు మెజార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు గులాబీ జెండా కిందే పని చేస్తామని బుధవారం ఖరాకండిగా ప్రకటించారు. కమలాపూర్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీలోనే కొనసాగుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి, పింగిలి ప్రదీప్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధికా శ్రీనివాస్, వైస్‌చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, ఎంపీటీసీలు తాళ్లపెల్లి శ్రీనివాస్ తదితరులు ప్రెస్మీట్లో ఈటల రాజేందర్ వైఖరిని ఖండించారు. టీఆర్ఎస్లోనే తమ ప్రస్థానం కొనసాగుతుందని, డబ్బులు, ప్రలోభాలకు లొంగే నాయకులు టీఆర్ఎస్లో, నియోజకవర్గంలో లేరని వెల్లడించారు. చదవండి: హుజురాబాద్: హరీశ్‌కు బాధ్యతలు అప్పగిస్తారా? -
జగిత్యాల: తల్వార్‌తో బర్త్‌డే వేడుకలు
జగిత్యాలక్రైం: పుట్టిన రోజు వేడుకలను తల్వార్‌తో జరుపుకున్న మైనర్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హన్మాన్వాడకు చెందిన 17 ఏళ్ల మైనర్ తన పుట్టిన రోజు వేడుకలను శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత స్నేహితుల మధ్య రోడ్డుపైన జరుపుకున్నాడు. తల్వార్‌తో కేక్ కట్ చేయడంతోపాటు నృత్యాలు చేశారు. ఆ దృశ్యాలు పోలీసుల వరకు వెళ్లడంతో సదరు మైనర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జయేశ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారు చేసే పనులపై ఓ కన్నేసి ఉంచాలని, సంఘ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడితే తల్లిదండ్రులపై సైతం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చదవండి: అయ్యో కొడుకా: తండ్రి ట్రాక్టర్ కింద పడి.. -
ఎంత చదివినా 'తన్వి' తీరదు!
పదేళ్ల పిల్లలు ఏం చేస్తారు? ఆడుతూ పాడుతూ..స్కూల్లో చెప్పిన పాఠాలను వల్లేవేస్తూ ఉంటారు. ఇది ఒకప్పటి మాట. టెక్నాలజీతో ఆడుతూ పాడుతూ ఆన్లైన్ గేమ్‌లతో బిజీగా ఉంటున్నారు నేటితరం పిల్లలు. ఐదోతరగతి చదువుతున్న వోరుగంటి తన్వి మాత్రం కవితలు రాస్తూ ఏకంగా ఒక బుక్‌ను çప్రచురించింది. ఎంత చదివినా తన్వి తీరనంతగా అందరినీ ఔరా అనిపిస్తోంది. లాక్డౌన్ కాలంలో ఎక్కడివారు అక్కడే ఇళ్లలో ఉండిపోవలసి రావడంతో తమకు దొరికిన సమయాన్ని చాలా మంది రకరకాలుగా సద్వినియోగం చేసుకున్నారు. పదేళ్ల చిన్నారి తన్వి కూడా ఎవరికీ తీసిపోలేదు. తనకొచ్చిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చింది. చక్కటి కవితలుగా మార్చింది. ఇలా రాసిన కవితలను ‘ఫ్రం ది ఇన్సైడ్–ద ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పొయెట్’ పేరిట పుస్తకం విడుదల చేసింది. దీంతో అమెరికాలో అతిపిన్న రచయితల జాబితాలో నిలిచింది. మార్చి15న విడుదలైన ఈ బుక్ ప్రస్తుతం ఆన్లైన్ వేదికపై ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రపంచమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో అందరూ అనుభవించిన, ఎదుర్కొంటున్న సమస్యలు, చేస్తున్న ఆలోచనలు, కష్టాలను కవితల రూపంలో వివరిస్తోంది. ముఖ్యంగా భావోద్వేగాలు, బాధ, కోపం, విచారం, ఒంటరితనం, ఇష్టమైన వారిని కోల్పోవడం, లాక్‌డౌన్‌తో స్వేచ్ఛను కోల్పోవడం వంటి అనేక అంశాలను పుస్తకంలో తన్వి ప్రస్తావించింది. అంతేకాకుండా ప్రకృతిపట్ల మనం చూపాల్సిన ప్రేమ బాధ్యత, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు, మర్చిపోలేని బంధాలు... వంటివాటన్నిటì నీ కవితల ద్వారా వివరించింది. హ్యారీపోటర్ సీరిస్‌లను ఇష్టపడే తన్విని కవితలు రాయాలనే అభిరుచే రచయితగా మార్చిందని చెబుతోంది. పదేళ్ల వయసులో బుక్ రాసిన తన్వి భారత సంతతికి చెందిన అమ్మాయి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన మహేందర్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతుల ఏకైక సంతానమే తన్వి వోరుగంటి. ఐదోతరగతి చదువుతోన్న తన్వి వయసులో మాత్రమే చిన్నది. ఆలోచనల్లో ఒక రచయిత అంత వయసు తనది. అందుకే అందరు పిల్లల్లా వేసవి సెలవల్లో ఆడుకోలేదు తన్వి. తనకి ఎంతో ఇష్టమైన కవితలు రాస్తూ కాలం గడిపేది. అలా తాను రాసుకున్న కవితలన్నింటికి ఒక పుస్తకరూపం ఇవ్వడంతో అమెరికా లో యంగెస్ట్ రచయితల సరసన పదేళ్ల తన్వి నిలవడం విశేషం. తన్వి మాటల్లోనే విందాం...‘‘నాపేరు తన్వి వోరుగంటి. నేను అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని చాడ్లర్ నగరంలో అమ్మానాన్నలతో ఉంటున్నాను. మా స్వస్థలం కరీంనగర్ అయినప్పటికీ నాన్న మహేందర్ రెడ్డి ఇంటెల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా, అమ్మ దీపిక సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండడంతో నేను ఇక్కడే పుట్టాను. రెండేళ్లకోసారి మాత్రమే ఇండియా వచ్చి తాతయ్య దగ్గర ఒక నెలరోజులు గడుపుతాము. నా కవితల ప్రస్థానం గతేడాది వేసవికాలం సెలవుల్లో మొదలైంది. సమ్మర్ హాలిడేస్‌లో టైమ్‌పాస్ కోసం కవితలు రాయం మొదలు పెట్టాను. అలా రాస్తూ రాస్తుండగానే నేను కవితలు రాస్తున్న విషయం అమ్మానాన్నలకు తెలియడంతో వారు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. అంతేగాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా స్కూల్ టీచర్ల ప్రోత్సాహం తో నేను మరిన్ని కవితలు రాయగలిగాను. వారి సహకారంతో ఆ కవితలకు పుస్తకరూపం తీసుకు రాగలిగాను. అయితే పుస్తక ప్రచురణ ఏమంత సులభం కాలేదు. చాలా సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చింది. నామీద నాకు పూర్తిస్థాయిలో విశ్వాసం లేకపోవడం వల్ల బుక్ ముద్రించడానికి అర్హురాలినేనా అనిపించేది. పుస్తకాన్ని ముద్రించడానికి నా రచన సరిపోతుందా అనిపించేది. ఇలా ఎన్నో ఆలోచనలు, సందిగ్ధతల నడుమ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ.. తల్లిదండ్రుల సహకారంతో బుక్ పబ్లిష్ చేసాను. అయితే అందరూ అర్థం చేసుకునేలా అర్థవంతమైన కవిత్వం రాశానని మాత్రం చెప్పగలను’’ అని చెప్పింది ఆరిందలా. ‘‘కొత్తగా కవితలు రాయాలనుకుంటున్నవారు ముందుగా మిమ్మల్ని మీరు బాగా నమ్మండి. ఎప్పటికప్పుడు మీకు మీరే నేను చేయగలను అని చెప్పుకుంటూ ఉండాలి. అనుకున్న లక్ష్యాన్నీ చేరేందుకు కష్టపడాలి’’అని చెప్పింది. పిల్లలు, పెద్దల కోసం భవిష్యత్ లో రియలిస్టిక్ ఫిక్షన్ నావెల్స్ రాయాలనుకుంటున్నట్లు తన్వి వివరించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. ‘‘నా మనవరాలు చిన్నవయసులో కవితలు రాసి బుక్ పబ్లిష్ చేసే స్థాయికి ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. తన్వి అమెరికాలో పుట్టినప్పటికీ ఏడాదికోసారి ఇండియా రావడాన్ని ఎంతో ఇష్టపడుతుంది. చిన్నప్పటి నుంచి తను చాలా కామ్‌గా ఉండే తత్వం. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేది. ఎప్పుడూ ఆలోచిస్తూ తనకు నచ్చిన వాటిని చిన్న నోట్‌బుక్‌లో రాసి పెట్టుకునేది. రీడింగ్, రైటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టం. స్కూల్లో టీచర్ల ప్రోత్సాహంతో మంచి వకాబులరీ నేర్చుకుంది. మా ఫ్యామిలీలో రచయితలు ఎవరూ లేరు. ఈ లోటును తన్వి తీర్చింది. తను ఇలానే మంచి మంచి రచనలు చేస్తూ..మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను. తన స్టడీస్తోపాటు రచయితల ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’’ –తన్వి తాతయ్య వోరుగంటి హనుమంత రెడ్డి, (కరీంనగర్ డెయిరీ అడ్వైజర్) -
'నాకు రిటైర్మెంట్ వయసు పెంపు వద్దు'
కొడిమ్యాల: ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై ఉద్యోగులంతా సంబరాలు చేసుకుంటుండగా.. ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం తనకు పెంపు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతున్నారు.జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఏనుగు మల్లారెడ్డి తనకు రిటైర్మెంట్ వయస్సు పెంపు వద్దని మంగళవారం ప్రకటించారు. ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల నిరుద్యోగ యువతకు అవకాశాలు దక్కకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకుని సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నిండిన హుండీలు.. భక్తులకు తిప్పలు
సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో హుండీలు నిండిపోయాయి. దీంతో కానుకలు వేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ గర్భగుడి, అంత ర్భాగంలో మొత్తం 18 హుండీలు ఉండగా.. 13 హుండీలు నిండాయి. భక్తులు కానుకలు వేయకుండా అధికారులు హుండీలకు వ్రస్తాన్ని చుట్టారు. దీంతో భక్తులు ఆలయ పరిసరాల్లో కానుకలను సమర్పించుకుంటున్నారు. ఇదే అదనుగా కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. జనవరి 27న హుండీలు లెక్కించగా.. రూ.10.80 కోట్ల ఆదాయం సమకూరింది. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. చిల్లర నాణేలను బ్యాంకర్లు తీసుకోకపోవడం.. లెక్కింపులోనూ జాప్యం జరగడంతో హుండీలు నిండిపోవడానికి కారణమని చెబుతున్నారు. బుధవారం హుండీలను లెక్కింపునకు ఏర్పాట్లు చేశామని, చిల్లర సమస్యపై దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. -
పెద్దపల్లి జిల్లా బీజేపీలో ముసలం
సాక్షి, పెద్దపల్లి: పార్టీలో క్రమశిక్షణ లోపించిందని అధిష్టానానికి పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ లేఖ రాశారు. దీంతో ఆ పార్టీలో ముసలం రాజుకుంది. తనకు తెలియకుండానే పార్టీ మీటింగ్‌లు పెడుతున్నారని సోమారపు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగలేనని లేఖలో పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం జిల్లా అధ్యక్షుడిగా వేసిన కమిటీని అధిష్టానం ఆమోదించని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: మాజీ కౌన్సిలర్ దారుణ హత్య -
కదంతొక్కిన కమ్యూనిస్టులు..
కరీంనగర్: నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఆందోళనకు సంఘీభావంగా కరీంనగర్లో కమ్యూనిస్టులు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుంచి సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో కరీంనగర్‌కు చేరుకొని నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. నగర పురవీధుల గుండా సాగిన ర్యాలీలో.. కమ్యూనిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోనే నేడు ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన ప్రజా ఉద్యమంగా మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నూతన వ్యవసాయ చట్టాలు మూడింటిని రద్దు చేయాలని ఉభయ కమ్యునిస్టులు డిమాండ్ చేశారు. -
'మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చావంటే చంపుతా'
సాక్షి, కరీంనగర్: ప్రేమ పేరుతో యువకుడి చేతిలో ఒక మైనర్ బాలిక మోసపోయింది. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి బాలికను తల్లిని చేసిన యువకుడు ఇప్పుడు ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించింది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరించడంతో దిక్కుతోచని స్థితిలో పుట్టిన బిడ్డను తీసుకొని న్యాయం కోసం పోలీసుల వద్దకు వచ్చింది. కాగా యువకుడిని అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. కరీంనగర్ లోని గోదాంగడ్డకు చెందిన సమీర్ .. గణేష్ నగర్ లో నివాసం ఉండే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మైనర్ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. బ్యాంగిల్ షాప్ లో పనిచేస్తున్న ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో బాలిక గర్బం దాల్చడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానికులతో కలిసి పెళ్లి చేసుకోమని యువకుడిని నిలదీశారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సమీర్ పాప పుట్టేవరకు కాలం గడిపాడు. గత నవంబర్ 12న యువతి పాపకు జన్మనివ్వడంతో ముఖం చాటేసిన సమీర్ పెళ్ళికి నిరాకరించాడు. పుట్టిన పాపతో తనకు ఏమి సంబంధం లేదని.. కట్నం డబ్బు తెస్తేనే పెళ్ళి చేసుకుంటానని చెప్పిన సమీర్ అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులతో కలిసి పెళ్లి చేసుకోవాలని సమీర్ వద్ద ఒత్తిడి తేవడంతో పెళ్లి ప్రస్తావన తెస్తే చంపుతానని బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమీర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. -
భర్తను హతమార్చిన భార్య
ముస్తాబాద్(సిరిసిల్ల): పిల్లలు లేని తనకుకాకుండా.. రెండో భార్యకు ఆస్తి దక్కుతుందని భావించిన మొదటి భార్య బంధువులతో కలిసి భర్తను హతమార్చింది. సిరిసిల్ల టౌన్ సీఐ వెంకటనర్సయ్య, మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా..ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు చెందిన ధరమ్‌సోత్ శంకర్‌నాయక్(49)పై అతడి మొదటి భార్య సరోజన, మరో ఇద్దరు బంధువులు కలిసి శనివారం రాత్రి దాడి చేశారు. తీవ్రగాయాలకు గురైన శంకర్‌నాయక్‌ను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. శంకర్‌నాయక్ పరిస్థితి విషమంగా ఉండడంతో ముస్తాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతిచెందిన శంకర్‌నాయక్ కాగా శంకర్‌నాయక్‌కు గతంలో సరోజనతో వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. దీంతో సేవాలాల్ తండాకే చెందిన రాజవ్వను శంకర్‌నాయక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు జన్మించింది. అయితే వ్యవసాయ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని శంకర్‌నాయక్‌పై మొదటి భార్య సరోజన కొంతకాలంగా ఒత్తిడి తెస్తోంది. ఇద్దరి మధ్య ఆస్తిపై గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు లేని తనను ఎవరూ పట్టించుకోరని ఆస్తి రాసివ్వాలని పంచాయితీలు పెట్టింది.(చదవండి: పథకం ప్రకారమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య) అయితే అందుకు అతడు నిరాకరించడంతో తన బంధువులైన లక్ష్మీ, శ్రీనివాస్, సరోజన కలిసి శంకర్‌నాయక్‌కు శనివారం రాత్రి ఫుల్‌గా మందు తాగించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న శంకర్‌నాయక్‌పై ముగ్గురు కలిసి దాడి చేసి కొట్టారు. శంకర్‌ను చంపిన ముగ్గురిని శిక్షించాలని రెండో భార్య రాజవ్వ, ఆమె బంధువులు ముస్తాబాద్‌లో ఆందోళన చేపట్టారు. హత్యకు కారణమైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటనర్సయ్య, ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. -
‘కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైంది’
సాక్షి, కరీంనగర్: కరోనా అసలు కథ ఇప్పుడే మొదలవుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగిన సమగ్ర వ్యవసాయం - సుస్థిర వ్యవసాయం అనే కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైంది. ప్రస్తుతం ఇతర దేశాల, రాష్ట్రాల నుండి ప్రజలు వస్తున్నందున పల్లెలు, పట్టణాలు క్షేమంగా ఉండే పరిస్థితి లేదు. మొదటి రెండు నెలలు లాక్ డౌన్ విషయంలో సీరియస్ గా వ్యవహరించాం కాబట్టే.. ఎక్కువ స్థాయిలో విస్తరించలేదు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కరోనాను లైట్ తీసుకోవద్దు. జూన్, జూలై నెలలో ఎక్కువగా కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. ఏది సాధించాలన్నా, ఏది శోధించాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యం. కరోనా అదుపులోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేస్తే వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ను హుజురాబాద్ నియోజక వర్గానికి తీసుక వస్తా. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానానికి రైతులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఈ సంవత్సరం 71 వేల ఎకరాల్లో తెలంగాణ రైతులు పంట పండించారు. దేశంలో అందరికి తెలంగాణ రైతులు అన్నం పెడుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నారు అని పేర్కొన్నారు. ('బాబు.. విగ్రహం కళ్లలోకి చూసే దండ వేశావా') -
రూ.50 వేలు దాటితే.. రుజువు చూపాల్సిందే..
కరీంనగర్,కోరుట్ల: ‘మీరు మున్సిపల్ ఏరియాల్లో ఉంటున్నారా..? మీ అవసరాల కోసం రూ. 50 వేల కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకెళుతున్నారా..? కాస్త జాగ్రత్త పడండి.. ఆ డబ్బుకు చెందిన డ్రా చేసిన వివరాలు..బ్యాంకుకు చెందిన స్లిప్పులు వెంట ఉంచుకోండి...లేకుంటే మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సదరు డబ్బు సీజ్ అయ్యే అవకాశముంది’.. మున్సిపాల్టీల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి అభ్యర్థుల అడ్డగోలు డబ్బు పంపిణీకి చేయడానికి చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. కాసుల పంపిణీకి చెక్ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు కార్పొరేషన్లో రూ.1.50 లక్షలు, మున్సిపాల్టీల్లో రూ. లక్ష వ్యయం చేయడానికి వీలుంది. వీటికి సంబంధించిన లెక్కలు ప్రతీ రోజు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాల్టీల్లో ఆడిటర్లకు ప్రతీరోజు అప్పగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నేరుగా డబ్బు పంపిణీ చేయడానికి అవకాశమున్న క్రమంలో డబ్బు తీసుకెళ్లడానికి మున్సిపల్ ఎన్నికల చట్టం–2019 సెక్షన్ 226 ప్రకారం రూ.50 వేలు పరిమితిగా నిర్ణయించారు. ఈ పరిమితికి మించి డబ్బు ఎవరైనా తీసుకెళితే ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారో..ఎందుకు వాడుతున్నారో తెలపడంతోపాటు బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. లేదంటే డబ్బు సీజ్కావడమే కాకుండా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. నిఘా టీంలు మున్సిపాల్టీల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టకుండా నియంత్రించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. వీటిని ప్లయింగ్ స్క్వాడ్ ఫీల్డ్ పర్యవేక్షణ బృందం, స్థిర పర్యవేక్షణ బృందాలుగా పిలుచుకుంటున్నారు. ఈ బృందాల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకోసం నియమించిన సిబ్బందితోపాటు పోలీసు అధికారులు సభ్యులుగా ఉంటారు. మున్సిపాల్టీల్లోని జనాభా ప్రకారం ఈ బృందాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల మున్సిపాల్టీల్లో ఐదు ప్లయింగ్ స్క్వాడ్‌కు, ఐదు స్థిర పర్యవేక్షణ బృందాలు ఐదు, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాల్టీల్లో మూడు చొప్పున ఆరు టీంలు, రాయికల్, ధర్మపురి మున్సిపాల్టీల్లో రెండు చొప్పున నాలుగు టీంలు ఏర్పాటు చేశారు. ఫిర్యాదు వస్తే.. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థులు..వారికి సంబంధించిన వ్యక్తులు డబ్బు పంచుతున్నారని ఫిర్యాదు వస్తే సదరు వ్యక్తి వద్ద రూ.50 వేలకు తక్కువగా రూ.10 వేలు ఉన్నా సదరు డబ్బు సీజ్ చేసే అవకాశముంది. సదరు వ్యక్తి పోటీలోని అభ్యర్థి తరఫున ఓటర్లకు డబ్బు పంచడానికి వెళుతున్నారా..లేదా ఇతర అవసరాల కోసం తీసుకెళుతున్నారా..? అన్న అంశాన్ని ప్లయింగ్ స్క్వాడ్ బృందం నిర్ధారించుకున్న తరువాత అవసరమైన చర్యలు తీసుకుంటారు. -
ఇదో ‘కిస్మత్’ డ్రా!
సాక్షి, కరీంనగర్: ‘ఇదో లక్కీ స్కీం. నెలకు రూ.1000 చొప్పున 3వేల మంది సభ్యులతో స్కీం. 16 నెలలపాటు ఈ స్కీం కొనసాగుతుంది. ప్రతి నెల 8న డ్రా తీస్తారు. డ్రాలో క్విడ్ కారుతోపాటు ఫ్రిజ్‌లు, బైక్‌లు, స్కూటర్లు, టీవీలు మొదలుకొని బంగారు ఆభరణాల వరకు విజేతలు దక్కించుకోవచ్చు. ’ ఇదీ కరీంనగర్లో జనం ‘కిస్మత్’ మీద కొంతమంది కలిసి ఆడుతున్న లక్కీ డ్రా ఆట. నెలకు వెయ్యి రూపాయలు కడితే 16 నెలల్లో ఏదో ఓ బహుమతి తప్పనిసరి అనే హామీతో... అదృష్టం బాగుంటే కారు, మూడు తులాల బంగారం, బుల్లెట్ బైక్ వంటివి కూడా పొందవచ్చు అనే ప్రచారంతో అమాయకులను టార్గెట్ చేస్తూ సాగిస్తున్న దందా శుక్రవారం ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. పెద్దపల్లి రోడ్డులోని ఎస్ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇప్పటికే సభ్యులుగా చేరిన వ్యక్తులతో శుక్రవారం సమావేశం పెట్టి తొలి లక్కీ డ్రా తీశారు. 2021 ఫిబ్రవరి 8న ఆఖరి 16వ లక్కీ డ్రా వరకు నెలకు వెయ్యి చొప్పున చెల్లించిన 3వేల మందికి బహుమతులు అందజేయనున్నట్లు ‘కిస్మత్’వాలాలు తయారు చేయించిన బ్రోచర్లో పేర్కొన్నారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కలిగిన ఈ ‘కిస్మత్’ గురించి సంబంధిత పోలీసులకు కూడా తెలియకపోవడం గమనార్హం. నెలకు రూ.1000 పేరిట దిగువ తరగతి టార్గెట్ రూ.1000 చొప్పున 16 నెలలు చెల్లించేందుకు ఉద్ధేశించిన ఈ స్కీంలో ప్రతి నెల డ్రా తీస్తామని ‘కిస్మత్’ సంస్థ ప్రచురించిన బ్రోచర్లో పేర్కొన్నారు. హుస్సేనీపురా అడ్రస్‌తో ఉన్న ఈ కిస్మత్ కార్యాలయానికి సంబంధించి ముగ్గురు వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా ఈ బ్రోచర్ మీద పొందుపర్చారు. ఇటీవలే ప్రారంభించినట్లుగా భావిస్తున్న ఈ స్కీంకు సంబంధించి మొదటి నెల డ్రా శుక్రవారం తీశారు. ఈ డ్రాలో మొదటి బహుమతి కింద యాక్టివా 5జీ వాహనంతోపాటు ఓరియంట్ ఐరన్, ప్యూర్ఇట్ వాటర్ ఫిల్టర్, 32 అంగుళాల ఐవా టీవీ, హయర్ 190 లీటర్ల ఫ్రిడ్జి, డానిక్స్ వాషింగ్ మిషన్, హాయర్ ఓవెన్, గ్యాస్ స్టవ్, బజాజ్ మిక్సర్ గ్రైండర్ ఇస్తున్నట్టు బ్రోచర్లో పేర్కొన్నారు. అలాగే 2 నుంచి 8 వరకు ప్రైజులను పేర్కొన్నారు. శుక్రవారం డ్రాలో ఎవరికి ఎన్ని ప్రైజులు ఇచ్చారో తెలియదు. వచ్చే నెల 8న మళ్లీ లక్కీ డ్రా ఉంటుంది. ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అదే సమయంలో సభ్యులను తమ ‘టార్గెట్’కు అనుగుణంగా చేర్చుకుంటూనే ఉంటారు. నెలకు 3వేల మంది ...రూ.30 లక్షల వసూలు లక్కీడ్రా పేరుతో నెలకు 3 వేల మంది నుంచి వెయి రూపాయల చొప్పున వసూలు చేస్తే నెలకు రూ.30 లక్షలు వసూలు అవుతున్నాయి. నెలకు తీసే డ్రాలో మాత్రం వస్తువుల విలువ రెండు లక్షలు దాటని పరిస్థితి ఉంది. మొదటి నెల పేర్కొన్న వస్తువుల విలువ రూ.3 లక్షలు కూడా దాటదు. మిగతా డబ్బులు జమ అయినట్టే. రెండో నెలలో మొదటి నెల బహుమతులు పొందిన 8 మందిని తొలగించినా... రూ.30 లక్షలకు ఓ 8వేల రూపాయలే తక్కువ. ఇలా 16 నెలలకు మొత్తం రూ.4.50 కోట్ల వరకు వసూలవుతున్నాయి. చివరి 16వ నెలలో కారు, ఫ్రీజ్, టీవీ మొదటి బహుమతిగా పేర్కొంటూ... అప్పటి వరకు బహుమతులు రాని వారికి 400 మందికి సాంసంగ్ 32 జీబీ స్మార్ట్ ఫోన్, 600 మందికి హాయర్ వాషింగ్ మిషన్లు, 199 మందికి చెవి రింగులు, 658 మందికి ఐవా 32 అంగులాల టీవీలు, 200 మందికి ఫ్రిజ్‌లు ఇస్తున్నట్లు బ్రోచర్లో పేర్కొన్నారు. నిజాయితీగా లక్కీ డ్రాలో అందరికీ చెప్పినట్లు బహుమతులు ఇచ్చినా 16 నెలల వరకు ఇచ్చే వస్తువుల విలువ కనీసం రూ.కోటి దాటే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు వ్యక్తులు వేసిన ఈ ప్రణాళిక ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి. మధ్యలో ఒక నెల ఎగ్గొట్టినా... అవుట్ ఈ బ్రోచర్‌ను పరిశీలించి ‘వెనుక పేర్కొన్న ఒక వ్యక్తికి ‘సాక్షి’ ప్రతినిధి ఫోన్ చేయగా, తొలి డ్రా శుక్రవారమే ముగిసినట్లు చెప్పాడు. ఇంకా కొందరు సభ్యులుగా చేరేందుకు అవకాశం ఉందని, రూ.1000 చెల్లించి చేరవచ్చని తెలిపాడు. ఆరు నెలలు చెల్లించిన తరువాత డబ్బులు లేక మిగతా కిస్తీలు కట్టకపోతే ఎలా అని ప్రశ్నిస్తే... కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వబోమని, జప్తు అయినట్టేనని స్పష్టం చేశాడు. అందరికీ బహుమతులు ఇస్తామని, చిన్నవి, పెద్దవి అంటే ‘కిస్మత్’ను బట్టేనని తెలిపాడు. లక్కీ డ్రాలు నిషేధం అదృష్టం పేరుతో ప్రజలను మోసం చేసే లక్కీ డ్రా స్కీమ్‌లను ప్రభుత్వం నిషేధించింది. ఇలాంటి స్కీంలలో ఎవరూ చేరకూడదు. నిర్వాహకులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. లక్కీడ్రా స్కీమ్‌లను ప్రజలు నమ్మి మోసపోవద్దు. స్కీమ్ కట్టాలని ఎవరైనా సంప్రదిస్తే వెంటనే మాకు సమచారం అందించాలి. – త్రీటౌన్ సీఐ విజ్ఞాన్‌రావు -
ప్రేమపెళ్లి; మరణంలోనూ వీడని బంధం
సాక్షి, కరీంనగర్ : ఉన్నత కొలువుల్లో ఉండి..పెద్దలను ఎదిరించి.. ఆదర్శ వివాహం చేసుకొని అన్యోన్య జీవితం గడుపుతున్న భార్యభర్తలను లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఈ విషాద సంఘటన హుజురాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల మేరకు..పట్టణంలోని కాకతీయ కాలనీలో నివాసం ఉంటున్న మల్లికార్జున్- సులోచనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె శ్వేత(29) మండలంలోని సింగాపూర్ గ్రామంలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా పని చేస్తోంది. అదే కళాశాలలో ట్రిపుల్ఈ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గోస్కుల నాగరాజుతో ఆరేళ్లక్రితం పరిచయం ప్రేమగా మారగా..పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. వీరికి ఆర్యనాథ్(5), సూర్యనాథ్(3) పిల్లలు ఉన్నారు.ఈ క్రమంలోనే గోస్కుల శ్వేత ఇటీవల గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టుకు ఎంపికైంది. శుక్రవారం కళాశాలకు న్యాక్ కమిటీ పరిశీలన వస్తున్నట్లు సమాచారం అందడంతో పిల్లలిద్దరిని స్కూల్‌కు పంపించి ఉదయం 8 గంటలకు కారులో భార్యాభర్తలిద్దరూ కళాశాలలకు బయల్దేరారు. కారు తుమ్మనపల్లి శివారులోకి చేరుకోగానే ముందు వాహనాన్ని దాటుతుండగా కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కాగా విషయం తెలుసుకున్న నాగరాజు తల్లిదండ్రులు గోస్కుల వెంకటయ్య-సరస్వతి, అక్కబావలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఇద్దరిని పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స వరంగల్‌కు తరలించగా చికిత్స పొందుతూ శ్వేత మృతిచెందగా నాగరాజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు ఒంటరిగా మిగిలారు. వారి మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకొని రోదించిన తీరు పలువురిని కలిచివేసింది. శ్వేత తండ్రి మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు హుజూరాబాద్ టౌన్ సీఐ వాసంశెట్టి మాధవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శిఖం చుట్టు కుట్ర
సాక్షి, జగిత్యాల: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మోతె చెరువు శిఖం, ఎఫ్టీఎల్ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. పదేళ్ల క్రితం వరకు నిండుకుండలా, వెడల్పాటి కాలువలతో చూడముచ్చటగా ఉన్న ఈ చెరువు క్రమంగా ఆనవాళ్లు కోల్పోతోంది. పెద్దకాలువలు పిల్లకాలువల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. కబ్జాలతో చెరువులో నీటి నిలువసామర్థ్యం తగ్గుతోంది. ఒకప్పుడు 8వేల ఎకరాలకు సాగునీరందించిన చెరువు ప్రస్తుతం 3వేల ఎకరాలకు నీరందించలేదని దైన్యస్థితికి చేరింది. అంతేకాదు.. జగిత్యాల మండ ల పరిధిలోని ముప్పాల, తిమ్మాపూర్, జాబితాపూర్, పొలాస తాళ్ల చెరువులకు ఏకైక నీటి వనరు ఈ చెరువే. చెరువు భూముల్లో కొనసాగుతున్న కబ్జాలతో భవిష్యత్‌లో నీరందించడం అనుమానమేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటికే మూడు వందలకు పైగా ఇండ్ల నిర్మాణాలు చెరువును కప్పేశాయి. వాగుతో పాటు ముంపు ప్రాంతాలూ కబ్జా మోతె చెరువుకు ప్రవాహం వచ్చే వాగు అంతర్గాం శివారు నుంచి ధరూర్, నర్సింగాపూర్ మీదుగా మోతెచెరువులో కలుస్తుంది. ఈ ప్రాంతాలను కూడా ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి వాగుతో పాటు ముంపు ప్రాంతాలను చదునుచేశారు. దీంతో వర్షాకాలంలో నీరు వాగునుంచి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో పాటు చెరువు నీటిమట్టం తగ్గడంతో ముంపు ప్రాంతాల్లో ఉన్న భూముల్లో రియల్ఎస్టేట్ వ్యాపారులు చదునుచేసి ప్లాట్లు సిద్ధంచేశారు. కబ్జా వంద ఎకరాలపైనే... మోతె గ్రామంతో పాటు మున్సిపల్ పరిధిలోని 10, 16 వార్డులకు ఆనుకుని చెరువు ఉంది. సర్వే నంబరు 406లో ఉన్న చెరువు మొత్తం విస్తీర్ణం 90.23 ఎకరాలు. గత పదేళ్లకాలంలో 40ఎకరాలు కబ్జాకు గురైంది. ప్రస్తుతం 50ఎకరాలకు మించి చెరువు విస్తీర్ణంలేదు. 269 నుంచి 319 సర్వే నంబర్లకు వరకు 790 ఎకరాల శిఖం భూమి, మరో 50ఎకరాల్లో ఎఫ్టీఎల్ (ఫుల్ బ్యాంక్ లెవల్) భూములున్నాయి. ఇందులో 50 ఎకరాల శిఖం, 20 ఎకరాల ఎఫ్టీఎల్ భూములు కబ్జాకు గురయ్యాయి. ఆక్రమిత భూముల్లో 300లకు పైగా నివాస గృహాల నిర్మాణాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా జిల్లా ఏర్పాటుకు ముందు అప్పటి సబ్‌కలెక్టర్ శశాంక ఈ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. శిఖం భూముల్లోని అక్రమాణాలను తొలగించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఆయన బదిలీ అయ్యారు. దీంతో అప్పటి వరకు వేచి ఉన్న ఆక్రమణాదారులు శశాంక బదిలీ అయిన వెంటనే మళ్లీ ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలు ప్రారంభించారు. కనీసం ఇప్పటికైనా అధికారులు సంప్రదించి చెరువు భూములను స్వాదీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతోనే... జిల్లా ఏర్పాటు ప్రకటనతోనే జగిత్యాల, పరిసర ప్రాంతాల్లో భూములకు భలే డిమాండ్ పెరిగింది. భూముల ధరలు ఒకేసారి 10 రేట్లు పెరిగాయి. దీంతో సామాన్యులు భూములు కొనలేని స్థితిలో చేరుకున్నారు. ఇదే క్రమంలో చెరువులు, కుంటలపై కన్నేసిన పలువురు వాటిని కబ్జా చేయడం మొదలుపెట్టారు. కబ్జాల పరంపర గత ఐదేళ్లలో నుంచే ఎక్కువైంది. ఇదే క్రమంలో పలువురు చెరువు భూములు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. సీఎం ఆదేశాలు బేఖాతరు చెరువులు, వాటి భూముల ఆక్రమణల అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వరకే జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యల విషయంలో రాజీపడొద్దని, ఆక్రమిత చెరువు భూములను స్వాధీనం చేసుకుని పునరుద్ధరించాలని గతంలో కలెక్టర్ల సదస్సులో సూచించారు. అయినా జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న పెద్ద చెరువే కబ్జా కోరల్లో చిక్కుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపడుతుంటే మరో పక్క క్షేత్రస్థాయిలో చెరువుల కబ్జా పరంపర కొనసాగుతుండటం గమనార్హం. చెరువును కాపాడాలి మోతె గ్రామ జగిత్యాల పట్టణానికి ఆనుకునే ఉంది. అయినా మోతె చెరువు భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. కాలువలు సైతం కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుంట్నురు. దీంతో నీరుపారని పరిస్థితి ఉంది. చెరువు భూములు కబ్జాపై అప్పటి సబ్‌కలెక్టర్ శశాంక స్పందించి ఆక్రమణలను తొలగించారు. ఆయన బదిలీ తర్వాత మళ్లీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోతె చెరువు, దాని పరిధిలోన భూములను కాపాడాలి. – మునీందర్‌రెడ్డి, రైతు, తిమ్మాపూర్ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తాం మోతె చెరువు పరిధి భూములను ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో జాయింట్‌గా సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటుచేస్తాం. ఎవరైనా ఆక్రమించినట్లుగా గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో, జగిత్యాల అర్బన్ -
లక్ష్మీపూర్‌లో ఉద్రిక్తత
సాక్షి, కరీంనగర్ : లక్ష్మీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన ఓ యువకుడు కారు ప్రమాదంలో మృతి చెందటం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. మానుకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కాల్వ సందీప్ అనే యువకుడు శుక్రవారం అలుగునూర్ వద్ద కారు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబసభ్యులు, బంధువులు శవంతో లక్ష్మీపూర్‌లో శనివారం ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పాయి. అయితే నష్టపరిహారం చెల్లించే విధంగా కృషి చేస్తామని పోలీసులు సర్పంచ్‌తో మంతనాలు జరుపుతున్నారు. -
లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. 20మందికి గాయాలు
అల్గునూర్ (మానకొండూర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ – కరీంనగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తోపాటు 20 మంది గాయపడ్డారు. ఎల్ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి కథనం ప్రకారం.. మెట్పల్లి డిపోకు చెందిన బస్సు శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి మెట్‌పల్లికి బయల్దేరింది. బస్సులో డ్రైవర్, కండక్టర్, 21 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు రాత్రి 2 గంటలకు నుస్తులాపూర్ వద్దకు చేరుకుంది. ఈ సమయంలో ఐరన్ కడ్డీల లోడ్‌తో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు బస్సు డ్రైవర్ నర్సయ్య ప్రయత్నించాడు. అయితే లారీ కన్నా ఎక్కువ పొడవు ఉన్న ఇనుప కడ్డీలు బస్సు డ్రైవర్ ఉన్న భాగంలోనికి చొచ్చుకెళ్లాయి. దీంతో బస్సు అదుపు తప్పి వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్‌తోపాటు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అడ్డుకోబోయిన మహిళను కాలుతో తన్ని...
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్లో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. 35 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయిన ఓ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి, అమ్మకానికి పెట్టారు భూ బకాసురులు. ఇదేమని ప్రశ్నించిన స్థలం యజమానిపై కబ్జాదారుడు ఎదురుదాడికి దిగారు. అడ్డుకోబోయిన ఓ మహిళను కాలుతో కడుపులో తన్ని చేయి చేసుకున్నాడు. అప్పనంగా భూములు కొట్టేయడమే కాకుండా, భూమి సొంతదారులపై దాడికి సైతం తెగబడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన కరీంనగర్‌లోని రామచంద్రాపూర్ కాలనీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చింతిరెడ్డి ఇందిరమ్మ అనే మహిళ 35 ఏళ్లక్రితం కరీంనగర్‌లోని సిక్‌వాడికి చెందిన సురేందర్‌పాల్ సింగ్ అనే వ్యక్తి వద్ద నుంచి రామచంద్రాపూర్‌కాలనీకి చెందిన సర్వే నంబర్ 965లోని 266 గజాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు. 1985లో ఈ మేరకు ఇందిరమ్మ పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. ఆమె వద్ద నుంచి ఆ భూమిని చింతిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2010లో కొనుగోలు చేసి అతడి భార్య స్వరూప పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఎల్ఆర్ఎస్ కూడా తీసుకున్నారు. ఈనెల 4వ తేదీన సిక్‌వాడీకి చెందిన యస్పాల్‌సింగ్, రాజీవీర్‌సింగ్‌లు మరో ఇద్దరు మహిళలు కలిసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి చింతిరెడ్డి స్వరూప పేరు మీద ఉన్న భూమిని పురంశేట్టి వెంకయ్య అనే వ్యక్తికి విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి తన భూమిని కాపాడుకునేందుకు ఈనెల 19వ తేదీన భూమిలో నిర్మాణం చేపట్టారు. ఈ సమయంలో యస్పాల్‌సింగ్, రాజ్‌వీర్‌సింగ్‌లు వచ్చి ఈ భూమి మాకు చెందిందని బెదిరించడంతో కరీంనగర్ టుటౌన్ పోలీసులకు ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలని ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటే క్రిమనల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి పంపించారు. గురువారం ఉదయం ప్రహరీ నిర్మించేందుకు శ్రీనివాస్‌రెడ్డి భూమిలోకి వెళ్లగా సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. శ్రీనివాసరెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ పెద్దది కావడంతో ఆవేశానికి గురైన యాస్పాల్‌సింగ్ అనుచరులు శ్రీనివాస్‌రెడ్డిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని టుటౌన్ సీఐ దేవారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెరుగుతున్న భూ వివాదాలు... కరీంనగర్ శివారు ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో వివాదాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి చాలా ఏళ్లక్రితం రిజిస్ట్రేషన్లు జరిగిన వాటిని గుర్తించి వాటికి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి వారిని బెదిరించడం లేదా కోర్టులో కేసులు వేసి వారిని ముప్పు తిప్పలు పెట్టడం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. తీగలగుట్టపల్లిలో ఓ వ్యక్తి తరచూ భూవివాదాల్లో తలదూర్చి భూమి నాదే అంటూ కేసులు వేయడం నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడం వాటిని అడ్డం పెట్టుకుని భూ యాజమానులను బెదిరించి వసూలు చేస్తున్నాడని సమాచారం. ఇలాంటి వివాదాలు కరీంనగర్లో ప్రతీరోజు జరుగుతూనే ఉన్నాయి. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరు. దీన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగడం లేదా భూములను ఇతరులకు అమ్మడం చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఇలాంటి వారిని గుర్తించిన పోలీసులు గతంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కొందరు మిన్నకుండినా ఈ మధ్యకాలంలో కొందరు రెచ్చిపోయి అందిన కాడికి దండకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం
సాక్షి, కరీంనగర్: వరుస విజయాలతో దూసుకుపోతున్న అధికార టీఆర్ఎస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన సమీప ప్రత్యర్థి గ్రూప్–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌పై 39,430 ఓట్ల మెజారిటీతో జీవన్‌రెడ్డి గెలుపొందారు. పోటీలో 17 మంది నిలువగా, మొత్తం 1,15,458 ఓట్లు పోలయ్యాయి. రెండోస్థానంలో నిలిచిన చంద్రశేఖర్ గౌడ్‌కు 17268 ఓట్లు వచ్చాయి. బీజేపీ బలపరిచిన సుగుణాకర్ రావు 15077 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ 5192 ఓట్లతో సరిపెట్టుకున్నారు. 9932 ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రకటించారు. జీవన్‌రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటల్లాంటి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికలు మొదటి నుంచి రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. కాగా అంతకు మందు వెలువడిన వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్‌కు ఈ విజయం ఎంతో ఊరట నిచ్చింది. పూల రవీందర్‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా, నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నర్సిరెడ్డి గతంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. -
కొట్లాడే ధైర్యం, నిబద్ధత ఉన్నాయి : రాణి రుద్రమ
సాక్షి, కరీంనగర్ : ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే చట్టసభలకు పోటీచేస్తున్నానని యువతెలంగాణ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ పట్టణంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ప్రభుత్వంలో ప్రాతినిథ్యం కల్పించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను అవమానపరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖను కూడా మగవారే చీరలు కట్టుకొని పరిపాలిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలోఉద్యోగాల కోసం 100 నోటిఫికేషన్లు ఇస్తే 10 నోటిఫికేషన్లు కూడా పూర్తిగా భర్తీ చేయలేదని మండిపడ్డారు. ప్రధాన అభ్యర్థులను పట్టభద్రుల సమస్యలపై చర్చకు రావాలని డిమాండ్ చేస్తే ఎవరు స్పందించడం లేదని విమర్శించారు. ఒక్క అవకాశం ఇవ్వండి.. ‘ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రతి సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసేలా చూస్తా. ఎమ్మెల్సీగా గెలిస్తే ఏ సంవత్సరంలో ఖాళీ అయిన పోస్టులను అదే సంవత్సరంలో భర్తీ చేసేలా, నిర్ణీత గడువులోగా నియామకాలు జరిగేలా శాసన మండలిలో చట్టం కోసం ప్రతిపాదిస్తా. ఉద్యోగాల ప్రకటన వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలా చూస్తాను. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తా. నేరగాళ్లకు వరంలా మారిన సీఆర్పీసీ సెక్షన్ 41ఏ సవరణకోసం, సీపీఎస్ రద్దు, పీఆర్సీ, ఐఆర్ సకాలంలో వచ్చేలా చూస్తా. జర్నలిస్టుల హక్కులకోసం పోరాడతా. నాకు ప్రతి అంశంపై అవగాహన ఉంది. కొట్లాడే ధైర్యం, నిబద్ధత ఉన్నాయి. అవసరమైతే అసెంబ్లీ ముందు గాని, సీఎం కార్యాలయం ముందు గాని కూర్చుని ప్రజల తరఫున గళం వినిపిస్తా. కాబట్టి అవకాశం ఇవ్వాలి’ అని కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి రాణి రుద్రమ కోరారు. -
‘సోనియా తెలంగాణ తల్లి ఎలా అవుతుంది’
సాక్షి, కరీంనగర్ : ఉద్యమ సమయంలో తెలంగాణ యువత ఆత్మహత్యలకు కారణం ఎవరో ఆత్మవిమర్శ చేసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్రం అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు పెట్టుబడిదారుల చేతుల్లో కీలు బొమ్మలని విమర్శించారు. ఎన్నికల వేళ వివిధ పార్టీల మ్యానిఫెస్టోలు ప్రజలకు తాయిలాలు ఇచ్చేలా ఉన్నాయని, అమలుకు సాధ్యమయ్యే విధంగా ఏ ఒక్కటిలేవని మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతరులపై కామెంట్స్ చేసి సెంటిమెంట్ ద్వారా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మళ్లీ ఏవిధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిపించకపోతే ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకుంటాననే వారు ప్రజలకు ఏం సేవ చేస్తారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు పెట్టె ప్రలోభాలకు ప్రజలు మోసపోవద్దని, నిజాయితీతో పనిచేసే బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అభ్యర్థులను గెలిపించాలని వీరభద్రం కోరారు. -
రెండు లక్షలకు పైగా ఓట్లు గల్లంతు : పొన్నం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీం ఎంపీ పొన్న ప్రభాకర్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఇదివరకే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో 15 లక్షల, 50వేల, 834 ఓట్లు ఉంటే ప్రస్తుతం 13 లక్షల, 23 వేల, 433 ఓట్లు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒక్క కరీంనగర్ పార్లమెంట్‌లోనే రెండు లక్షల ఇరవైవేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. ఓటర్ల జాబీతాలో జరుగుతున్న అవకతవకలకు బాధ్యలెవరని ఆయన ప్రశ్నించారు. ఒక్క కరీంనగర్ శాసనసభ నియోజవర్గంలోనే తొంభైవేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీనిపై ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించాలి. వీ.ఆర్వో పరీక్షలకు వెళ్లేందుకు బస్సుల సౌకర్యం లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంగర కోలాన్ సభకు మాత్రం లక్షల బస్సులను తరలించారు. పరీక్షకు హాజరైనా మహిళల పుస్తెలు, మెట్టెలు తీసి వారిని అవమానపరిచారు. ఆ చర్యకు పాల్పడిని అధికారులపై చర్యలు తీసుకోవాలి. గవర్నర్ కూడా దీనిపై స్పందించాలి’’ అని పేర్కొన్నారు. -
ఈసారైనా పెరిగేనా..!
శాతవాహనయూనివర్సిటీ : అర్హులైన విద్యార్థులకు డిగ్రీ కళాశాలల్లో సీటు వచ్చేవిధంగా దోస్త్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఎరగని రీతిలో పలుమార్లు ప్రవేశాలకు అవకాశమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో భారీగా మిగులుతున్న సీట్లును భర్తీచేయాలనే ఉద్దేశంతో ఐదోసారి దోస్త్ ద్వారా కొత్తవారికి, గతంలో నమోదు చేసుకున్న వారికి కళాశాల మార్పిడి, అంతర్గత కోర్సుల మార్పిడికి అవకాశమిస్తున్నారు. శాతవాహనయూనివర్సిటీ పరిధిలో 45,471 సీట్లుండగా నాలుగు దశల్లో 20,350 సీట్లు భర్తీ అయ్యాయి. 25,121 మిగులు సీట్లతో డిగ్రీప్రవేశాలు నేలచూపు చూస్తున్నాయి. ఐదోదశలో ప్రవేశాలకు అవకాశమివ్వడంతో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలతో పాటు శాతవాహనలో కూడా ప్రవేశాలు పెరిగే అవకాశముండొచ్చని విద్యావేత్తలు భావిస్తున్నారు. 16 తేదీతో నమోదు, వెబ్ ఆప్షన్లు పూర్తవనుండడంతో ప్రవేట్ కళాశాలలు దీనినే చివరి అవకాశంగా భావించి పోటీపడుతున్నారు. మరికొంతమంది విద్యార్థులు కళాశాలలో సదుపాయాలు పరిశీలించి మారడానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే దాదాపు మూడు వేల సీట్ల వరకు మార్పులు చేర్పులు జరుగుతాయనేది అంచనా. పెరగనున్న సీట్ల భర్తీ ... దోస్త్ అధికారులు డిగ్రీసీట్ల భర్తీని పెంచడానికి గతంలో ఎన్నడూ కనివిని ఎరగని అవకాశాలు అందిస్తున్నారు. ఈ నెల 14 నుంచి 16వరకు డిగ్రీ ప్రవేశాలకు నమోదు, వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రవేశ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. దీంతో ఆయా కోర్సుల్లో సీటు రాని వారు ఇటువైపుగా వచ్చే అవకాశముంది. ఇదీ పరిస్థితి.. వర్సిటీలో నాలుగేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు తిరోగమనంలోనే ఉంటున్నాయి. కొన్నిసార్లు భర్తీ కన్నా ఖాళీగా మిగులుతున్న సీట్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. యూనివర్సిటీ పరి«ధిలోని 18 ప్రభుత్వ కళాశాలలు, 96 ప్రవేట్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 45,471 సీట్లు ఉన్నాయి. మొదటిదశలో 13,177, రెండోదశలో 5,743 సీట్ల కేటాయింపుతో ‘దోస్త్’ అందరినీ నిరాశ పరిచింది. మూడో దశ కేటాయింపు తర్వాత యూనివర్సిటీ వ్యాప్తంగా 20,023 సీట్లు కేటాయించబడి 33.85 భర్తీ శాతం నమోదైంది. గతంలో ఇచ్చిన నాలుగోదశలో 20,350 సీట్ల భర్తీ జరిగింది. ఇప్పుడు ఐదోదశకు అవకాశం ఇవ్వడంతో దాదాపు 2వేల పైగానే సీట్లు భర్తీ అవుతాయని విద్యారంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కళాశాలల మధ్య పోటీ.. ‘దోస్త్’ అధికారులు ఐదోసారి ప్రవేశాలకు అవకాశం ఇవ్వడంతో ప్రయివేటు కళాశాలల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో పలు కళాశాలల మధ్య ఆనారోగ్యకరమైన పోటీ నెలకొని ఒకరికి మించి ఒకరు ఆఫర్లు ప్రకటించి విద్యార్థులను ఆకర్షించారు. ఎన్ని తిప్పలు పడ్డా ఆనుకున్నస్థాయిలో సీట్ల భర్తీ జరగలేదు. మూడు, నాలుగు దశల సీట్ల కేటాయింపు పూర్తయినా కరీంనగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని కొన్ని కళాశాలల్లోనే చెప్పకోదగ్గస్థాయిలో ప్రవేశాలు జరిగాయి. మిగిలినివి కొన్ని పర్వాలేదనిపించినా మరికొన్ని మాత్రం మూసివేసే దశకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రకటించిన 5వ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగపరుచుకోవాలనే ఉద్దేశంతో పలు ప్రవేట్ కళాశాలలు తప్పుడు మార్గంలో ప్రలోభాలు ప్రకటించి డిగ్రీ ప్రవేశాలను చేపడుతున్నాయని సమాచారం. -
అబ్బుర పరిచే సోయగం.. రాయికల్ జలపాతం
చుట్టూ అడవులు.. పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. సహజసిద్ధంగా జాలువారే జలపాతాలు.. హోరెత్తే నీటి హొయలు.. వెరసి ప్రకృతి ఒడిలో అందంగా ఒదిగిపోయిన అద్భుత ‘చిత్రం’.. రాయికల్ జలపాతం. వరంగల్ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో.. వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ప్రచారానికి దూరంగా, కేవలం స్థానికులే సేదతీరే ప్రాంతంగా మిగిలిపోయిన ఈ జలపాతం.. ఇప్పుడిప్పుడే పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. – సాక్షి, హైదరాబాద్ కమనీయం.. ప్రకృతి రమణీయం చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు.. ఇవి తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదిక్కడ. 170 అడుగుల ఎత్తు నుంచి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతూ ఉంటుంది. 5 అంచెలలో సహజ సిద్ధమైన జలపాతాలను కలిగిన ఈ సుందర ప్రదేశం, పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతూ.. ఎనలేని ప్రకృతి సౌందర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్లీ మళ్లీ రారమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. చక్కటి పర్యాటక కేంద్రం కరీంనగర్, వరంగల్ నగరాలకు అత్యంత సమీపం లో ఉండటం వల్ల ఈ జలపాతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. తెలంగాణ నయాగారాగా పిలిచే బొగత జలపాతానికి ఏ మాత్రం తీసిపోని విధంగా రాయికల్ జలపాతం ఉంటుంది. అయితే ఈ జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం, కొండలపై భాగంలో ఎలుగుబంట్లు ఉండటం తదితర కారణాల రీత్యా ఇది అంతగా ఆదరణకు నోచుకోలేదు. సరైన భద్ర తా చర్యలు చేపట్టి, అవసరమైన సౌకర్యాలను సమకూరిస్తే ఇది తెలంగాణలో ఓ మంచి పర్యాటక కేంద్రంగా భాసిల్లే అవకాశం ఉందని పర్యాటకుల అభిప్రాయం. ఆద్యంతం ఆహ్లాదభరితం ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంతదూరం గుట్టల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి. పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇంతకు మించిన చక్కటి ప్రదేశం వరంగల్ సమీపంలో లేనే లేదని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ముందుగా ఓ చిన్న చెరువు దర్శనమిస్తుంది. దీని నుంచే దట్టమైన అటవీ ప్రాంతం మొదలవుతుంది. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. పర్యాటకులకు ఏమి కావాలన్నా వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. చేపట్టాల్సిన భద్రతా చర్యలివీ ♦ నీళ్లలో ప్రమాదవశాత్తు పడితే బయటపడేందుకు జలపాతాల వద్ద ఇరువైపులా తాళ్లు ఏర్పాటు చేయాలి. ♦ జలపాతాల వద్ద తగిన సంఖ్యలో భద్రతా సిబ్బంది నియామకం. ♦ నిఘా కోసం సీసీ కెమెరాల ఏర్పాటు. ♦ నీళ్లలోకి వెళ్లకుండా ఇరువైపులా జాలీ ఏర్పాట్లు ఎలా వెళ్లాలి? హుస్నాబాద్ సిద్దిపేట రోడ్లో ములుకనూరు వద్ద కుడి వైపు వెళ్లాలి. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు స్వగ్రామం అయిన వంగర మీదుగా రాయికల్ గ్రామానికి వెళ్లాలి. గ్రామం నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గ్రామ చెరువు వస్తుంది. అక్కడ వాహనాలను నిలిపి , జలపాతాల వైపు సుమారు 1 1/2 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ జలపాతాలను చేరుకోవచ్చు. -
వేర్వేరు చోట్ల నలుగురి ఆత్మహత్య
కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం వేర్వే రు కారణాలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో ఓ యువకుడు మోసం చేశాడని బాలిక(16) నిప్పంటించుకుంది. మేడిపెల్లికి చెందిన దామెర కనక(47) మానసికస్థితి సరిగ్గా లేక ఒంటిపై కిరోసిన్ పోసుకొని చనిపోయింది. ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన బొత్త రాజమల్లయ్య(60) ఉరివేసుకున్నాడు. బైక్ కొనివ్వడం లేదని వేములవాడ మండలంలోని తిప్పాపూర్‌కు చెందిన బానోతు మల్లేశ్ (19) ఆత్మహత్య చేసుకున్నాడు.చిగురుమామిడి(హుస్నాబాద్): తెలిసీ.. తెలియని వయసులో ఓబాలిక యువకుడి మాటలకు మోసపోయి.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని ముదిమానిక్యంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఇటీవల గ్రామంలో జేసీబీ ద్వారా మిషన్ భగీరథ పైపులైన్లు వేసేందుకు మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముత్తారం గ్రామానికి చెందిన ఆలకుంట శ్రీకాంత్(25) వచ్చాడు. ఈ క్రమంలో బాలికకు- శ్రీకాంత్ మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 25న ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని సదరు బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. ఈ క్రమంలో తీవ్రమనస్తాపం చెంది సాయంత్రం ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. కుటుంబసభ్యులు కరీంనగర్ తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆలకుంట శ్రీకాంత్‌పై కేసునమోదు చేసినట్లు్ల చిగురు మామిడి పోలీసులు తెలిపారు. మానసిక స్థితి సరిగా లేక.. మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండల కేంద్రానికి చెందిన దామెర కనక(47) మానసికస్థితి సరిగ్గా లేక ఒంటిపై కిరోసిన్ పోసుకొని గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కనక గత కొద్ది రోజులుగా మానసికస్థితి సరిగ్గా లేక బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబసభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కొడుకు దివాకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అనారోగ్యంతో.. ముస్తాబాద్(సిరిసిల్ల) : ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన బొత్త రాజమల్లయ్య(60) అనారోగ్యంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించిన రాజమల్లయ్య తెల్లవారేసరికి దూలానికి వేలాడాడు. రాజమల్లయ్య, లక్ష్మి దంపతులకు ఏకైక కుమార్తె రజిత ఉండగా.. ఆమెకు వివాహం చేశారు. వృద్ధదంపతులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. కొంత కాలంగా రాజమల్లయ్య అనారోగ్యానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కేసునమోదు చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. బైక్ కొనివ్వడం లేదని.. వేములవాడఅర్బన్ : వేములవాడ మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన బానోతు మల్లేశ్ (19) ఇంట్లో ఉరి వేసుకుని గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం.. మల్లేశ్ జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తనకు ద్విచక్ర వాహనం కావాలని తండ్రి కిష్టయ్యను కొద్దిరోజులుగా కోరుతున్నాడు. వాహనం కొనివ్వక పోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకున్నాడు. ఘటనాస్థలానికి పట్టణ ఎస్సై వెంకట్రాజమ్ సందర్శించి, కేసు నమోదు చేశారు. పోలీసుల భయంతో ఆత్మహత్యాయత్నం యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం) : పోలీస్‌స్టేషన్‌కు రమ్మన్నారన్న భయంతో నిందితుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో జరిగింది. ఇటీవల ఓసీపీ- 3 పంప్హౌస్వద్ద జరిగిన కాఫర్కేబుల్ చోరీ,సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ సమీపంలోని ఓబీ డంప్‌యార్డ్‌పై జరిగిన కేబుల్ చోరీల్లో గండికోట కుమార్‌పై గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈక్రమంలో పోలీస్‌స్టేషన్ రమ్మని ఇంటికి కబురంపడంతో భయపడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. దీనిపై టూటౌన్ సీఐ చిలుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. స్టేషన్లో కేబుల్ చోరీపై కేసునమోదైన విషయం వాస్తవమే అన్నారు. ఇప్పటివరకు పోలీస్‌స్టేషన్‌కు రాలేదని, ఆత్మహత్యాయత్నానికి కారణం తెలియదన్నారు. -
రెండు స్కూల్ బస్సులు సీజ్
వెల్గటూరు(ధర్మపురి) కరీంనగర్ : పాఠశాలల ప్రారంభంలోనే రవాణా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో పాఠశాల బస్సులను రవాణాశాఖాధికారి కిషన్‌రావు తనిఖీ చేశారు. వెల్గటూరు బ్రిలియంట్ మోడల్ స్కూల్, రాజారాంపల్లి అక్షర హైస్కూల్ బస్సులను సీజ్ చేశారు. బస్సులకు సంబంధించి ధ్రుపత్రాలు సరిగా లేనందును సీజ్ చేసినట్లు తెలిపారు. -
హాల్ టికెట్లలో వింతలు
శాతవాహనయూనివర్సిటీ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు పీజీ పరీక్షల హాల్‌టికెట్లు చూసి నివ్వెరపోయారు. శాతవాహనయూనివర్సి టీ పరిధిలోని కళాశాలల్లో పీజీ రెండో సెమి స్టర్ పరీక్షలు 17 తేదీ నుంచి 29 వరకు జరగనున్నాయి. మొదటి రోజైన గురువారం ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించారు. పరీక్షల హాల్టికెట్లలో అందరికీ అభ్యర్థుల ఫొటోలు ముద్రణ కాగా.. పలువురు విద్యార్థులకు మాత్రం తమ ఫొటోలకు బదులు పూల చిత్రాలు, సినీతారల ఫొటోలు వచ్చాయి. దాదాపుగా 35 మంది విద్యార్థులకు ఇలాగే జరిగింది. అవి చూసి ఖంగుతిన్న విద్యార్థులు పూలచిత్రాల స్థానంలో వారి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అతికించి కళాశాల స్టాంప్ వేయించుకుని వచ్చారు. వీటిని చూసిన సెంటర్ సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం కేంద్రం నిర్వాహకులు శాతవాహనయూనివర్సిటీ అధికారులతో మాట్లాడి.. తప్పులు దొర్లిన విద్యార్థులతో అండర్ టేకింగ్ లెటర్ రాయించుకుని లోనికి అనుమతించారు. ఇదంతా పూర్తయ్యేసరికి గంట సమయం పట్టడంతో విద్యార్థులు గంట ఆలస్యంగా పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు. మరో పరీక్షకు హాల్‌టికెట్లు ఇలాగే తీసుకొస్తే లోనికి అనుమతించమని.. ప్రిన్సిపాల్ స్టాంప్, సంతకంతో ఉంటేనే పంపిస్తామని నిర్వాహకులు సూచించడం గమనార్హం. సాధారణంగా కళాశాల నుంచి అభ్యర్థుల ఫొటోలు, వివరాలు యూనివర్సిటీకి అప్లోడ్ చేస్తారు. అనంతరం యూనివర్సిటీ అధికారులు వాటిని పరీక్షించి సరిగా ఉన్నాయా లేదా చూసి హాల్‌టికెట్లు జారీ చేస్తారు. ఇది కళాశాల తప్పిదమా.. యూనివర్సిటీ తప్పిదమా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. గతంలో పరీక్షల విషయంలో ఎన్నో తప్పిదాలు దొర్లినప్పటికీ శాతవాహన పరీక్షల విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తప్పుమీద తప్పులు చేస్తూనే ఉందని.. నిర్లక్ష్యం వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నష్టం జరగనివ్వం.. పీజీ విద్యార్థులకు హాల్‌టికెట్‌లో ఫొటోలకు బదులు వేరే చిత్రాలు వచ్చింది వాస్తవమే. వారి కళా శాల నుంచే అప్లోడ్ చేయడం, ఇతర టెక్నికల్ కా రణాలతో ఇది జరిగింది. పరీక్షా కేంద్రానికి యూ నివర్సిటీ నుంచి సమాచారమందించి విద్యార్థుల ను లోనికి అనుమతించాం. విద్యార్థులు ఆలస్యం గా వెళ్లినా నిర్ణీత సమయం అందించడంతో పరీక్ష పూర్తి చేసుకున్నారు. – డాక్టర్ వి.మహేశ్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ -
గుండెపోటుతో ఉత్తర్‌ప్రదేశ్‌వాసి మృతి
శంకరపట్నం(మానకొండూర్): శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులో గురువారం ఉత్తర్‌ప్రదేశ్ వాసి గుండెపోటుతో మృతిచెందినట్లు హెడ్‌కానిస్టేబుల్ జయశంకర్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లాల్‌బహుదూర్(50) కొంతకాలంగా శంకరపట్నం మండలంలో ఐస్‌క్రీమ్‌లు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడే మృతి చెందాడు. స్థానికులు కేశవపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని హెడ్‌కానిస్టేబుల్ జయశంకర్ పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
టవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ఇల్లంతకుంట(మానకొండూర్): ఒకవైపు పేదరికం.. మరోవైపు జీవితంలో ఇంకా స్థితపడలేదనే మనోవేదనకు గురైన ఓ యువకుడు మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి ఇంటి సమీపంలోనే ఉన్న సెల్ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుంభం గోవర్ధన్(22) అనే యువకుడు డిగ్రీలో ఫేయిల్ అయిన సబ్జెక్టులను ఇటీవలే రాశాడు. మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోగా కుటుంబసభ్యులు బంధువులకు ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. గురువారం సాయంత్రం సెల్ టవర్ కంపెనీ ప్రతినిధులు టవర్ వద్దకు రాగా దుర్వాసన వెదజల్లడంతో లోపలికి వెళ్లి చూసే సరికి కుల్లిపోయిన మృతదేహం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి ఎస్సై చంద్రశేఖర్ చేరుకుని మృతుడి జేబులోని పర్సు, ఫోన్‌ను పరిశీలించగా కుంభం గోవర్ధన్ మృతదేహంగా గుర్తించారు. పేదరికం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి తండ్రి చంద్రమౌళి, ఇద్దరు సోదరులున్నారు. సోదరుడు సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
పిడికెడు బియ్యం పట్టెడు అన్నం
సాక్షి, కరీంనగర్ : అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు పెద్దలు. అందుకేనేమో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రోజుకో పిడికెడు చొప్పున బియ్యం పక్కన పెట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. అలా సేకరించిన దాదాపు 70 క్వింటాళ్ల బియ్యాన్ని నిరుపేద కుటుంబాలకు పది కిలోల చొప్పున పంపిణీ చేశారు. లాఠీలతో కాఠిన్యం ప్రదర్శించే పోలీసులు పేదల ఆకలి తీర్చేందుకు నడుంబిగించడాన్ని జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు. మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నారు. -
గ్రామీణ మహిళలకు ఉపాధి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం దుర్శేడ్‌లోని గాంధీ చేతికాగిత పు పరిశ్రమను గురువారం శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. పాతబట్టలు,వ్యర్థ పదార్ధాలను ఉపయోగించి త యారు చేస్తున్న కాగితాలు, వాటితో వివిధ ఆకృతుల్లో రూపొందిస్తున్న వస్తువులను పరిశీలించారు. చేతికాగితపు చెట్లను పరిరక్షించడం జరుగుతుందని, గ్రామీణ మహిళలు ఉపాధి కలుగుతుందని తెలిపారు. పరిశ్రమ నిర్వాహకులు జె. రఘునందన్‌రావు తదితరులు ఉన్నారు. -
డీటీఓకు ఉపాధ్యాయ సంఘాల వినతి
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల నుంచి సీఎం సహాయనిధికి ఒకరోజు వేతనం విరాళం అంగీకారం తెలిపిన వారి నుంచే మినహాయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ట్రెజరీ అధికారి శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. సైనిక సంక్షేమ నిధికి ఏటా నవంబర్ నెల వేతనాల నుంచి విరాళం ఇస్తున్నామన్నారు. ఇప్పుడు సైనికుల సంక్షేమ నిధికి అదనంగా అవసరం అని ఎవరూ అడగలేదన్నారు. ఉపాధ్యాయుల అంగీకారం లేకుండా ఏ ఒక్కరి వేతనంతో కోత విధించరాదని వినతిపత్రంలో కోరారు. టీఎస్‌యూ అధ్యక్ష, కార్యదర్శులు కుమారస్వామి, అశోక్, టీపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున్, రాంచంద్రారెడ్డి, డీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు పి.ఈశ్వర్‌రెడ్డి, కోహెడ చంద్రమౌళి, ఎస్జీటీయూ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ మాధవ్, ఈ.పోచయ్య, టీపీఎస్‌హెచ్‌ఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు సుభాష్, శ్యాంసుందర్‌రెడ్డి ఉన్నారు. -
పోస్టాఫీస్‌కు కరెంట్ కట్
గోదావరిఖనిటౌన్ (రామగుండం) : జిల్లాలోనే అత్యధిక ఆదాయం ఉన్న గోదావరిఖని ప్రధాన పోస్టాఫీస్‌లో రెండు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. కార్యాలయం నిర్వహిస్తున్న భవనం యజమాని రెండు రోజుల క్రితం కరెంట్ కట్ చేశాడు. అద్దె ఒప్పందం ముగిసి మూడేళ్లు గడిచినా భవనం ఖాళీ చేయకపోవడంతో యజమాని కరెంటు సరఫరా నిలిపేశాడు. దీంతో కార్యాలయంలో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అధికారుల ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం లక్ష్మీనగర్‌లోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం ఉంది. రెండు రోజులుగా ఇందులో సేవలు నిలిచిపోయాయి. 15 ఏళ్లుగా దస్తగిరి కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో నెలకు రూ.11 వేల అద్దెతో ప్రధాన పోస్టాఫీస్ నిర్వహిస్తున్నారు. భవనం యజమానికి పోస్టాఫీస్ మధ్య ఉన్న అద్దె ఒప్పందం మూడేళ్ల క్రితం ముగిసింది. దీంతో భవనం యజమాని ఫారుక్ ప్రత్యామ్నాయం చూసుకోవాలని మూడేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. అయితే స్థానికంగా వినియోగదారులకు అందుబాటులో మరో అద్దె భవనం దొరకకపోవడంతో ఖాళీ చేయలేదు. యజమాని సోమవారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కరెంట్ కట్ చేశాడు. దీంతో రెండు రోజులుగా ప్రధాన పోస్టాఫీసులో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయం తెలియక వందలాది మంది పోస్టాఫీస్‌కు వచ్చి నిరాశగా వెనుదిరుగుతున్నారు. రోజుకు రూ.లక్షల్లో నష్టం... పోస్టాఫీస్ సేవలన్నీ నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రోజు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల నష్టం వాటిల్లుతోంది. కార్యాలయంలో ముఖ్యమైన సేవలు, డిపాజిట్లు, వడ్డీ స్వీకరణ, స్పీడ్ పోస్ట్‌లు, ఇతర 18 రకాల సేవలు స్తంభించాయి. వందలాది మంది నిత్యం నిర్వహించే కార్యకలాపాలు స్పీడ్ పోస్ట్, ఉత్తరాల పంపిణీ, రిజిస్టర్ పోస్ట్‌లు, రైల్వేటికెట్ బుకింగ్, ఆధార్ నమోదు, డిపాజిట్లు, వడ్డీ వితరణ, ఆన్లైన్ పోస్ట్, వెస్ట్రన్ మనీ ట్రాన్స్ఫర్ తదితర సేవలకు అంతరాయం కలిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి.. పోస్టల్ నిబంధనల ప్రకారం భవనానికి రూ.11 వేల నుంచి రూ.20 వేల వరకు అద్దె చెల్లించాలని ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఈ అద్దెకు స్థానికంగా మరొక భవనం దొరకక ఇదే భవనంలో ఉండాల్సి వస్తోందని పోస్ట్‌మాస్టర్ ఫజుర్ రహమాన్ తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న భవనాన్ని రూ.20 వేలలోపు అద్దెకు కేటాయించాలని అధికారులకు విన్నవించామని పేర్కొన్నారు. వారు స్పందించక పోవడంతో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, రామగుండం మేయర్, సింగరేణి జీఎంకు కూడా వినతిపత్రాలు అందించామని వివరించారు. ఎవరూ స్పందించడం లేదని చెప్పారు. అధిక ఆదాయం ఉన్న పోస్టాఫీస్.. జిల్లాలో అత్యధికంగా 10 వేలకు పైగా ఖాతాదారులు ఉన్న పోస్టాఫీస్ గోదావరిఖని బ్రాంచ్ మాత్రమే. ఇందులో నిత్యం లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. ఈ పోస్టీఫీస్‌లో ప్రస్తుతం సేవలు నిలిపోవడంతో లక్షల రూపాయల నష్టం కలుగుతోంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. నష్టం కలుగకుండా చూడాలి నిత్యం చాలా రకాల సేవలు పోస్టాఫీస్‌లో జరుగుతాయి. ఆకస్మికంగా విద్యుత్ కట్ చేసి సేవలు నిలిపి వేస్తే ప్రజలతోపాటు సంస్థ నష్టపోతుంది. అధికారులు, పాలకులు స్పందించి వెంటనే కరెంట్ పునరుద్ధరించి నష్టం కలుగకుండా చూడాలి. పోస్టాఫీస్‌ను కూడా మరో భవనంలోకి మార్చేలా చొరవ తీసుకోవాలి. – ఫజుర్ రహమాన్, పోస్ట్‌మాస్టర్, గోదావరిఖని -
సూపర్ పోలీస్.. రెండు గంటల్లో గుండె తరలింపు
సాక్షి, కరీంనగర్ : ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బె్రయిన్ డెడ్ అయిన ఒక యువకుడి గుండెను రోడ్డు మార్గంలో కరీంనగర్ నుంచి కేవలం రెండు గంటల్లో హైదరాబాద్ చేర్చి మరో వ్యక్తి ప్రాణాలు కాపాడారు కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు... వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 8న జగిత్తాల జిల్లా కోరుట్ల మండలం చిన్న మెట్‌పల్లికి చెందిన మేకల నవీన్ కుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అపోలో రీచ్ ఆస్పత్రికి తరలిచారు. నవీన్‌ను ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు పలు ప్రయత్నాలు చేసినా ఫలితం లేక శుక్రవారం రాత్రి బ్రెయిన్ డెడ్ అయి మరణించాడు. అదే సమయంలో జీవన్‌ధార ట్రస్ట్ నిర్వాహకులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో మరో వ్యక్తికి గుండె మార్పిడి అవసరం ఉందని గుర్తించారు. అయితే రెండు గంటల్లో గుండెను కరీంనగర్ నుంచి హైదరాబాద్ తరలించాలి. దీంతో కరీంనగర్ పోలీసులు హైదరాబాద్, సిద్దిపేట పోలీసుల సహకారంతో గ్రీన్‌ఛానెల్ ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 6.50 గంటలకు ప్రత్యేక వాహనంలో బయలుదేరి 8.50 గంటలకు గుండెను అపోలో ఆస్పత్రికి చేర్చారు. అనంతరం నవీన్ గుండెను 47ఏళ్ల వ్యక్తికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతమైంది. గుండె తరలింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ వీబీ కమలాసన్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను అపోలో సంస్థల చైర్మెన్ ప్రతాప్ సి రెడ్డి అభినందించారు. -
పవన్ నోట జైతెలంగాణ..
సాక్షి, కరీంనగర్: తెలంగాణ నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మంగళవారం జైతెలంగాణ అంటూ నినదించారు. రెండోరోజు కరీంనగర్లో అభిమానులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నేల తల్లికి ఆఖరిశ్వాస వరకు రుణపడి ఉంటానని అన్నారు. జైతెలంగాణ నినాదం వందేమాతరం అంతటి గొప్ప వాక్యమని అన్నారు. ‘ఆంధ్ర నాకు జన్మనిస్తే.. తెలంగాణ నాకు పునర్జన్మను ఇచ్చింది. ప్రమాదం నుంచి నన్ను కాపాడి కొండగట్టు ఆంజనేయుడు పునర్జన్మను ఇచ్చాడు. అందుకే తెలంగాణ నుంచి నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాను. తెలంగాణ నేల తల్లికి ఆఖరి శ్వాసవరకు రుణపడి ఉంటాను. జై తెలంగాణ.. ఆ నినాదం నాకు అణువణువు పులకరింత ఇస్తుంది. వందేమాతరం ఎలాంటి పదమో, మంత్రమో.. జై తెలంగాణ కూడా అలాంటి గొప్ప మహావాక్యం. దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు మాత్రం సంవత్సరం తర్వాత వచ్చింది. దేశమంతా పండుగ జరుపుకుంటే.. తెలంగాణ ఇంకా మా స్వేచ్ఛ ఎప్పుడు అనుకుంటూ గడిపింది. ఆ ఆ సమయంలో గుండెల్లో మార్మోగిన నినాదమే జై తెలంగాణ. తెలంగాణలోని కరీంనగర్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు. -
కాజీపేట - కరీంనగర్ రైల్వే లైన్‌కు ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్ : కాజీపేట నుంచి కరీంనగర్‌కు నేరుగా రైల్వేలైన్ నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. ప్రస్తుతం కాజీపేట నుంచి కరీంనగర్ వెళ్లేందుకు పెద్దపల్లి మార్గంలో రైల్వే లైన్ ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. కాజీపేట నుంచి వయా హుజురాబాద్ మీదుగా కరీంనగర్‌కు రైల్వేలైన్ నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అధ్యయనం చేయనున్నట్లు ఎంపీ వినోద్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్‌తో తెలంగాణ ఎంపీలు బుధవారం సమావేశమై కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ర్టానికి రైల్వే కేటాయింపుల ప్రాధాన్యాలు, పెండింగ్ పనులపై చర్చించారు. ఈ సమావేశానికి ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కే కేశవరావు, నగేష్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పసునూరి దయాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు. రైల్వే జీఎంతో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలని నెరవేర్చాలని రైల్వే జీఎంను కోరినట్లు వినోద్ తెలిపారు. తెలంగాణలో మూడు రైల్వే లైన్లు మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్తపల్లి - మనోహరాబాద్ పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్‌ను ఎలక్ట్రిఫికేషన్ చేయాలని కోరామని తెలిపారు. ఇందుకు టెండర్లు కూడా పిలిచినట్లు లిఖితపూర్వంగా రైల్వే జీఎం సమాధానం ఇచ్చారని చెప్పారు. ఈ మార్గాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేస్తే మెమో, లోకల్ రైళ్లు తిరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తక్కువగా ఉన్నాయని వినోద్ తెలిపారు. ఈ క్రమంలో రైల్వే లైన్ల కిలోమీటర్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ... దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో ముందు ఉందని పేర్కొన్నారు. కానీ సమస్యల పరిష్కారంలో దక్షిణ మధ్య రైల్వే ఆలస్యం చేస్తున్నదని తెలిపారు. 1997లో నల్లగొండ - మాచర్ల మధ్య లైన్ మంజూరైనప్పటికీ.. 20 ఏండ్లు అయినా పనులు ప్రారంభం కాలేదని ఎంపీ గుర్తు చేశారు. పగిడిపల్లి - నల్లపాడు డబ్లింగ్ పనుల గురించి అడిగితే కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. జగ్గయ్యపేట - మేళ్లచెర్వు గూడ్స్ మార్గాన్ని ప్యాసింజర్ లైన్‌గా మార్చాలని రైల్వే జీఎంకు విజ్ఞప్తి చేశామని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డిపై ఏసీబీ కేసు
సాక్షి, కరీంనగర్ : వడ్డీవ్యాపారి, మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు గురువారం కేసు నమోదుచేశారు. కోతి రాంపూర్‌కు చెందిన గట్టయ్య తీసుకున్న అప్పు కింద అక్రమంగా ఇల్లు కబ్జా చేయడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన గౌడ్ మీడియాకు తెలిపారు. -
శాతవాహన వర్సిటీ వద్ద ఉద్రిక్తత
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వద్ద స్థానిక యువకులకు, కాలేజీ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ దగ్గర మనుధర్మ శాస్త్రాన్ని పీడీఎస్యు, డీఎస్యు, బీఎస్ఎఫ్ విద్యార్థులు తగులబెట్టారు. దీంతో ఈ సంఘాల విద్యార్థులు, స్థానిక యువకులు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నగర పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ అక్కడకు చేరుకుని కమలాసన్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఆయన వారితో మాట్లాడి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య
కరీంనగర్ : అమెరికాలో దుండగుల చేతిలో మరో తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒహియోలోని ఓ మాల్లో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా వాసి కరేంగ్లే కరుణాకర్ (53)పై ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గత వారం (డిసెంబర్ 8) చోటుచేసుకుంది. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కాగా కాల్పులకు పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు కరుణాకర్‌కు భార్య విజయ, కుమారుడు అంకిత్ ఉన్నారు. వీరు ప్రస్తుతం కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. కరుణాకర్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
ప్రేమజంటపై దాడి..
సాక్షి,జమ్మికుంట: గత నెల సికింద్రాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో ఓ ప్రేమజంట వివాహం చేసుకుంది. ఇది జీర్ణించుకోలేని అమ్మాయి తరపు బంధువులు ఆ జంటపై దాడిచేశారు. ఈ ఘటన కరీంగనర్ జిల్లాలో జరిగింది. వివరాలివి.. మహబూబాబాద్ అమ్మాయి, మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన ప్రవీణ్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్‌లో గతనెల పెళ్లి చేసుకున్నారు. దీంతో అమ్మాయి తరపు వారు వాహనాల్లో వచ్చి ప్రవీణ్‌పై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. గ్రామస్తులు ఒక వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనంతో పాటు ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వృద్ధుడి సజీవ దహనం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పొలంలో చెత్తను కాల్చుతుండగా ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని ఓ వృద్ధుడు సజీ దహనమయ్యాడు. ఈ ఘటన మాల్యాల్ మండలం ముత్యంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన సంత ఆదిరెడ్డి(70) అనే వృద్ధుడు రోజువారి పనిలోభాగంగానే పోలానికి వెళ్లాడు. తన పొలంలో చెత్త కాల్చుతుండగా ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హాస్యానికి నంది
► తాగుబోతు రమేశ్‌కు అవార్డు ► అమ్మానాన్నలే మొదటి గురువులు ► ఉత్తమ హాస్యనటుడిగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ► 150 చిత్రాల్లో ప్రతిభ చాటుకున్న నటుడు కోల్‌సిటీ(రామగుండం) : సర్.. ఒక్క ఛాన్సివ్వండి.. నేనేంటో చూపిస్తా అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గోదావరిఖనికి చెందిన తాగుబోతు రమేశ్... నంది అవార్డుకు ఎంపికయ్యాడు. ఒక్కఛాన్స్ సర్... అంటూ స్టూడియోల చుట్టూ తిరిగిన సింగరేణి గని కార్మికుడి కొడుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు... చుక్క మందు కూడా తీసుకోని అతను ఒక్క సన్నివేశమైనా పెడితే బాగుండని డైరెక్టర్లు ఫోన్ చేసి పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు... చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో... కాలే కడుపుతో కళను నమ్ముకుని ఎలాగైనా నటిస్తాను... నా నటనతో నవ్విస్తానని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో తాగుబోతు రమేశ్ పండించిన హాస్యానికి అబ్బురపడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఉత్తమ హాస్యనటుడిగా గుర్తిస్తూ నంది అవార్డుకు ఎంపిక చేసింది. ఇదీ ఫ్యామిలీ... రామిళ్ల చినవెంకటి ఉరఫ్ పొట్లరాములు–రాజమ్మ దంపతులు ఉద్యోగరీత్యా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉన్నారు. వీరికి నలుగురు కుమారులు, కూతురు సంతానం. వెంకటయ్య ఆర్జీ–1 పరిధిలోని 2వ గనిలో మెకదామ్గా పని చేసి రిటైర్ అయ్యాడు. పెద్ద కుమారుడు కుమార్ తండ్రి వారసత్వ ఉద్యోగాన్ని శ్రీరాంపూర్‌లో సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు సదానందం హాస్టల్ వార్డెన్‌గా పని చేస్తున్నాడు. మూడో కొడుకు వెంకటస్వామి గోదావరిఖనిలో ఉంటున్నాడు. నాలుగో కొడుకైన రమేశ్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీస్‌లో తాగుబోతు రమేశ్గా ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగాడు. ఇటీవలనే స్వాతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అమ్మా, నాన్నలే గురువులు... సింగరేణి బొగ్గుబాయిలో పనిచేసే రమేశ్ తండ్రి వెంకటి అలిసిపోయి మద్యం తాగి ఇంటికి వస్తే... తండ్రిని అనుసరిస్తూ తల్లిని ఆటపట్టించడానికి, రమేశ్ చేసిన అల్లరి చేష్టలకు రాజమ్మ మురిసిపోయేది. భలే చేసినవురా కొడుకా... ఇంకోసారి సెయ్యిబిడ్డ సూత్త అంటూ ప్రోత్సహించేది. రమేశ్‌లో తెలియకుండానే ఈ నటన నాటుకుపోయింది. ఎక్కడ స్టేజీ ఫోగ్రాం ఉంటే అక్కడ రమేశ్ ప్రత్యక్ష్యమయ్యేవాడు. తాగుబోతు నటనకు అందరూ చప్పట్లతో అభినందించేవారు. కానీ రమేశ్ చుక్క మందు తీసుకోడు. మిత్రుల ప్రోత్సాహంతో ఈ నటననే సినిమా ఇండస్ట్రీ వైపు రమేశ్‌ను నడిపించింది. పదేళ్ల క్రితం ఇండస్ట్రీ వైపు... సినిమా పిచ్చే రమేశ్‌ను ఇండస్ట్రీకి నడిపించింది. ఈ పిచ్చితోనే ఎలాగైనా సినిమాలో ఛాన్స్ కొట్టాలని 2006లో హైదరాబాద్‌కు వెళ్లాడు. రాత్రిళ్లు పార్ట్‌టైం పనులు చేస్తూ... పగలంతా ఫిలిం ఇండస్ట్రీలలో తన నటనను డైరెక్టర్లకు చూపించడానికి కాలిబాటలో తిరిగాడు. రోడ్ల పక్కన తాగుబోతులు, మానసిక రోగులు పడుతున్న ఇబ్బందులు చూసిన రమేశ్... రూంకెల్లాక వారిని అనుసరిస్తూ ప్రాక్టిస్ చేసేవాడు. మిత్రుల ముందు వాటిని ప్రదర్శిస్తూ వారెలా ఫీలవుతున్నారో గమనించేవాడు. అక్కినేని ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ పొందాడు. ఎన్నో కష్టాలు పడి చివరికి డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన మహాత్మ చిత్రం ద్వారా తన నటనను రంజిపజేయడంతో, ప్రపంచానికి కొత్త అనుభూతిని పంచే హాస్యనటుడిగా పరిచయమయ్యాడు. సుమారు 150కు పైగా సినిమాల్లో ప్రతిభ తాగుబోతు రమేశ్గా ఇప్పటికీ సుమారు 150కు పైగా తెలుగు సినిమాల్లో నటించాడు. జగడం, మహాత్మ, భీమిలి కబడ్డి జట్టు, అలా మొదయ్యింది, పిల్లజమిందార్, ఈగ, రచ్చ, రొటీన్లవ్ స్టోరీ, చిత్రాలు బెస్ట్ హాస్యనటుడిగా గుర్తింపు వచ్చింది. అలాగే జగడం, గొడవ, నామనసుకు ఏమైంది, ఈ వయసులో, అప్పలరాజు, వాంటెడ్, అహానాపెళ్లంట, ఎస్ఎంఎస్, కెమెరామెన్ గంగతో రాంబాబు, డమరుకం, 100% లవ్, సుడిగాడు, ఇష్క్, షాడో, శ్రీనువైట్ల దర్శకత్వంలో బాద్షా, అరుపు, దశమి, దళం, చదువుకోవాలి, కూల్బాయ్స్ హాట్గాళ్స్, జీనియస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తదితర అనేక సినిమాల్లో రమేశ్ నవ్వులు కురిపించాడు. పవన్‌కళ్యాణ్, రాంచరణ్, శ్రీకాంత్, నానీ, రామ్ తదితర నటులు, కృష్ణవంశీ, రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకుల సినిమాల్లో రమేశ్ నటించాడు. హాస్యం, మిమిక్రీతోపాటు పాటలుకూడా పాడుతున్నాడు. ఇష్క్ సినిమాలో కోడివాయ లచ్చమ్మదీ...,అతడు ఆమె ఓ స్కూటర్ సినిమాలో.. బస్టాప్ శరణం గచ్ఛామి... అనే పాటలు పాడాడు. -
కరీంనగర్లో ఫుల్లుగా తాగి యువతి రచ్చ
కరీంనగర్: కరీంనగర్లో ఓ యువతి నానా రచ్చ చేసింది. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడటమే కాకుండా పోలీసులపైనే తిరుగుబాటుకు దిగింది. ఇది తమ వ్యక్తిగత విషయమంటూ వారిపై చిందులేసింది. ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, కరీంనగర్లో ఓ యువతి నలుగురు యువకులతో కలిసి డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడింది. పోలీసుల అదుపులో ఉండగానే వారిపై తిరగబడింది. ఇష్టమొచ్చిన మాటలతో తిట్టింది. 'ఏంటలా చూస్తున్నారు అందరూ వెళ్లిపోండి.. ఇది మా పర్సనల్ విషయం మీకేమిటి. నన్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్'.. అంటూ అక్కడ ఉన్నవారిపై తిట్ల వర్షం కురిపించింది. 'మేం ఏజ్ లో ఉన్నాం.. మీకు అర్థమవట్లేదా మేం బయటకు పోతున్నామని, మీకు చెబితే అర్థం కాదా, ప్రూప్స్ కావాలా' అంటూ పోలీసుల మీదకు ఉరికింది. ఆమె పక్కన యువకులు మాత్రం ఇదే తొలిసారి అని, ఆమెకు ఇంతకు ముందు మద్యం తాగడం అలవాటు లేదని, ఈ ఒక్కసారి క్షమించి వదిలేయాలని పోలీసులను బతిమిలాడుతున్నారు. అయినప్పటికీ ఆ యువతి తన స్నేహితులను కూడా పక్కకు లాగేస్తూ పోలీసులపై వాగ్దాటిని చూపించింది. ఇదంతా కూడా ఓ వీడియోలో రికార్డయింది. అయితే, పోలీసులు ఈ వివరాలు బయటకు రాకుండా చూడాలని ప్రయత్నించినప్పటికీ ఆలస్యంగా వీడియో బయటపడింది. -
వరద కాల్వలో పడి తల్లీకొడుకు మృతి
రామడుగు: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరద కాలువలో పడి తల్లీ కొడుకు మృతిచెందిన సంఘటన జిల్లాలోని రామడుగు మండల తిర్మలాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని పెంచాలపల్లి వరదకాలువలో పడి తల్లీకొడుకు మృత్యవాత పడ్డారు. మృతులు పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన సులోచన, మనోజ్‌లుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బహిరంగంగా చెత్తవేస్తే రూ.500 జరిమానా
కరీంనగర్ : బహిరంగంగా చెత్త వేస్తే రూ. 500 జరిమానా విధిస్తామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను ప్లాస్టిక్ ఫ్రీ, ఫ్లెక్సీ ఫ్రీ టౌన్లుగా తీర్చిదిద్దుతామని ఆయన సోమవారం కరీంనగర్లో తెలిపారు. ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే జూన్ 2కల్లా అక్రమ నల్లాల కనెక్షన్లను క్రమబద్దీకరిస్తామన్నారు. రూపాయికే నల్లా కనెక్షన్ అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. పారిశుద్ధ్యం, మంచినీటి వ్యవస్థ, మెయిన్టెనెన్స్ మూడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మున్సిపాలిటీల్లో 20 అంశాల ఎజెండాను నిర్ణయిస్తామన్నారు. వచ్చే నవంబర్ 2నాటికి 20 అంశాల్లో మూడో వంత లక్ష్యం సాధించే దిశగా పనిచేస్తామన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో షీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆగస్ట్ 15లోగా మున్సిపాలిటీ లే అవుట్ స్థలాల్లో గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
ముగ్గురు దొంగల అరెస్ట్
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, ధర్మారం, సుల్తానాబాద్ తదితర మండలాల్లో జరిగిన 12 చోరీ ఘటనలలో వీరు నిందితులు. నిందితులు భాగ్యలక్ష్మి, బయ్యాల శంకర్, సమ్మయ్యల స్వస్థలం కరీంనగర్ జిల్లా వీణవంక. ఈ మేరకు పెద్దపల్లి డీఎస్పీ నల్లమల్లారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. -
నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
ఇంక్లైన్ కాలనీ : కరీంనగర్ జిల్లా ఎయిట్ ఇంక్లైన్ కాలనీలోని శ్రీలంక షిర్కే క్వార్టర్స్ సమీపంలో ఉన్న ఓ నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు మోహిద్(9), సల్మాన్(7) లను అన్నదమ్ములుగా గుర్తించారు. ఇద్దరు చిన్నారుల మృతితో కాలనీలో విషాదం అలుముకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మలచండి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్‌ను చేర్చాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారితో కలిసి వెంకయ్యనాయుడితో ఈ అంశంపై చర్చించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జాబితాలో చేరేందుకు కరీంనగర్ ప్రణాళికలో కొన్ని సంస్కరణలు అవసరమని, దీనిపై అధికారులకు సూచనలిచ్చిన ట్లు మంత్రి వెల్లడించారు. -
అవన్నీ కాంగ్రెస్ ప్రాజెక్టులే: పొన్నం
కరీంనగర్: సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించినవేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారని విమర్శించారు.కరీంనగర్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం ఒక్క మెదక్ జిల్లాను తప్ప మిగిలిన ఏ జిల్లాను కూడా పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్ల పాలనలో కరీంనగర్ జిల్లాకు చేసింది శూన్యమని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయకుండా కేవలం తన మార్కు చూపించాలని తాపత్రయపడుతున్నారని అన్నారు. -
భక్తులతో పోటెత్తిన కొండగట్టు
మల్యాల : కరీంనగర్ జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. గురువారం అర్థరాత్రి వరకు 70వేల మంది స్వామిని దర్శించుకోగా శుక్రవారం ఉదయం మరో 30 వేల మంది మాలధారులు ఇక్కడికి చేరుకుని చందనాభిషేకంలో పాల్గొన్నారు. ఆలయంలో శుక్రవారం రాత్రి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలకు మరో 70 వేల మంది రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
కొండగట్టుకు భక్తుల తాకిడి
మల్యాల: కరీంనగర్ జిల్లా కొండగట్టులోని ఆంజనేయ ఆలయానికి భక్తుల రాక మొదలైంది. శుక్రవారం ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల్లో పాల్గొనేందుకు హనుమాన్ మాల ధారులు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కాలినడకన కొండగట్టుకు చేరుకోవటం ఆనవాయితీ. సాయంత్రానికి దాదాపు 40వేల మంది మాలధారులు ఇక్కడికి చేరుకుంటారని అంచనా. రేపు జరిగే ఉత్సవాల్లో లక్ష మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. -
'ఒక్క యూనివర్సిటీకీ తెలంగాణ వీసీ లేరు'
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క విశ్వవిద్యాలయానికి తెలంగాణకు చెందిన వీసీలు లేరని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 664 టీచింగ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థలను విజిలెన్స్ విచారణ పేరుతో వేధించడం సరికాదని అభిప్రాయపడ్డారు. -
కరీంనగర్ లో హమాలీ కార్మికుల ధర్నా
కరీంనగర్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. హమాలీ రేటు రూ. 20కి పెంచాలని, కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ అమలు పరచాలని, జనశ్రీ బీమాను రూ. 5లక్షలకు పెంచి, కార్మికులకు రూ.10 వేల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళా స్వీపర్లకు కనీస వేతనాలు, పీఎఫ్ అమలు చేసి , మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ తక్షణమే చెల్లించాలని కోరారు. -
వడదెబ్బతో ఇద్దరి మృతి
మహదేవ్పూర్: రోజు రోజుకు పెరుగుతున్న ఎండలకు జనాలు పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలంలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతిచెందారు. మండల కేంద్రానికి చెందిన రఘునాథ స్వామి(75) వడదెబ్బకు గురై మృతి చెందగా.. మండలంలోని ఎంకపల్లి గ్రామానికి చెందిన లచ్చయ్య(40) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు వడదెబ్బ తగిలి చనిపోయాడు. -
కత్తులతో బెదిరించి దోపిడీ
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని బొమ్మనకల్ బైపాస్‌రోడ్డులో దుండగులు ఓ మహిళను కత్తులతో బెదిరించి మెడలోని ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. శివాజీనగర్‌కు చెందిన కుంట అంజలి బుధవారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుకకు వెళుతున్న క్రమంలో హెల్మెట్ ధరించిన ఇద్దరు బైక్‌పై వచ్చి ఆమెను అడ్డగించారు. కత్తులతో బెదిరించి ఆమె మెడలోని 20 తులాల బంగారు ఆభరణాలను తెంపుకుని పరారయ్యారు. ఈ క్రమంలో మహిళకు గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కష్టార్జితం దొంగలపాలు..
మల్లాపూర్: కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావు పేటలో శనివారం మిట్ట మధ్యాహ్నం దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన మిట్ట లక్ష్మి భర్త ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అతడు ఇటీవల రూ.1.90 లక్షల నగదు భార్యకు పంపాడు. ఆ నగదును లక్ష్మి బీరువాలో భద్రపరిచి శనివారం ఉపాధి పనులకు వెళ్లింది. గుర్తు తెలియని దుండగులు మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని నగదును ఎత్తుకుపోయారు. భోజన సమయంలో ఇంటికి చేరుకున్న లక్ష్మి దొంగతనం విషయం గ్రహించి గ్రామస్తుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై షేక్ జాన్పాషా సంఘటన స్థలిని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. -
'డబుల్' ఇంటి కోసం ఆత్మహత్యాయత్నం
శంకరపట్నం : సర్కారు వారి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల జాబితాలో తన పేరు లేదంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి 20 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించగా... అధికారులు 25 మంది పేర్లతో ఓ జాబితాను రూపొందించారు. దీనిపై చర్చించేందుకు శనివారం గ్రామసభ ఏర్పాటు చేశారు. జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపం చెందిన పైడిపల్లి రేణుక (30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయింది. వెంటనే ఎంపీపీ విజయ ఆమె చేతిలోని పురుగుల మందు డబ్బా లాగేసుకున్నారు. జాబితాలో చోటు కల్పిస్తామని చెప్పి ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. -
గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి సజీవదహనం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ గ్యాస్‌సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో సామంతుల అంజయ్య(25) అనే యువకుడు ఇంట్లో ఉన్నాడు. మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీటి తొట్టిలో పడి బాలుడు మృతి
ఎల్కతుర్తి: కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కొతులారం గ్రామంలో ప్రమాదవశాత్తు బాలుడు నీటితొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన గట్టు శ్రీనివాస్, రజిత దంపతులకు లిఖ్యాత్(2) అనే కుమారుడున్నాడు. గురువారం రజిత ఉపాధి హామీ పనులకు వెళ్లగా శ్రీనివాస్ కుమారుడితో ఇంటి వద్దే ఉన్నాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లిఖ్యాత్ ఆడుకుంటుండగా గమనించిన తండ్రి కాసేపు ఏమరుపాటుగా ఉన్నాడు. ఆ సమయంలోనే నీళ్ల తొట్టి వద్దకు వెళ్లిన బాలుడు అందులో పడి పోయాడు. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ గమనించేసరికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. -
డిగ్రీ పరీక్షల్లో నకిలీ అభ్యర్థులు
కోరుట్ల: అసలైన అభ్యర్థుల్లా డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఇద్దరు నకిలీలను పరీక్షా కేంద్రం సిబ్బంది పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకంది. బీకామ్ మూడో సంవత్సరం కమర్షియల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ పరీక్షను రిజ్వాన్ పాషా, అమీర్ పాషా అనే విద్యార్థులు రాయాల్సి ఉండగా వారికి బదులు నవీద్, జమీర్ అనే వారు రాస్తున్నారు. కళాశాల సిబ్బంది పరిశీలనలో విద్యార్థులు నకిలీలని బయటపడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు విచారణ ప్రారంభించారు. నవీద్, జమీర్ ఎంబీయే పూర్తి చేసిన వారు కావడం గమనార్హం. -
ఒకే స్పాట్లో రెండు షాకింగ్ ఇన్సిడెంట్లు
ఒకటే స్పాట్ లో రెండు షాకింగ్ ఇన్సిడెంట్లు.. క్షణాల తేడాతో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. త్వరగా వెళ్లాలనే తాపత్రయం ఒక ప్రమాదానికి కారణమైతే..రోడ్డుమీద వున్న రాయి మరో ప్రమాదానికి దారి తీసింది... ప్రమాదానికి గురైన ఇద్దరూ మహిళలే...అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రెండు సంఘటనలు కరీంనగర్లో జరిగాయి. కోర్టు వైపు నుంచి శివథియేటర్ వైపు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి వచ్చిన బైకిస్టు ఓవర్టేక్ చేయాలని వేగం పెంచి దాటే ప్రయత్నం చేశాడు. ఒక్క సారి కుదుపు రావడంతో బైక్ వెనుక కూర్చున్న అమ్మాయి అదుపుతప్పి కిందపడిపోయింది. వెంటనే అప్రమత్తమైన టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినా...టిప్పర్ దాదాపు అమ్మాయి మీదకు వెళ్లి ఆగింది. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలు నిలిచాయి. కానీ తీవ్రగాయాలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ప్రమాదం గురైన అమ్మాయి తెలిపిన వివరాల ప్రకారం పరీక్షల హాల్ టిక్కెట్ మరచిపోవడంతో ఇంటికి వెళ్లి తీసుకుని, ఎగ్జామ్ టైం అవుతుందని వేగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. అదే ప్రాంతంలో క్షణాల తేడాతో మరో ఘటన జరిగింది.. ఒక వైపు టిప్పర్ ఘటన జరిగినప్పుడే కుడివైపున మరో ప్రమాదం జరిగింది. శివ థియేటర్ వైపు నుంచి కోర్టు వైపు వెళ్తున్న ఒక బైక్...రోడ్డు పక్కన ఉన్న రాయిపై ఎక్కడంతో కంట్రోల్ తప్పింది. దీంతో వెనుక కూర్చున్న మానస అనే మహిళ ఒక్కసారిగా వెల్లకిలా పడిపోయింది. అదృష్టం కొద్దీ వెనుక వాహనాలు ఏవీ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. క్షణాల తేడాతో జరిగిన ఈ రెండు ప్రమాద దృశ్యాలు సమీపంలో వున్న ఓ కంప్యూటర్ షాపులో అమర్చిన సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఈ రెండు ప్రమాద ఘటనలు ఎప్పుడు జరిగాయో తెలియరాలేదు. -
సెల్‌టవర్ కు నిప్పుపెట్టిన దుండగులు
కోనరావుపేట: కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులో నిర్మాణంలో ఉన్న ఓ సెల్‌టవర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో సెల్‌టవర్ కింద భాగంలో ఉన్న కేబుల్ వైర్లు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రాజ్‌కుమార్ గౌడ్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ వేధిస్తున్నాడని నర్సుల ఆందోళన
చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వేధిస్తున్నారంటూ నర్సులు, ఏఎన్ఎం లు ఆరోపిస్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తించే డాక్టర్ వసంతరావు లైంగికంగా వేధిస్తున్నారని వారు సోమవారం విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. జిల్లా వైద్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళతామంటూ కరీంనగర్ తరలి వెళ్లారు. -
రెడ్డిపల్లిలో చోరీ
వీనవంక: కరీంనగర్ జిల్లా వీనవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అడిగొప్పుల సంపత్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. పెంకుటిల్లు పైకప్పు తొలగించి ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, రూ.45 వేల నగదు దోచుకెళ్లారు. శుక్రవారం రాత్రి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. -
బావిలో పడి వ్యక్తి మృతి
ఎల్కతుర్తి: వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నథపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆరెపల్లి సమ్మయ్య(55) ఈ రోజు బావి వద్ద పని చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఇది గుర్తించిన తోటి రైతులు మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
10 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
తిమ్మాపూర్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు అడ్డుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ క్రాస్ రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 10 బస్తాల బియ్యాన్ని గుర్తించిన అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఎల్లయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీనియర్ల దాడి: విద్యార్థి పరిస్థితి విషమం
సుల్తానాబాద్: సీనియర్ విద్యార్థుల దాడిలో ఓ విద్యార్థి తీవ్రగాయాలపాలయ్యాడు. కరీంనగర్ మండలం సీతారాంపుర్కి చెందిన రాజేందర్(17)స్థానిక సైన్స్‌వింగ్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అతని ఇంటికి వచ్చిన ఐదుగురు సీనియర్ విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు అతని పై కత్తులతో దాడులు చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్నేహితుల మధ్య చిచ్చు రేగడానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. -
కరీంనగర్ జిల్లాలో రైతు ఆత్మహత్య
చిగురుమామిడి: అప్పుల బాధతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోనే తండ్రి కూడా తనువు చాలించాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎస్కే బురాన్(50) కౌలు రైతు. ఇతనికి కొడుకు యాకూబ్ వ్యవసాయంలో సాయ పడుతుంటాడు. గత రెండేళ్లుగా వ్యవసాయం కలసి రాకపోవటంతో అప్పులు రూ. 4 లక్షల వరకు మిగిలాయి. అవి తీరేదారి కానరాక యాకూబ్ నెల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అధికారులెవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కౌలు రైతుగా యాకూబ్‌ను గుర్తించలేదు. దీంతో ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం అందాల్సిన సాయం రాదనే మనోవేదనతో బురాన్ మంగళవారం రాత్రి పొలంలోనే ఉరి వేసుకున్నాడు. -
‘తపాలా సేవలన్నీ ఆన్లైన్లోనే..’
బోయిన్పల్లి: ఇకపై తపాలా సేవలన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతాయని కరీంనగర్ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి చెప్పారు. బుధవారం జిల్లాలోని బోయిన్పల్లి సబ్‌పోస్ట్ ఆఫీసులో ఆన్లైన్ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తపాలా సేవలను ఆన్లైన్లో అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్డీలు, మనియార్డర్లు సహా అన్నీ ఆన్లైన్ విధానంలోనే జరుగుతాయన్నారు. -
27మంది బాల కార్మికులకు విముక్తి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో పలు హోటళ్ల పై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లలో పని చేస్తున్న 27 మంది బాల కార్మికులను గుర్తించారు. వారికి పని నుంచి విముక్తి కలిగించి బాలసదన్‌కు తరలించారు. మరోసారి చిన్నారులతో పని చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హోటళ్ల యజమానులను హెచ్చరించారు. -
భవనంపై నుంచి దూకి యువకుని ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ పట్టణలోని డాక్టర్స్ వీధిలోని నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. అశోక్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు, అతని పూర్తి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఒడిశా కార్మికుల ఆందోళన ఉదృతం
కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్ ఒడిశా కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఇసుక బట్టీల్లో కార్మికులపై యాజమాన్యాల వేధింపులు ఎక్కువయ్యాయని, వారిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు ఒడిశా అధికారులకు సమాచారం అందించారు. కార్మిక శాఖ అధికారులు ఆందోళన చేపట్టిన వారిని సముదాయిస్తున్నారు. గురువారం పెద్దపల్లి మండలం రంగాపూర్ లో ఓ బట్టీ యజమాని తమపై దాడి చేశాడని, తమకు న్యాయం చేయాలని కూలీలు రోడ్డెక్కారు. వారు కాలినడక జిల్లా కేంద్రానికి అర్ధరాత్రి తరలిరావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటుక బట్టీల్లో కూలీల పరిస్థితి, సౌకర్యాలపై జిల్లా జడ్జి నాగమారుతీశర్మ పరిశీలించి, కూలీలను సొంత మనుషుల్లా చూసుకోవాలని చెప్పి వెళ్లిన 24 గంటల్లోనే అదే బట్టీలో ఈ ఘటన జరగడం గమనార్హం. -
'గోపాల మిత్రలకు కనీస వేతనం ఇవ్వాలి'
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ గోపాల మిత్రుల సంఘం సభ్యులు గురువారం రిలే నిరాహార దీక్షలకు దిగారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.13,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాద భీమా పథకాన్ని గోపాల మిత్రలకు వర్తింపజేయాలని కోరారు. పశుసంవర్థక శాఖలో పనిచేసే గోపాల మిత్రలకు విద్యార్హతల ఆధారంగా ఆఫీసు సబార్డినేట్ లుగా నియమించాలని నినదించారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘం సభ్యులకు సంఘీభావం తెలిపారు. -
గుంతలో పడ్డ ఆటో..ఇద్దరి మృతి
బోయినపల్లి : కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఆటో అదుపుతప్పి ఓ గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. చందుర్తి మండలం మర్రిపెల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి అనీష్(20), పండగ జలేందర్(21) అనే ఇద్దరు యువకులు ఈ ఘటనలో మృతి చెందగా..మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కరీంనగర్లో ఉద్రిక్తత
కరీంనగర్: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ.. అధికారులు గుడిని కూల్చేయడం కరీంనగర్ పట్టణంలో కలకలం రేపింది. హెలీప్యాడ్ పార్కులోని అంజనేయ స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన నవగ్రహాల గుడిని రెవిన్యూ అధికారులు అర్థరాత్రి కూల్చేశారు. ఈ ఘటనతో స్థానికులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూల్చివేసిన గుడి పునర్ణిర్మాణానికి భూమి పూజ నిర్వహించడంతో ఆందోళనకారులు కొంత శాంతించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నగరంలో భారీగా పోలీసులను మోహరించారు. -
చెట్టును ఢీకొన్న స్కూల్ వ్యాన్
- ఎనిమిది మందికి గాయాలు - ఒకరి పరిస్థితి విషమం మంతని: విద్యార్థులను స్కూల్‌కి తీసుకెళుతున్న వ్యాన్ చెట్టుకు ఢీకొనగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం రామకృష్ణాపురంలో జరిగింది. మేరి మీడియా పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులను టాటా ఏసీ వాహనంలో స్కూలుకి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో వ్యాన్ పట్టీలు విరిగిపోయాయి. దీంతో అదుపు తప్పిన వ్యాన్ చెట్టుకు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. అందులో పోలు నరేష్(9) అనే విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ అసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి రైతు ఆత్మహత్య
రాయికల్: అప్పుల బాధ తాళలేక పత్తి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం మైథాపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లారెడ్డి (50) అనే రైతు పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. అప్పు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జల్సాలకు అలవాటుపడి...
కరీంనగర్: జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పట్టిన ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 6 తులాల బంగారు ఆభరణాలతో పాటు 250 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్లో గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వరపర్తి సతీష్(30) కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు. అయితే జల్సాలకు అలవాటు పడిన సతీష్ దొంగతనాల బాట పట్టాడు. ఈ నెల 5 న కరీంనగర్లో జరిగిన దొంగతనం కేసులో అతన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టి అతన్ని అరెస్ట్ చేశారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
కాల్వశ్రీరాంపూర్: కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే వడ్డే శ్రీనివాస్ దంపతులు పత్తి సాగు చేయగా దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన వారు పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక రైతులు వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వేములవాడలో పోటెత్తిన భక్తులు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. భక్తుల రద్దీ సోమవారం ఎక్కువగా ఉండటంతో మల్లన్న దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా అభిషాకాలు అన్నీ రద్దు చేసి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. -
జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం సుంకేపల్లిలోని జిన్నింగ్ మిల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం స్ధానిక లక్ష్మీ జిన్నింగ్ మిల్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో మిల్లులో నిల్వ ఉంచిన పత్తి కాలి బూడిదైంది. వాహనంలో ఉన్న పత్తిని అన్లోడింగ్ చేస్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా ఎక్సెలరేటర్ ఇవ్వడంతో అకస్మాత్తుగా పొగ గొట్టం నుంచి మంటలు చెలరేగాయి. మంటలు పత్తికి అంటుకుని పూర్తిగా వ్యాపించాయి. స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల విలువైన పత్తి దగ్ధమైనట్టు సమాచారం. -
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి యత్నం
రాయికల్: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించిన సంఘటన కరీంనగర్ జిల్లా రాయికల్ మండంలోని అల్లీపూర్లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. అల్లీపూర్లో ఉన్న బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి ప్రవేశించి చోరీకి యత్నించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. స్ధానికులు గుర్తించి బ్యాంకు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాత్రూమ్ పైకప్పు కూలి వ్యక్తి మృతి
సుల్తానాబాద్: మరుగుదొడ్డి శుభ్రం చేస్తుండగా పైకప్పు కూలిపోవడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామ పంచాయతీ ఉద్యోగి సాయిలు(50) జెడ్పీ హైస్కూల్లోని మరుగుదొడ్డిని శుభ్రం చేస్తుండగా పై కప్పు కూలిపోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
జగిత్యాల: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని విద్యానగర్‌కు చెందిన కమటం శ్రీనివాస్ కి అదే మండలంలోని జాప్తాపురం గ్రామానికి చెందిన సుధారాణితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. శ్రీనివాస్ ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. సుధారాణి స్థానిక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ అత్తమామలతో ఉంటోంది. కొన్ని రోజులుగా కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆమె ఆదివారం రాత్రి ఉరేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి గంగారాజం దంపతులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. -
రూ. 20వేల విలువైన గుట్కా పట్టివేత
ఇల్లందుకుంట: అక్రమంగా అమ్మడానికి సిద్ధంగా ఉంచిన మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికంగా కిరాణ వ్యాపారం నిర్వహిస్తున్న అశోక్ అనే వ్యక్తి ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 20 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
గుడుంబా స్థావరాలపై దాడులు
వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లిలో గుడుంబా స్ధావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గుడుంబా తయారీలో ఉపయోగించే వెయ్యిలీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేసి మరో వందలీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులతో గుడుంబా తయారీదారులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాకూ రిజర్వేషన్ కావాలి..!
అగ్రకులాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా విద్యా సంస్థలు, ఉద్యోగాలు, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని కరీంనగర్-సిరిసిల్ల రహదారిపై బోయిన్పల్లి వద్ద మంగళవారం ఉదయం అఖిల పక్షాల ఆధ్వర్యంలో రాస్తా రోకో జరిగింది. ఓసీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులు తీవ్రంగా పోటీ ఉన్న ఓపెన్ కేటగిరీతో నష్టపోతున్నారని విద్యార్థులు ఆరోపించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. -
కౌలు రైతు ఆత్మహత్య
సిరిసిల్ల: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చిన్న బోనాల గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన అంబటి నారాయణ(44) తనకున్న రెండెకరాల భూమితో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో వర్షాలు లేకపోవడంతో.. మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కరీంనగర్ లో వ్యక్తి ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్ శివారులోని ఓ రియల్ వెంచర్లో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంచర్లో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం చెట్టుకు వేలాడుతూ ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. -
170 ఆసరా పింఛన్ల తొలగింపు
కరీంనగర్(వీణవంక): వీణవంక మండలంలో డీఆర్డీఏ అధికారులు శుక్రవారం సామాజిక తనిఖీలు నిర ్వహించారు. ఆసరా పింఛన్లు తీసుకున్న వారిలో 170 మంది అనర్హులుగా తేలడంతో వారికి ఆసరా పింఛన్లు తొలగించారు. వారి నుంచి రూ.4.3 లక్షలను రికవరీ చేయాలని అధికారులను డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ ఆదేశించారు. అనర్హులకు పింఛన్లు ఇచ్చినందుకు గానూ చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి సారయ్యకు వెయ్యి రూపాయలు జరిమాన విధించారు. -
విద్యార్థిని పై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు
కరీంనగర్ :కరీంనగర్ మండలం బావుపేటలోని ఓ ప్రై వేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి విద్యార్థిని ఇంటికి బైక్‌పై వచ్చిన ఉపాధ్యాయుడిని స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్ అక్కడే విడిచిపెట్టి పారిపోయాడు.కాగా, శుక్రవారం గ్రామంలో పంచాయతీ నిర్వహించగా రాజకీయ ఒత్తిళ్లతో కొందరు గ్రామపెద్దలు ఉపాధ్యాయుడికి అండగా నిలిచారు. విషయం అందరికి తెలిస్తే పరువు పోతుందని, గొడవకు పోకుండా గుట్టుగా ఉండాలని విద్యార్థిని తల్లి, బంధువులకు పంచాయతీ పెద్దలు సూచించారు. స్కూల్ కరస్పాండెంట్‌తో వ్యక్తిగత వివాదం ఉన్న కొందరు నాయకులు శనివారం విద్యార్థి కుటుంబసభ్యులతో కలిసి స్కూల్‌కు వెళ్లారు. ఉపాధ్యాయుడిని తమకు అప్పగించాలంటూ కరస్పాండెంట్‌తో వాగ్వాదానికి దిగారు. పాఠశాల బయట జరిగిన సంఘటనతో స్కూల్‌కు సంబంధం లేదని కరస్పాండెంట్ తిరుపతి చెప్పగా కొందరు వ్యక్తులు ఆగ్రహంతో అతడిపై దాడిచేసి కొట్టారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పాఠశాలకు వచ్చి తనను కొట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ కరస్పాండెంట్ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై ఆమె తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు ఉపాధ్యాయుడి భార్య కూడా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండడం గమనార్హం. -
ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తిన మంత్రి
కరీంనగర్: గోదావరి పుష్కరాలు ప్రభుత్వ అమాత్యులను ట్రాఫిక్ పోలీసులుగా మార్చాయి. ధర్మపురికి వెళ్లే దారిలో ట్రాఫిక్ నియంత్రించే కార్యక్రమంలో నిన్న మంత్రలు ఈటల రాజేందర్, హరీశ్ రావు, ఎమ్మెల్యే గంగుల కమాలకర్, భద్రాచలంలో తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీశ్ రెడ్డి పాల్గొనగా ఆదివారం కాళేశ్వరంలో అలాంటి బాధ్యతలనే మంత్రి లక్ష్మారెడ్డి తీసుకున్నారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల కారణంగా కాళేశ్వరం వెళ్లే దారిలో ట్రాఫిక్ కిక్కిరిసి ఉండటంతో దానిని క్లియర్ చేసే బాధ్యతలను మంత్రి లక్ష్మారెడ్డి తీసుకున్నారు. వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో అధికారులంతా రోడ్ల వెంటన డీజీల్, పెట్రోల్, మంచినీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా..100కి ఫోన్ చేయొచ్చని తెలిపారు. -
సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి చేరుకోవాల్సిన కేసీఆర్ మధ్యాహ్నం వస్తారని తెలిసింది. ఆదివారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ నుంచి యాదాద్రికి వెళ్లి మధ్యాహ్నం పెద్దపల్లికి వస్తారని అధికార వర్గాలు తెలిపాయి. యాదగిరిగుట్టలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి పెద్దపల్లి చేరుకుంటారు. అనంతరం పెద్దపల్లి, ధర్మారంలో జరిగే హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. -
కరీంనగర్లో సీఎం రెండు రోజుల పర్యటన
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. హరితహారంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బస్సుయాత్ర ద్వారా బస్వాపూర్ వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తారు. బస్వాపూర్, హుస్నాబాద్, చిగురుమామిడి, ముల్కనూర్, కొత్తపల్లి, నుస్తులాపూర్, తిమ్మాపూర్, అలుగునూర్ వద్ద మొక్కలు నాటుతారు. రాత్రి కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి వద్ద నున్న ఉత్తర తెలంగాణభవన్‌లో బసచేస్తారు. ఆదివారం ఉదయం కరీంనగర్లో మొక్కలు నాటి యాదాద్రికి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి జిల్లాలోని పెద్దపల్లికి చేరుకుని పెద్దపల్లి, ధర్మారంలో మొక్కలు నాటి రాయపట్నం మీదుగా ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తారు. -
తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జోరువానతో హోరెత్తిస్తున్నాడు. వరణుడి దెబ్బకు పలు రహదారుల్లో నీళ్లు చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడక్కడా వాహనాలు వర్షపు నీటిలో ఇరుక్కుపోయాయి. గిరిజన ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. ఎన్నో వాగులు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాన్ని జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్: జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. గొల్లపల్లి, కృష్ణపల్లి వాగులు పొంగటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఓపెన్ కాస్టుల్లో వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో డోర్‌ని -1, 2, శ్రీరాంపూర్, కైరీగూడ, రామకృష్ణాపూర్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొమురంభీం ప్రాజెక్టుకు వరదనీరు చేరింది. అక్కడ ఇన్ ఫ్లో 22 వేలు, ఔట్ ఫ్లో 12 వేల క్యూసెక్కులుగా నమోదవటంతో 5 గేట్లు ఎత్తివేశారు. కరీంనగర్: ఆదివారం జిల్లా వ్యాప్తంగా సగటున 6.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మహదేవ్‌పూర్‌లో 13.6 సెంటీ మీటర్లు, కమలాపూర్, మహాముత్తారంలో 12.6, వీణవంకం, కాటారంలలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కమలాపూర్ మండలం అంబాల, శంబునిపల్లిలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. అంబాల కల్వర్టు తెగిపోవడంతో హన్మ కొండ, కమలాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం ఓపెన్ కాస్ట్‌లోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. ఖమ్మం: జిల్లాలోని దుమ్ముపేటలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.భద్రాచలం, ఏజెన్సీల్లో దాదాపు 40 గ్రామాలు నీట మునిగాయి. పినపాక మండలం బోటిగూడెం, పాల చెరువులకు గండి పడింది. దాంతో వాటి సమీపంలో ఉన్న మారేడుగూడెం, బోటిగూడెం గ్రామాల్లోకి వరద నీరు చేరింది. మధిర మండలం జాలిముడి ప్రాజెక్టు వద్ద వైరా నదిలో ఇద్దరు ఇంజనీర్లు చిక్కుకున్నారు. నామాలపాడు వద్ద జిన్నేయ వాగు పొంగడంతో ఇల్లెందు - మహబూబ్ నగర్ మధ్య రాకాపోకలు నిలిచిపోయాయి. వరంగల్: నర్సంపేట డివిజన్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొర్లడంతో భద్రాచలం - నర్సంపేట మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉత్తర తెలంగాణలో ఆదివారం కురిసిన భారీ వర్షంతో ధవళేశ్వరం బ్యారేజికి భారీగా వరద నీరు చేరుతోంది. -
‘108’ సమ్మె ఉధృతం
8 జిల్లాల్లో నిలిచిపోయిన వాహనాలు అంబులెన్స్ రాకపోవడంతో కరీంనగర్ జిల్లాలో మహిళ మృతి విధుల్లో చేరకుంటే తొలగిస్తామని సిబ్బందికి జీవీకే హెచ్చరిక అఖిలపక్ష సమావేశం, రిలే దీక్షలు చేస్తామని ఉద్యోగుల ప్రకటన హైదరాబాద్: వేతనాలు పెంచాలని, తీసేసిన సిబ్బందిని తిరిగి తీసుకోవాలని తదితర 15 డిమాండ్లతో జరుగుతోన్న ‘108’ ఉద్యోగుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఉద్యోగుల సమ్మెకు వివిధ సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే సీఐటీయూ, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు మద్దతు తెలిపాయి. స్టాఫ్‌నర్సుల సంఘం కూడా మద్దతు ప్రకటించింది. అలాగే టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ కూడా మద్దతు తెలిపినట్లు ఉద్యోగులు తెలిపారు. త్వరలో అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని.. అప్పటికీ జీవీకే దిగిరాకుంటే రిలే నిరాహార దీక్షలు చేపడతామని వారు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఆదివారం ఒక్క అంబులెన్స్ కూడా రోడ్డెక్కలేదని తెలంగాణ ‘108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు పల్లి అశోక్ చెప్పారు. దీంతో రోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని చెప్పారు. కరీంనగర్ జిల్లా ధర్మారంలో ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని... కుటుంబ సభ్యులు 12 సార్లు ‘108’కు ఫోన్ చేయగా స్పందన కరువైందని... దీంతో ఆటోలో తరలిస్తుండగా ఆమె చనిపోయిందని వివరించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం యాజమాన్యం తక్షణమే స్పందించి సమ్మె నిలుపుదలకు కృషిచేయాలని ఆయన కోరారు. ఎస్ఎంఎస్ రూపంలో నోటీసులు.. జీవీకే-ఈఎంఆర్ఐ యాజమాన్యం ఆదివారం ఉద్యోగులకు ఎస్ఎంఎస్ల రూపంలో నోటీసులు జారీచేసింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సమ్మెలో పాల్గొంటున్న వారందరికీ ఎస్ఎంఎస్ల రూపంలో నోటీసులు ఇచ్చినట్లు జీవీకే-ఈఎంఆర్ఐ ఆపరేషన్స్ రాష్ట్ర అధిపతి బ్రహ్మానందరావు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటికే సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులను తిరిగి విధుల్లో చేరాలని కోరుతూ వచ్చామని... తాజాగా నోటీసులు జారీచేశామన్నారు. ఆదివారం రాత్రిలోగా విధుల్లో చేరిన వారిని ఉపేక్షిస్తామని... లేకుంటే నిబంధనల ప్రకా రం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించా రు. మూడు విధాలుగా చర్యలుంటాయన్నారు. ఒకటి ఉన్నచోటు నుంచి బదిలీ చేయడం. రెండోది సంస్థ నష్టాలకు కారణమవుతున్నందున సమ్మెలో పాల్గొం టున్న ఉద్యోగుల నుంచి సొమ్ము రికవరీ చేయడం. అయినా దిగిరాకుంటే చివరి అస్త్రంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామన్నారు. ఈ బెదిరింపులకు లొంగబోమని ఉద్యోగుల నేత అశోక్ స్పష్టంచేశారు. -
ప్రియుడి ఇంటి ముందు ధర్నా
నేరేడ్మెట్ : ప్రేమించాడు...పెళ్లి చేసుకుంటానన్నాడు....తీరా మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం....కరీంనగర్ జిల్లా సిరిసిల్లా మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన పల్లె స్రవంతి (20), వాజ్‌పేయినగర్‌కు చెందిన కారు డ్రైవర్ దురిశెట్టి లక్ష్మణ్‌లు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన లక్ష్మణ్, స్రవంతితో మూడు సంవత్సరాలుగా శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఫోన్ చేయడం మానేశాడు. దీంతో స్రవంతి వారం రోజుల క్రితం వేరే ఫోన్‌తో లక్ష్మణ్‌కు ఫోన్ చేసింది. అప్పుడు లక్ష్మణ్ తండ్రి మల్లయ్య ఫోన్ తీయడంతో.. నాకు కారు డ్రైవర్ కావాలి.. లక్ష్మణ్‌కు ఎంత ఫోన్ చేసినా తీయడంలేదని చె ప్పింది. దానికి లక్ష్మణ్ తండ్రి లక్ష్మణ్ ఇప్పుడు రావడం కుదరదు. ఈనెల 14న అతని వివాహం జరగనుందని తెలిపాడు. ఇది విన్న స్రవంతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏంచేయాలో తోచక రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. లక్ష్మణ్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో ఉంటాడని తెలుసుకున్న బాధితురాలు కరీంనగర్ నుంచి బయలుదేరి అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు నేరేడ్మెట్లోని వాజ్‌పేయినగర్‌లో లక్ష్మణ్ నివాసం ఉంటున్నాడని చెప్పడంతో.. స్రవంతి సోమవారం తెల్లవారు జామున వాజ్‌పేయినగర్‌లోని లక్ష్మణ్ ఇంటికి చేరుకుని ఇంటి ముందు నిరసనకు దిగింది. ఇది గమనించిన అతని కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి ఉడాయించారు. సమాచారం అందుకున్న నేరేడ్మెట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు స్రవంతిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా..... లక్ష్మణ్ వివాహం 14వ తేదిన వాజ్‌పేయినగర్‌లో నివాసముండే మరో అమ్మాయితో నిశ్చయమయింది. బాధితురాలు ఆదివారం అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో.. ఎలాగూ స్రవంతి వాజ్‌పేయినగర్‌కు కూడా వస్తుందని.. ఇప్పటికే అందరికి పెళ్లి శుభ పత్రికలు పంచడంతో వివాహం ఆగిపోయి నలుగురిలో పరువు పోతుందని భావించి.. ఆదివారమే పెద్దల సమక్షంలో మరో అమ్మాయితో గుళ్లో వివాహం చేసుకున్నట్లు సమాచారం. -
కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం కావడంతో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు దాదాపు 20 వేల మంది భక్తుల స్వామి వారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. (మాల్యాల) -
ఎన్టీపీసీ ఆరో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్
జ్యోతినగర్ : కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆరో యూనిట్లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వివరాల ప్రకారం... సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బాయిలర్ ట్యూబ్ లీకేజీ చోటు చేసుకోవడంతో విద్యుదుత్పత్తి ఆగిపోయింది. వెంటనే ప్లాంట్ సిబ్బంది మరమ్మత్తు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం నాటికి ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని ప్లాంట్ అధికారులు తెలిపారు. -
'త్వరలో కరీంనగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర'
కరీంనగర్:త్వరలో కరీంనగర్ జిల్లాలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్సార్ కోసం ప్రాణాలు కోల్పోయిన 30 మంది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని ఆయన తెలిపారు. ఆదివారం జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో పొంగులేటి పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో హామీలను విస్మరించిందని పొంగులేటి విమర్శించారు. ఏపీలో కూడా టీడీపీ సర్కార్ మాటలకే పరిమితమైందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలకు సిద్ధ శుద్ధి ఉంటే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటి నుంచి జరిగి పార్లమెంట్ సమావేశాల్లో రైతు సమస్యలను ప్రస్తావిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ శాసన సభను శాసిస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. కరీంనగర్ జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ నేటి తీర్మానంలో పేర్కొన్నారు. దీంతో పాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చకుండా జాతీయ హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తీర్మానించింది. -
మాటలు చెప్పడం కాదు.. ఆదుకోండి
కరీంనగర్: పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లేకుంటే రైతుల తరుపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. పంటనష్టపోయిన రైతులను శుక్రవారం పరామర్శించిన ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పంటనష్టం తీవ్రతపై ప్రస్తావిస్తామని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్ఱభుత్వాలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రజలను తక్షణమే ఆదుకోవాలని చెప్పారు. పంట నష్టంపై కేంద్రం నిబంధనలు సడలించడం అభినందనీయం అని పొంగులేటి అన్నారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో అప్పుల బాధతో గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండలంలోని చల్ గల్ లో నాగయ్య అనే రైతు పంట దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురైన నాగయ్య పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. కాగా మండలంలోని గాలెపల్లిలో మరో రైతు బేపి సుధాకర్ రెడ్డి అప్పుల బాధతో తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని సల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ (35) అనే యువరైతు విద్యుత్‌షాక్‌తో శుక్రవారం మృతి చెందాడు. వివరాలు.. శ్రీనివాస్ రెండు ఎకరాల విస్తీర్ణంలో వరిని సాగు చేశాడు. పొలానికి నీరు పెట్టేందుకు మధ్యాహ్నం మోటార్ వద్దకు శ్రీనివాస్ వెళ్లాడు. మోటార్ స్టార్ట్ చేసేందుకు స్టార్టర్‌ను నొక్కడంతో విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ స్టార్టర్ వదలకపోవడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు గమనించి అక్కడికి వెళ్లి చూశారు. వెంటనే 108 కి సమాచారం అందించినప్పటికి ఆలస్యం కావడంతో మరో వాహనంలో హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతునికి భార్య స్రవంతి, కుమారుడు శివ, కూతురు శ్రీవాణి ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (సుల్తానాబాద్) -
ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
కరీంనగర్ : ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరిచాడంటూ ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. వివరాలివీ... రామగుండం ఐదో డివిజన్లో ఉండే బూర్ల సతీష్(27), గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన మాధవి(27) ఒకే కంప్యూటర్ ఇని స్టిట్యూట్‌కు వెళ్లేవారు. ఆ సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని సతీష్ మాటిచ్చాడు. కానీ ఇటీవల అతడు మాధవిని పట్టించుకోవటం మానేశాడు. దీంతో ఆమె మంగళవారం ఉదయం సతీష్ ఇంటి వద్ద ధర్నాకు దిగింది. దీంతో సతీష్ కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి పరారయ్యారు. (రామగుండం) -
నిద్రావస్థలో ఉన్న వాటిని మేలుకొల్పడానికే బస'
కరీంనగర్: వ్యాధుల బారిన పడినవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటమే లక్ష్యంగా ప్రభుత్వాస్పత్రులను ప్రక్షాళన చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే తన చర్యలను ముమ్మరం చేసింది. నిద్రావస్థలో ఉన్న ఆసుపత్రులను మేలుకొల్పడానికే తాను ఆసుపత్రుల్లో బసచేస్తున్నానని డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. ఆదివారం మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో డప్పుకొట్టి దండోరా వేసిన రాజయ్య.. ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. -
15 మంది టీచర్లపై వేటు
కరీంనగర్: జిల్లాలో పదిహేను మంది టీచర్లపై వేటుపడింది. గత కొన్ని సంవత్సరాలుగా విధులకు హాజరు కాకపోవడంతో వారిని తొలగించారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. కనీసం అనుమతి కూడా తీసుకోకుండా విధులను ఎగ్గగొట్టిన ఆ టీచర్లను శాశ్వతంగా తొలగించారు. -
బోయినపల్లి అంత్యక్రియలకు కేసీఆర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీం నగర్ వెళ్లనున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బోయినపల్లి వెంకట రామారావు అంత్యక్రియాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు కేసీఆర్ హెలికాప్టర్లో బయల్దేరి కరీంనగర్ చేరుకుంటారు. అధికార వర్గాల మేరకు ఆయన కరీంనగర్ చేరుకున్న వెంటనే నేరుగా బోయినపల్లి వెంకట రామారావు అంత్యక్రియలకు హాజరవుతారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తర్వాత హైదరాబాద్ తిరిగి పయనమవుతారు. బోయినపల్లితో కేసీఆర్ అనుబంధం బోయినపల్లి వెంకట రామారావు కుటుంబంతో సీఎంకు ప్రత్యేక అనుబంధముంది. బోయినపల్లి కుమారుడు హనుమంతరావు సీఎంకు చిన్ననాటి క్లాస్మేట్. కేసీఆర్ సతీమణి శోభ, హనుమంతరావు సతీమణి సరళకుమారి వరుసకు అక్కాచెల్లెళ్లు కూడా. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి హనుమంతరావు పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో బోయినపల్లితో కేసీఆర్‌కు ప్రత్యేక సాన్నిహిత్యం ఏర్పడింది. -
కరీంనగర్ జడ్పీ సమావేశం రసాభాస
-
కరీంనగర్ జడ్పీ సమావేశం రసాభాస
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పరిషత్ (జడ్పీ) సమావేశం రసాభాసగా ముగిసింది. శుక్రవారం జరిగిన సమావేశంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార పక్షం ప్రజా సమస్యలపై చర్చంచడంలేదని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. సమస్యల పరిష్కారానికి అధికార పక్షానికి చిత్తశుద్ది లేదని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వాకౌట్ చేశారు. అనంతరం జడ్పీహాల్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. -
శాతవాహన యూనివర్సిటీలో ఉద్రిక్తత
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్ట్స్ కాలేజి ప్రిన్స్ పాల్ ను తొలగించాలని, హాస్టల్ ను యూనివర్సిటీ అధికారులే నిర్వహించాలనే డిమాండ్ తో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్ధుల ఆందోళనతో పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో ఎంబీఏ విద్యార్ధిని సృహతప్పి పడిపోయింది. వెంటనే విద్యార్ధిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విద్యార్ధులతో పోలీసులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు. -
పీసీసీ చీఫ్ రేసులో లేను: వివేక్
కరీంనగర్ : పీసీసీ అధ్యక్ష పదవి రేసులో లేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వివేక్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రుణమాఫీ వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని అన్ఓనారు. రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాల్సిందేనని వివేక్ డిమాండ్ చేశారు. మరోవైపు మాజీమంత్రి డీకే అరుణ.... తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పొన్నాల లక్ష్మయ్యను పదవి నుంచి తప్పించనున్నట్లు సంకేతాలతో ఆమె గత మూడు రోజులుగా హస్తనలోనే మకాం వేసి...అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. -
పందెం ఓ యువకుడి ప్రాణాలు తీసింది!
-
పందెం ఓ యువకుడి ప్రాణాలు తీసింది!
కరీంనగర్: సరదాగా కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లా మండలం తంగళ్లపల్లిలో చోటు చేసుకుంది. 15 నిమిషాల్లో ఫుల్ బాటిల్ మద్యం తాగుతానంటూ రవి అనే వ్యక్తి పందెం కాశారు. నాసిరకం మద్యం సేవించడ కారణంగానే ఊపిరి ఆడక మరణించినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఫుల్ బాటిల్ తాగుతూ..మధ్యలోనే పడిపోయాడని మృతుడి స్నేహితులు వెల్లడించారు. తక్కువ సమయంలోనే మద్యం తాగిన రవి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందారు. ఇదే ఘటనలో మరో ఇద్దరు కోమాలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. కోమాలోకి వెళ్లిన వ్యక్తులకు చికిత్స అందిస్తున్నారు. సరదా కోసం పందెం కాసి మృత్యువాత పడటంపై స్థానికులు అందోళన వ్యక్తం చేశారు. -
సికింద్రాబాద్ టు కరీంనగర్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి కరీంనగర్‌కు సిద్దిపేట మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం ఈ లైన్ కోసం కేంద్రమంత్రి హోదాలో కె.చంద్రశేఖర్‌రావు రైల్వే శాఖను కోరారు. ఆయన ఒత్తిడితో అప్పట్లో అధికారులు కూడా దానిపై దృష్టి సారించారు. కానీ ఆ తర్వాత ఈ ప్రతిపాదన అటకెక్కింది. మళ్లీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ దీనిపై దృష్టి సారిస్తున్నారు. వచ్చే రైల్వే బడ్జెట్లో రాష్ట్రప్రభుత్వం తరఫున అందజేసే ప్రతిపాదనల్లో దీన్ని మొదటి అంశంగా పేర్కొనబోతున్నారు. తెలంగాణలో రాజధాని నగరంతో రైల్వే అనుసంధానం లేని కీలక పట్టణం కరీంనగరే. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు సిద్దిపేట మీదుగా ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రైల్వే లైన్ లేకపోవటంతో అంతా రోడ్డు మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్-కరీంనగర్ మధ్య నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్యే దాదాపు 20 వేల వరకు ఉంది. ఇతర వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య దాదాపు ఇంతే ఉంటుందని సమాచారం. ఆర్టీసీ నిత్యం 200 ట్రిప్పులేయాల్సి వస్తోంది. దీంతో ఈ రెండు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న రాజీవ్ హైవే కిక్కిరిసిపోయి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. రైల్వే లైన్‌పై ఎప్పటికప్పుడు డిమాండ్ వస్తున్నా రైల్వే శాఖ మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా ఉండగా 2011-12 బడ్జెట్లో ఈ లైన్ ప్రస్తావన తెచ్చారు. సర్వే చేసే కొత్త లైన్ల జాబితాలో దీన్ని చేర్చారు. కానీ నిధులు మాత్రం కేటాయించకపోవటంతో ప్రస్తుతం అది పెండింగ్ పనుల జాబితాలో కూడా లేదు. మనోహరాబాద్ స్టేషన్‌తో అనుసంధానం... ఈ రైలుమార్గాన్ని పెద్దపల్లి-మనోహరాబాద్గా పేర్కొంటూ త్వరలో రాష్ట్రప్రభుత్వం రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ శివారు ప్రాంతం రక్షణశాఖ (కంటోన్మెంట్) పరిధిలో ఉండటంతో అక్కడ రైల్వే లైన్ నిర్మాణం దాదాపు అసాధ్యం. ఇదే కారణంతో గతంలో రైల్వే శాఖ దీన్ని పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఘట్కేసర్ గాని భువనగిరితోగాని అనుసంధానం చేయాలనే ఆలోచనలూ వచ్చాయి. అయితే సిద్దిపేట మీదుగా నిర్మితం అవుతూ నేరుగా సికింద్రాబాద్‌కు చేరేలా ఉండాలంటే నగర శివారు వరకు కొత్త లైన్ నిర్మించి అక్కడి నుంచి మేడ్చల్ మీదుగా మనోహరాబాద్ స్టేషన్ వద్ద ప్రస్తుతం ఉన్న లైన్‌తో అనుసంధానించాలని ప్రతిపాదనలో పేర్కొననున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో త్వరలోనే రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అప్పటికల్లా ప్రతిపాదనలు పూర్తి చేసి ఈ బడ్జెట్లోనే సర్వేకు నిధులు ప్రకటించేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. త్వరలో కేసీఆర్‌తో భేటీ : ఎంపీ వినోద్‌కుమార్ ‘‘పెద్దపల్లి-మనోహరాబాద్-సికింద్రాబాద్ రైల్వే లైన్ నిర్మాణం అవశ్యం. ప్రజల దశాబ్దాల కల త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నాం. దీనిపై ఈ వారంపది రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయి ప్రతిపాదనలు సిద్ధం చేసి, రాష్ట్రప్రభుత్వం తరఫున అధికారికంగా పంపుతాం. దాని ఆధారంగా మేం ఢిల్లీలో రైల్వేశాఖపై ఒత్తిడి చేస్తాం’’ -
తండ్రి మృతి.. తట్టుకోలేక ఆగిన తనయుడి గుండె
ముస్తాబాద్, న్యూస్‌లైన్: వడదెబ్బ తగిలి తండ్రి అస్వస్థతకు గురై చనిపోయాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేని తనయుడి గుండె ఆగిన సంఘటన కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జంగం నాంపెల్లి(59) స్థానిక ఐకేపీ కేంద్రంలో హమాలీగా పని చేస్తున్నాడు. ఆదివారం ఐకేపీ కొనుగోలు కేంద్రం మూసివేస్తుండడంతో శనివారం పొద్దంతా ఎండలో ధాన్యం బస్తాలను మోశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన నాంపెల్లి అస్వస్థతకు గురై కుప్పకూలాడు. ఏం జరిగిందో కుటుంబసభ్యులు తెలుసుకునేలోపే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కన్నుమూశాడు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అంత్యక్రియలకు తీసుకెళుతుండగా, తండ్రి మృతదేహం వెనుకే వచ్చిన ఆయన పెద్ద కుమారుడు రాజు(28) తండ్రిని తల్చుకొని కుప్పకూలాడు. అక్కడే ప్రాణాలు విడిచాడు. అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించిన బంధువులు నాంపెల్లి మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. సాయంత్రం రాజు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు మృత్యువాతపడటంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా, నాంపెల్లి అన్న భార్య చంద్రవ్వ ఈ రెండు మరణాలు చూసి షాక్‌తో పక్షవాతానికి గురైంది. పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
‘పుట్ట మధుపై పోలీసులను ఆశ్రయించండి’
సాక్షి, హైదరాబాద్: తనపై ఉన్న క్రిమినల్ కేసులను కరీంనగర్ జిల్లా మంథని అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించకుంటే... దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారుడైన అక్కడి స్వ తంత్ర అభ్యర్థి సి.సునీల్‌కుమార్‌కు హైకోర్టు సూచించింది. ఈ విషయంలో ప్రస్తుతం అంతకుమించి ఆదేశాలు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ఆధ్వర్యంలో ధర్మాసనం మంగళవారం తేల్చిచెప్పింది. -
అమ్మ సభకు అభ్యర్థుల డుమ్మా
దాదాపు సగం మంది గైర్హాజరు ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆ పార్టీ అభ్యర్థులు కరువయ్యారు. కరీంనగర్లో సోనియా బహిరంగ సభ నిర్వహణలో టీపీసీసీ ఘోరంగా విఫలమైంది. తెలంగాణలో పార్టీ తరఫున పోటీ చేస్తున్న మొత్తం 119 మంది ఎమ్మెల్యే, 17 మంది ఎంపీ అభ్యర్థులను ఈ సభకు టీపీసీసీ ఆహ్వానించింది. అందరినీ ఇక్కడికి రప్పించి.. సోనియాకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు సభా వేదికపై పరిచయ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు హెలీపాడ్ నుంచి వేదికపైకి వెళ్లే మార్గంలో అభ్యర్థులందరినీ క్యూలో నిలబెట్టేందుకు వీలుగా సోనియా భద్రతను చూసుకునే ఎస్పీజీ అధికారుల నుంచి టీపీసీసీ చీఫ్ పొన్నాల ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. అభ్యర్థుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. తీరా సమయానికి ఎమ్మెల్యే అభ్యర్థులు సగానికిపైగా సభకు డుమ్మా కొట్టారు. ఇక ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులే హాజరయ్యారు. దీంతో పార్టీలోని సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు తొలిసారిగా తెలంగాణలో ఎన్నికల పర్యటనకు వస్తే.. కనీసం మర్యాదపూర్వకంగానైనా కలిసేందుకు రావాల్సిన అభ్యర్థులు ముఖం చాటేయడంతో పార్టీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోనియా వచ్చే సమయానికి క్యూలో నిలబడే అభ్యర్థులు కరువవడంతో పొన్నాల హడావుడి పడటం కనిపించింది. అప్పటికప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులను సైతం క్యూ లైన్లోకి అనుమతించారు. అమ్మ దృష్టిలో పడేందుకు అదృష్టం కలిసిరావడంతో.. సోనియాకు నమస్కారం పెట్టేందుకు, పాదాభివందనం చేసేందుకు.. కండువాలు బహుకరించేందుకు చోటా లీడర్లు పోటీ పడ్డారు. -
కరీంనగర్లో నేడు సోనియా బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: కాంగ్రెస్ అధినేత్రి సోని యాగాంధీ బుధవారం రాష్ట్రానికి వస్తున్నారు. కరీంనగర్లో జరిగే సభలో ఆమె పాల్గొంటారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. సోనియా బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుం టారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ వెళ్లి అక్కడ ఎన్నికల సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట చేరుకుని ఢిల్లీ పయనమవుతారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సోనియా వెంట ఉంటారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా కరీంనగర్ సభాస్థలివద్ద ఏర్పాట్లను సమీక్షించారు. ఈసారి స్టేడియంలో 2 వేదికలు నిర్మించారు. సోనియా ప్రసంగించడానికి ఒకటి, తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల కోసం మరోటి ఏర్పాటు చేశారు. -
టీఆర్ఎస్ ఓ పిల్లకాకి... కేసీఆర్ పెద్ద అవకాశవాది
టీఆర్ఎస్ పార్టీ ఓ పిల్లకాకి అని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. నిన్న కాక మొన్న పుట్టిన టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టాల్సిన అవసరం తమ పార్టీకి లేదని పొన్నాల స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ విచ్చేసిన పొన్నాల విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. కేసీఆర్ పెద్ద అవకాశవాది అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఓ విధమైన నిరాశ, నిస్పృహలతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైన ప్రజా సంక్షేమం కోసం ఓ పథకం గురించి మాట్లాడారా అంటూ కేసీఆర్‌ను పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకున్న వారిని, తెలంగాణ ద్రోహులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న ఘనత కేసీఆర్‌దని పొన్నాల నిప్పులు చెరిగారు. ఈ నెల 16న సోనియాగాంధీ కరీంనగర్ వేదికగా బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను పొన్నాల ఈ సందర్బంగా పర్యవేక్షించారు. -
కరీంనగర్లో 15న సోనియా బహిరంగ సభ
హైదరాబాద్: ఎట్టకేలకూ సుదీర్ఘ కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అడుగుపెట్టనున్నారు. తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ జిల్లాలో ఏప్రిల్ 15 తేదిన నిర్వహించే బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొంటారు. 2004లో జరిగిన కరీంనగర్ ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు తనకు తెలుసునని సోనియా హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సోనియాగాంధీ నిర్ణయం కీలకమారిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించే దిశగా పార్టీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే కరీంనగర్ పట్టణంలో సోనియా సభను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ తరపున పోటి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే విలీనం చేస్తామని టీఆర్ఎస్ పార్టీ తప్పిన మాట తప్పడాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. -
తెలంగాణ కోసం మరో ఇద్దరి బలిదానం
మెదక్, కరీంనగర్, న్యూస్‌లైన్: తెలంగాణ రాదేమోనన్న మనస్తాపంతో శుక్రవారం ఇద్దరు యువకులు బలిదానం చేసుకున్నారు. మెదక్ జిల్లా కొల్చారానికి చెందిన మ్యాదరి విఠల్, యాదమ్మ దంపతుల పెద్ద కుమారుడు నరేష్(21) నర్సాపూర్‌లో డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం పార్లమెంట్లో జరిగిన సంఘటనలపై కలత చెందిన శుక్రవారం సాయంత్రం వరకు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడిపాడు. అనంతరం సూసైడ్ నోట్ రాసి.. విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే, కరీంనగర్ మండలం కొత్తపల్లికి చెందిన పెద్ది కనకయ్య గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన ఘటనలను టీవీల్లో చూసి కలత చెందాడు. సీమాంధ్రలు వచ్చే తెలంగాణను అడ్డుకుంటున్నారని తీవ్ర మనస్తాపం చెంది గ్రామ శివారులోని రైల్వేట్రాక్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలాఉండగా, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో విద్యార్థి ఎం.అజయ్ క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. -
కేసరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
హైదరాబాద్ : వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఎదురుగా వస్తున్న జీపును ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇక కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం థరూర్ శివారులో ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మిర్రర్ రైటింగేల్
కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బండారి కార్తీక తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మిర్రర్ రైటింగ్(అక్షరాలను తిరగేసి రాయడం)లో ఐదు రికార్డులు సాధించింది. గురువారం పాఠశాలలో నిర్వహించిన పరీక్షలో కార్తీక తెలుగులో 16 పేజీలు మహాత్మా గాంధీ జీవి త చరిత్ర, హిందీలో 13 పేజీలు మదర్ థెరిస్సా జీవిత చరి త్ర, ఇంగ్లిష్‌లో 16 పేజీలు అబ్దుల్ కలాం జీవిత చరిత్రను మిర్రర్ రైటింగ్‌లో రాసింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డు, మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్, వరల్డ్ అమేజింగ్ రికార్డ్, ఆర్హెచ్ఆర్ రికార్డ్ సాధించి అబ్బురపరిచింది. చిన్నప్పటినుంచే మిర్రర్ రైటింగ్‌లో ప్రావీణ్యం ఉన్న కార్తీక పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకు ప్రతిపాదించారు. - కోరుట్ల, న్యూస్‌లైన్ -
ఆ ముగ్గురి వేట
కరీంనగర్ : కాంగ్రెస్‌లో గెలుపు గుర్రాల వేట మొదలైంది. లోక్‌సభ స్థానాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమర్థులైన అభ్యర్థులను గుర్తించేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. స్వయానా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన బృందాన్ని రాష్ట్రానికి పంపించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు పీసీసీ వెల్లడించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠమొదలైంది. లోక్‌సభ సెగ్మెంట్‌కో పరిశీలకుడిని నియమించడంతో జిల్లాకు ఇద్దరు పరిశీలకులు రానున్నారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు అమిత్ దేశ్‌ముఖ్ రెండు మూడు రోజుల్లో ఆయన కరీంనగర్ వస్తారని సమాచారం అందడంతో పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని పార్టీ నేతలు ఎవరికివారుగా రేసులో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పీసీసీ ఇచ్చిన సమాచారంతో కొందరు నేతలు ఏకంగా పరిశీలకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఫోన్లలో రాయబారాలు మొదలెట్టారు. దీంతో ఈ రేసులో ఎవరెవరున్నారు... ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ పడుతున్నారనేది ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీ కావడంతో అన్ని చోట్ల ఈ రేసు చాంతాడును తలపిస్తోంది. జిల్లాకు రానున్న పరిశీలకులు పార్టీ కార్యకర్తలు మొదలు ముఖ్య నేతలు, వివిధ వర్గాల నుంచి మూడు గెలుపు గుర్రాలను గుర్తిస్తారని తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురిలో మేమంటే.. మేము.. అని పోటీ పడేందుకు, పరిశీలకుల ఎదుట బలప్రదర్శన చేసేందుకు కొందరు నేతలు ఇప్పట్నుంచే శక్తియుక్తులు ఒడ్డుతున్నారు. పెద్దపల్లి, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులను త్వరలోనే ఖరారు చేసి పంపనున్నట్టు సమాచారం. కరీంనగర్ పరిశీలకుడిగా అమిత్ దేశ్‌ముఖ్ కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడిగా అమిత్ దేశ్‌ముఖ్(38)ను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిం చాయి. ఈయన మహారాష్ట్రలోని లాతూర్ సిటీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అమిత్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు. అమిత్ దేశ్‌ముఖ్ లోక్‌సభ సీటుతో పాటు దాని పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచే సత్తా ఉన్న ముగ్గురు అభ్యర్థుల పేర్లను గుర్తించి రాహుల్‌గాంధీకి సిఫారసు చేస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. -
హల్చల్ మనోళ్లదే..
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా శాసనసభలో జిల్లా నేతలే హల్చల్ చేశారు. సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభమయినప్పటి నుంచి ఉత్కంఠ కొనసాగింది. తెలంగాణ బిల్లు సభ ముందుకు వస్తుందా.. రాదా.. అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. మొదటి సారి వాయిదా అనంతరం సభ తిరిగి సమావేశం అయినప్పుడు స్పీకర్ అనూహ్యంగా బిల్లు ను ప్రవేశపెట్టారు. దీంతో సభలో కలకలం మొదలయ్యింది. తిరిగి సభ వాయిదా పడిన తర్వాత సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు బిల్లు ప్రతులను చింపుతుండగా కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్‌తోపాటు జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు ప్రతిఘటనకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా పాయింట్లో తెలంగాణ బిల్లు ప్రతిని చింపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమలాకర్‌తోపాటు ఎమ్మెల్యేలు వారిని నిలువరించేందుకు వారివైపు దూసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్ర తోపులాట జరిగింది. కమలాకర్‌తోపాటు కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అయిన తెలంగాణ బిల్లు తమకు పవిత్రమైందని, దాన్ని చింపడం తెలంగాణను అవమానించడమేనని గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ నిర్ణయంపై ఎవరికి ఏ అభ్యంతరాలున్నా వ్యక్తం చేసుకోవచ్చునని, కానీ తమను అగౌరవపరిచేలా వ్యవహరించడం వల్లనే అభ్యంతరం చెప్పామని పేర్కొన్నారు. దాదాపు అరగంటకు పైగా మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత కొనసాగింది. సభ లోపల కూడా జిల్లా నేతలు క్రియాశీలంగా వ్యవహరించారు. బిల్లు సభకు వచ్చేలా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఉదయం నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన స్పీకర్‌తో సంప్రదింపులు జరిపారు. బిల్లును సభ ముందుకు తేవడంలో వారి వ్యూహం ఫలించింది. సభను అడ్డుకోవడానికి సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ చాంబర్లో బైఠాయించగా, డెప్యూటీ స్పీకర్ సభను నడిపించారు. సభావ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌బాబు తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమయ్యేలా చొరవ చూపారు. తెలంగాణ బిల్లుపై ఆయన సభలో మాట్లాడారు. మొత్తానికి సోమవారం జిల్లా ప్రజాప్రతినిధులు సభలో కీలకంగా వ్యవహరించారు. -
అమ్మకు అన్నం పెట్టరట..!
అడ్డాలనాటి బిడ్డలు గడ్డాలనాడుకారన్న నానుడిని నిజం చేశారా తనయులు. కొడుకుల తీరుతో విసిగిపోయిన ఆ మాతృమూర్తి విధిలేని పరిస్థితిలో ఠాణామెట్లెక్కింది. బాధితురాలి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన బాషెట్టి వెంకటమ్మ-రాములు దంపతులకు ముగ్గురు కుమారులు. భర్త రాము లు 34 ఏళ్ల క్రితం గల్ఫ్‌లో మృతి చెందాడు. అప్పటినుంచి అన్నీ తానై తనయులను పెంచిపెద్ద చేసింది వెంకటమ్మ. రెండో కుమారుడు సుధాకర్, మూడో కుమారుడు రవి మూడు నెలల క్రితం తల్లిని వైద్యపరీక్షల నిమిత్తమని వేములవాడకు తీసుకువచ్చి.. ఆమె పేరిట ఉన్న ఇంటిని తమ పేరి ట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విషయం పెద్ద కుమారు డు కమలాకర్‌కు తెలియడంతో అన్నదమ్ముల మధ్య వివా దం మొదలైంది. పలుమార్లు గ్రామపెద్దల సమక్షంలో పం చాయితీ జరిగింది. ఇంటిని పంచుకున్న ఆ ఇద్దరే తల్లిని చూసుకోవాలని కమలాకర్ చేతులెత్తేశాడు. చిన్నోళ్లు ఇద్దరూ తల్లి బాధ్యత తనకొద్దంటే.. తనకొద్దంటూ తప్పిం చుకున్నారు. దీంతో తల్లి ఒంటరిదైంది. తనను కొడుకులు ఆదరించడం లేదని, మీరే ఆధారం చూపించాలని కోరు తూ ఆదివారం ఠాణామెట్లెక్కింది. సీఐ దేవారెడ్డి కొడుకుల ను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. - న్యూస్‌లైన్, వేములవాడ -
మద్యం అమ్మకాలు పెంచాలి
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ ఐదు జిల్లాల పరిధిలో మద్యం అమ్మకాలు పెంచాలని ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఐదు జిల్లాల ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు నకిలీ మద్యం అరికట్టడంతోపాటు అమ్మకాలు పెంచాలని, లెసైన్స్‌దారులకు అవసరమైన సేవలందించాలని సూచించారు. ఐదు జిల్లాల అధికారులు, సిబ్బంది ఇచ్చిన ఒక రోజు మూల వేతనం రూ.1.07 లక్షల చెక్కును మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ బాలరాజ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీవో ఎక్సైజ్ రాష్ట్ర అధ్యక్షుడు సుద్దాల రాజయ్య, నాలుగు సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు, కె ప్రభువినయ్, లక్ష్మణ్‌గౌడ్, రాజేందర్, కరుణాకర్, కిషన్‌రావు, విజయకుమార్, సిద్ధికీ, నగేశ్ కమిషనర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలు పరిష్కరించాలి.. అపరిష్కతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల జేఏసీ నాయకులు ఎక్సైజ్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో ఎక్సైజ్‌శాఖ నిర్లక్ష్యం మూలంగా 15 సొసైటీలు మూత పడ్డాయని, ఎక్కడా లేని విధంగా వత్తి పన్ను వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలాకాలంగా నిలిచిపోయిన నష్టపరిహారం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు కొక్కిస రవీందర్‌గౌడ్, చైర్మన్ గోపగాని సారయ్యగౌడ్, కన్వీనర్ సింగం సత్తయ్య గౌడ్ పలువురు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
తూచ్.. ఇప్పుడు కాదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : బలమైన సామ్రాజ్యంగా పేరొందిన శాతవాహనుల కీర్తిని స్మరించుకునే కళోత్సవాలను నిర్వహించేందుకు బలమైన ముహూర్తం కుదరడంలేదు. చారిత్రక గొప్పదనంపై రాజకీయ నేతల పట్టింపులేని వైఖరి, అధికార యంత్రాం గం నిర్లక్ష్యం వెరసి.. కరీంనగర్ జిల్లా కీర్తిని స్మరించుకునే శాతవాహన కళోత్సవాలు మళ్లీ వాయిదా పడ్డాయి. జనవరి నుంచి వాయిదాలు పడుతున్న శాతవాహన కళోత్సవాలను అక్టోబరు 20 నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తామని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మ య్య ఈ నెల 5న అధికారికంగా ప్రకటించారు. ఇది జరిగి మూడు రోజులుకాక ముందే వీటి నిర్వహణను వాయిదా వేయాలని నిర్ణయించారు. తిరిగి నవంబరు రెండో వారంలో నిర్వహించాలని భావిస్తున్నారు. కచ్చితమైన తేదీలపై రెండుమూడు రోజుల్లో ప్రకటన చేయనున్నారు. పండగలు ఉండడమే ఈసారి వాయిదాకు కారణమని అధికారులు చెబుతున్నప్పటికీ.. 20వ తేదీ దగ్గరగా ఉండడం, అప్పటిలోగా ఏర్పాట్లు చేయలేమనే ఆందోళన అసలు కారణంగా కనిపిస్తోంది. గడువులోపు ఏర్పాట్లు జరగవనే ఆందోళన ఉన్నప్పుడు ఉత్సవాల నిర్వహణ ప్రకటన ఎందుకు చేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరుస వాయిదాలతో అసలు శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తారా లేదా అని సాహితీవేత్తలు, కళాకారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాతవాహన కళోత్సవాలను చివరిసారిగా 2008లో నిర్వహించారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఈ ఏడాది నిర్వహిస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. జనవరిలోనే నిర్వహిస్తామని మొదట చెప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసినా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత మార్చిలో పరీక్షలు ఉన్నాయని చెప్పి ఏప్రిల్‌లో నిర్వహిస్తామని చెప్పింది. మేలో కొంత హడావుడి చేసింది. ఉత్సవాల నిర్వహణ, ఖర్చు, ఏర్పాట్లు వంటి అంశాలపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో 10 కమిటీలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో జరిపే ప్రదర్శనలు, ఇతర అంశాలకు రూపకల్పన చేసే బాధ్యతను కళాకారులకు అప్పగించారు. ఉత్సవాల నిర్వహణకు రూ.80 లక్షల వరకు అవుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి రూ.5లక్షల మంజూరుకే ఆమోదం రావడంతో జిల్లాలోని పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించారు. ఇలా సేకరించిన, ప్రభుత్వం ఇచ్చిన మొత్తం కలిపి ప్రస్తుతం రూ.24 లక్షలు ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం తక్కువగా ఉండడం కూడా ఉత్సవాల నిర్వహణ వాయిదా పడడానికి కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఉత్సవాల వేదిక గొప్పగా ఉండాలని, దీనికోసం టీటీడీ సహాయం కోరారు. జిల్లా యంత్రాంగం పెట్టిన ప్రతిపాదనను టీటీడీ వెంటనే అంగీకరించింది. ఆలయం రూపంలో రూ.20 లక్షలతో అంబేద్కర్ స్టేడియంలో భారీ సెట్టింగ్ వేసింది. ఉత్సవాలు వాయిదా పడుతుండడంతో ఇది నిరుపయోగంగా మారింది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, అసఫ్‌జాహీల పాలనలో విభిన్న సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం జిల్లా సొంతం. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేల కుటుంబాలు వందల ఏళ్ల క్రితమే వచ్చి ఇక్కడ ఉండడంతో విభిన్న సాంస్కృతిక వాతావరణ నెలకొంది. నిజాం సర్కారు హయాంలో 1905లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి అరిపిరాల గ్రామం ఎలగందుల ఖిలేదార్ సయ్యద్ కరీముద్దీన్ పేరిట కరీంనగర్ జిల్లా కేంద్రంగా మారింది. ఇలాంటి ఎన్నో అంశాలతో ముడిపడి ఉండే జిల్లా ఘన చరిత్రను భవిష్యత్తు తరాలకు చెప్పే కళోత్సవాలపై ప్రజాప్రతినిధులకు, జిల్లా యంగ్రానికి శ్రద్ధ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
చెక్‌పవర్ ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం: ఆర్.కృష్ణయ్య
కరీంనగర్, న్యూస్‌లైన్: పదిహేను రోజుల్లోగా జాయింట్ చెక్‌పవర్ రద్దు చేసి.. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వకపోతే సీఎం కిరణ్ ఇంటిని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గతంలో చంద్రబాబు తరహాలోనే సీఎం కిరణ్‌ను ఇంట్లో బంధించి అయినా చెక్‌పవర్ తీసుకుంటామన్నారు. ఆదివారం కరీంనగర్లో బీసీ సర్పంచ్ల సన్మాన సభ జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ జాయింట్ చెక్‌పవర్ అనేది సర్పంచ్ల ఆత్మగౌరవ సమస్య అన్నారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వకపోతే ఈజిప్టు దేశాన్ని విడిచిపారిపోయిన ముబారక్ గతే సీఎంకు పడుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు 150 ఎమ్మెల్యే, 22 ఎంపీ టికెట్లను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలను సీఎం, పీఎంలుగా ప్రకటించిన పార్టీలకే బీసీల మద్దతుంటుందన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధతను కల్పించాలన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో, రూ.50 వేల కోట్లతో కేంద్రంలో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, టీడీఎల్పీ ఉపనేత ఎల్.రమణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజాల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు కూతుళ్ల సహా తల్లి ఆత్మహత్యాయత్నం
కరీంనగర్: కుటుంబంలోని సమస్యలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. గత కొంతకాలంగా కుటుంబంలో చోటు చేసుకున్న చిన్నపాటి తగాదాలు కాస్తా తీవ్రరూపం దాల్చడంతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలోని జమ్మికుంటలో శుక్రవారం చోటు చేసుకుంది. జీవితం మీద విరక్తి చెందిన ఓ తల్లి తన పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. తాను లేని జీవితంలో పిల్లలు ఉండకూదదని భావించిన ఆ కన్నతల్లి ముందుగా తన ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి వారిని ఆత్మహత్యకు పురిగొల్పింది. అనంతరం ఆమె కూడా విషం తాగా ఆత్మహత్యయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.