
మాటలు చెప్పడం కాదు.. ఆదుకోండి
పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
కరీంనగర్: పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లేకుంటే రైతుల తరుపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. పంటనష్టపోయిన రైతులను శుక్రవారం పరామర్శించిన ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పంటనష్టం తీవ్రతపై ప్రస్తావిస్తామని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్ఱభుత్వాలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రజలను తక్షణమే ఆదుకోవాలని చెప్పారు. పంట నష్టంపై కేంద్రం నిబంధనలు సడలించడం అభినందనీయం అని పొంగులేటి అన్నారు.