సాక్షి హైదరాబాద్: పార్ల మెంటు సమావే శాల నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025కు హాజరు కా లేకపోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా సోమ, మంగళవారాల్లో నిర్వహించే సదస్సు విజయవంతం కావాలని కోరుతూ వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలి యజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు ఖర్గే ఆదివారం లేఖ రాశారు.
సమ్మి ట్ విజయవంతం కావాలని లేఖలో ఆకాంక్షించారు. ఈ సద స్సు ద్వారా తెలంగాణ పెట్టుబడిదారుల గమ్యంగా.. ఇన్నోవేషన్ హబ్‌గా అవతరించాలని అభిప్రాయపడ్డారు. సదస్సులో జరిగే చర్చలు మెరుగైన ఫలితాలు ఇవ్వాలని.. తెలంగాణ నిర్దేశించుకున్న లక్ష్యాలు, దేశాభివృద్ధి ప్రయాణంలో సమ్మిట్ ఫలవంతమైన తోడ్పా టు అందించాలని సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో ఖర్గే ఆకాంక్షించారు.


