తిరుపతి: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ నిరసనకు దిగింది. నల్లచొక్కాలు ధరించి నిరసనకు దిగాయి వైఎస్సార్‌సీపీ శ్రేణులు. అయితే ఈ నిరసనను పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. అభినయ్ రెడ్డిని అరెస్టు చేసి తిరచానూరు పీఎస్‌కు తరలించారు. ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతల పట్ల పోలీసులు దురుసగా ప్రవర్తించారు. వైఎస్సార్‌సీపీ నేతలను ఈడ్చుకెళ్లారు.
సాక్షి ఫోటో గ్రాఫర్‌పై తిరుచానూరు పోలీసులు దౌర్జన్యం
ఈ క్రమంలోనే సాక్షి ఫోటో గ్రాఫర్‌పై దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అరెస్ట్ నేపథ్యంలో కవరేజ్ కు వెళ్ళిన సాక్షి ఫోటో గ్రాఫర్ కృష్ణపై సీఐ సునీల్ కుమార్ దురుసుగా ప్రవర్తించారు. విధినిర్వహణలో ఉన్న ఫోటో గ్రాఫర్ ను బలవంతంగా వెనక్కి నెట్టారు సీఐ.
తెలంగాణ అంటే చంద్రబాబు భయపడుతున్నారు
అనంతపురం: తెలంగాణ అంటే ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ శైలజానాథ్ మండిపడ్డారు. ‘ పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఐదేళ్లకే వదిలేశారు. రాయలసీమ కు రావాల్సిన హైకోర్టు, ఎయిమ్స్ ను ఇతర ప్రాంతాలకు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. వైఎస్ జగన్‌ను చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కృష్ణా జలాలు ఎలా వినియోగించుకోవాలో జగన్ నుంచి చంద్రబాబు నేర్చుకోవాలి’ అని శైలజానాథ్ సూచించారు.

ఇదీ చదవండి:
‘మీ దయవల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది’


