సాక్షి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. యూనిక్ మర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.800 కోట్లకు టోకరా వేసింది.
మల్టినెట్ వర్కింగ్ సంస్థ యూనిక్ ఎస్‌ఎంసీఎస్ పేరుతో భారీ ఎత్తున జిల్లా వాసుల నుంచి డిపాజిట్లు, ప్రీమియం వసూళ్లు చేపట్టింది. పెట్టిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లిస్తామని ఆశ చూపించింది. అధిక లాభాలకు ఆశపడిన పెట్టుబడి దారులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు.
భారీ ఎత్తున వసూళ్ల అనంతరం బోర్డు తీప్పేసింది. సంస్థకు తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


