తెలంగాణలో ఈడీ అధికారుల దాడులు.. ఏకకాలంలో 8 చోట్ల.. | WD Raids in Telangana Again | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఈడీ అధికారుల దాడులు.. ఏకకాలంలో 8 చోట్ల..

May 27 2026 3:39 PM | Updated on May 27 2026 3:45 PM

WD Raids in Telangana Again

హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఇసుక, గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. జీఎస్టీ ఎగ్గొట్టి రూ.కోట్లు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీ, ఏజెన్సీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నకిలీ ఇన్ వాయిస్‌లతో గ్రానైట్ తరలించిన కేసులో తనఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ గ్రానైట్ వ్యాపారిని జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టేందుకు నకిలీ బిల్లులతో వంద కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో మరింత దుమారం రేగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement