కరీంనగర్‌లో అలర్ట్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హౌజ్‌ అరెస్ట్‌ | Karimnagar Bandh Sparks Political Tension As BRS, BJP And Congress Trade Charges | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో అలర్ట్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హౌజ్‌ అరెస్ట్‌

May 9 2026 8:49 AM | Updated on May 9 2026 12:31 PM

BRS Bandh In Karimnagar Updates

కరీంనగర్‌ బంద్‌ అప్‌డేట్స్‌.. కరీంనగర్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో.. దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసనగా నేడు కరీంనగర్ నగర బంద్‌కు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. దీంతో, బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు.

గంగుల కమలాకర్ కామెంట్స్‌..

  • కరీంనగర్‌లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.
  • నన్ను, మా బీఆర్ఎస్ నాయకులని అరెస్టు చేసినా.. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి కేంద్ర మంత్రి బండి సంజయ్ కి తెలిసే జరిగింది.
  • మమ్మల్ని‌ అరెస్టు చేయడం పోలీసులు పెట్టిన శ్రద్ధ కరీంనగర్‌పై పెడితే జువెలరీ షాపులో దొంగతనం జరిగేది కాదు.
  • గోల్డ్‌ రాబరీ ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం..
  • వారం రోజులు అవుతున్న పోలీసులు ఏం చేస్తున్నారు.
  • కరీంనగర్ నిషేధిత ప్రాంతమా?
  • కేటీఆర్‌ ఎందుకు అడుగుపెట్టవద్దు.

బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్ట్..

  • కరీంనగర్ బందుకు బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో ఎక్కడిక్కడ బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్ట్..

  • పలువురు బీఆర్ఎస్ కార్పోరేటర్లను ముందస్తు అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

  • గంగాధరలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హౌజ్ అరెస్ట్..

  • కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు..

  • బంద్ వద్దని బీజేపీ, కాంగ్రెస్ పిలుపు..

  • బంద్ చేయాలని బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో హైఅలర్ట్ వాతావరణం.

 


నేడు కరీంనగర్ బందుకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్

  • కరీంనగర్‌లో ఉద్రిక్తికర వాతావరణం

  • ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు, ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బందుకు పిలుపు

  • ఎవరూ బంద్ చేయాల్సిన అవసరం లేదంటూ బీజేపీ కరపత్రాల పంపిణీ

  • ప్రెస్ మీట్స్, ప్రెస్ నోట్స్‌తో బంద్ పెట్టొద్దంటూ బీజేపీ నాయకుల పిలుపు

  • బీజేపీకి మద్దతుగా బందుపై కాంగ్రెస్ విముఖత

  • బంద్ అవసరం లేదంటూ ప్రకటన విడుదల చేసిన డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

  • రెండు జాతీయ పార్టీలు వర్సెస్ ఓ ప్రాంతీయ పార్టీ అన్నట్టుగా కరీంనగర్ బంద్‌పై కొనసాగుతున్న యుద్ధం.

Advertisement
 
Advertisement
Advertisement