సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు.
కరీంనగర్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. హమాలీ రేటు రూ. 20కి పెంచాలని, కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్‌ఐ అమలు పరచాలని, జనశ్రీ బీమాను రూ. 5లక్షలకు పెంచి, కార్మికులకు రూ.10 వేల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళా స్వీపర్‌లకు కనీస వేతనాలు, పీఎఫ్ అమలు చేసి , మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ తక్షణమే చెల్లించాలని కోరారు.