గ్లోబల్ సమ్మిట్ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం
సంక్షోభ రాష్ట్రాన్ని అప్పగిస్తే సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ వర్గాన్నీ విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యమిస్తున్నామని, ఎన్ని కల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ పాలన నిలుస్తోందని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. రెండేళ్ల కాలం తక్కువే అయినా ప్రభుత్వం సాధించిన విజయాలు అత్యద్భుతం.
ధనిక రాష్ట్రాన్ని తమ స్వార్థపూరిత నిర్ణయాలతో పదేళ్లలో దివాలా తీయించి, ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని మాకు అప్పగి స్తే రెండేళ్లలోనే సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం. ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశాం. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాం. తెలంగాణ రైజింగ్ – 2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది’అని అన్నారు.
2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేళ్లలో దేశానికి రోల్‌మో డల్‌గా నిలబెట్టామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రా ష్ట్రంలో భూ సమస్యలను వీలైనంతవరకు తగ్గించడం, అర్హు లందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం తమ ప్రభుత్వం ముందున్న ప్రథమ లక్ష్యమని మంత్రి పొంగులేటి వెల్లడించారు.


