తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
నిజామాబాద్ రూరల్: కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు చేసింది శూన్యమని, రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయన కు లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి పట్టని కిషన్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకుని మహాధర్నా చేస్తున్నారని మండిపడ్డారు.
అభివృద్ధి, సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో శెభాష్ అనిపించుకుంటోందని, ఇది చూసి ఓర్వలేక బీజేపీ నేతలు మహాధర్నా పేరిట కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదన్న విషయంపై కిషన్‌రెడ్డి ఆలోచించాలన్నారు. గ్లోబల్ సమ్మిట్‌ను గర్వంగా జరుపుకుంటామని స్పష్టం చేశారు.


