ప్రేమజంటపై దాడి..  | Relatives attack the love couple in Karimnagar district | Sakshi
Sakshi News home page

ప్రేమజంటపై దాడి.. 

Nov 10 2017 6:05 PM | Updated on Nov 10 2017 6:05 PM

సాక్షి,జమ్మికుంట: గత నెల సికింద్రాబాద్లోని ఆర్య సమాజ్లో ఓ ప్రేమజంట వివాహం చేసుకుంది. ఇది జీర్ణించుకోలేని అమ్మాయి తరపు బంధువులు ఆ జంటపై దాడిచేశారు. ఈ ఘటన కరీంగనర్ జిల్లాలో జరిగింది. వివరాలివి.. మహబూబాబాద్ అమ్మాయి, మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన ప్రవీణ్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్లో గతనెల పెళ్లి చేసుకున్నారు.

దీంతో అమ్మాయి తరపు వారు వాహనాల్లో వచ్చి ప్రవీణ్‌పై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. గ్రామస్తులు ఒక వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనంతో పాటు ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement