'నాకు రిటైర్మెంట్‌ వయసు పెంపు వద్దు' | School HM From Karimnagar I Dont Want Retirement Age Increase | Sakshi
Sakshi News home page

'నాకు రిటైర్మెంట్‌ వయసు పెంపు వద్దు'

Mar 24 2021 8:08 AM | Updated on Mar 24 2021 8:37 AM

School HM From Karimnagar Says I Dont Want Retirement‌ Age Increase - Sakshi

కొడిమ్యాల: ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై ఉద్యోగులంతా సంబరాలు చేసుకుంటుండగా.. ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం తనకు పెంపు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతున్నారు.జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఏనుగు మల్లారెడ్డి తనకు రిటైర్మెంట్‌ వయస్సు పెంపు వద్దని మంగళవారం ప్రకటించారు.

ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల నిరుద్యోగ యువతకు అవకాశాలు దక్కకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకుని సీఎం కేసీఆర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement