తిరుపతి: వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్ హత్యను నిరసిస్తూ ఏపీలో పార్టీ శ్రేణులు చేపట్టిన ధర్నా కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లెనూ ఈరోజ(శనివారం, జనవరి 17వ తేదీ) నిరసనకు దిగాయి. దీనిలో భాగంగా తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ధర్నా చేపట్టింది.
ముందుగా డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి,.,.ఆపై ధర్నా చేపట్టింది వైఎస్సార్‌సీపీ. .ఎస్సీ సెల్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర తలారి ఆద్వర్యంలో ధర్నాచేపట్టారు. ఈ మేరకు రాజేంద్ర తలారి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో దళితుల పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారు.రాష్ట్రంలో దళితులు బతకకూడదా?, సల్మాన్ మారణాయుదాలతో అత్యంత కిరాతకంగా చంపేసారు టిడిపీ .మరణించిన సల్మాన్ కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా తోపాటు 5 ఎకరాల భూమి ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్రంలో రెడ్ రాజ్యాన్ని వదిలి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చెయ్యాలి. చంద్రబాబుకు దళితులు బుద్ది చెప్పే సమయంలో వచ్చింది’ అని హెచ్చరించారు.


విజయవాడలో ర్యాలీ
సాల్మన్ హత్యను నిరసిస్తూ విజయవాడలో వైఎస్సార్‌సీపీ ధర్నా చేపట్టింది. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి వైఎస్సార్‌సీపీ శ్రేణలు. పార్టీ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టార. ‘ ఏపీలో దారుణాలు ఘోరంగా ఉన్నాయి. దాడి చేసిన వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.

నరసరావుపేటలో..
పల్నాడు జిల్లాలోని నరసరావు పేటలో వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ‘ దళితులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఒక చనిపోయి వ్యక్తి దగ్గరకు వెళ్లడానికి కూటమి ప్రభుత్వం హైడ్రామా నడిపింది. ఇదేమన్నా న్యాయమా.. ఇది రెడ్‌బుక్ పాలన కాకపోతే మరేంటి? అని ప్రశ్నించింది వైఎస్సార్‌సీపీ. దళితులను బ్రతకనివ్వరా అంటూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న దళిత సంఘాలు నిలదీస్తున్నాయి.



ఏలూరు జిల్లాలో..
పచ్చమూకల దాడులలో హత్యకు గురైన దళిత వైఎస్ఆర్సిపి కార్యకర్త సాల్మన్ హత్యను నిరసిస్తూ ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు ఇంచార్జ్ జయప్రకాష్, వైఎస్ఆర్సిపి శ్రేణులు పాల్గొన్నాయి. ‘
పిన్నెల్లి గ్రామంలో జరిగిన హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నాము. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారు. చివరకు మర్డర్లు హత్యలు చేస్తున్నారు. అధికారంలో ఉంటే సంక్షేమ ఫలాలు అందించాలి. మంచి ప్రభుత్వం అని చెబుతున్నారు మీకు సిగ్గుందా.....?, మంచి ప్రభుత్వం అంతే మర్డర్లు చేయటమా....?’ అని ధ్వజమెత్తారు దూలం నాగేశ్వరరావు.
కృష్ణాజిల్లాలో..
సాల్మన్ హత్యను నిరసిస్తూ గుడివాడలో వైఎస్సార్‌సీపీ నిరసన చేపట్టింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముందుగా నివాళులు అర్పించిన వైఎస్సార్‌సీపీ నాయకులు.. సాల్మన్‌న హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కాకినాడ జిల్లాలో..
సాల్మన్ హత్యను ఖండిస్తూ డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ దళిత విభాగం నిరసన చేపట్టింది. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించిన పార్టీ శ్రేణులు.. నిందితులను అరెస్టు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లాలో..
సాల్మన్ హత్యను నిరసిస్తూ నంద్యాలలో నిరసన కార్యక్రమం చేపట్టింది వైఎస్సార్‌సీపీ. ఈ నిరసన కార్యక్రమంలో దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత నిరసన కార్యక్రమానికి దిగింది వైఎస్సార్‌సీపీ. కూటమి ప్రభుత్వం హత్య రాజకీయాలు ఇంకెన్నాళ్లు వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిలదీశాయి. దళితులు, మైనార్టీల పట్ల కూటమి నేతల దాడులు ఆపకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలుంటాయని వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది.

కర్నూలు జిల్లాలో..
కూటమి ప్రభుత్వం ఆగడాలను నిరసిస్తూ కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత వైఎస్సార్ సిపి కార్యకర్త మండా సాల్మన్ హత్యకు కూటమి ప్రభుత్వంమే కారణమని పార్టీ నేతలు మండిపడ్డారు. తక్షణమే హత్య కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయనగరం జిల్లాలో..
వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ హత్యకు నిరసనగా విజయనగరం లో పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యం లో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. టీడీపీకి ఎస్సీలు అంటే చులకన భావన అని. ఎస్సీ ల పట్ల వివక్ష చూపుతున్నారని దళిత సంఘాలు మండిపడ్డాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నిర్మూలించడానికి టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ పాలన అమలు చేస్తోందని ధ్వజమెత్తారు జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు.
పార్వతీపురం మన్యం జిల్లాలో..
పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో దళితి యువకుడి హత్యను నిరసిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది వైఎస్సార్‌సీపీ.
వైఎస్సార్ జిల్లాలో..
సాల్మన్ హత్యను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా కడపలో పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీనిలో భాగంగా ముందుగా అంబేద్కర్‌కు నివాళులర్పించి.. నిరసన కార్యక్రమం చేపట్టాయి. ‘ మంచి ప్రభుత్వం అంటే మర్డర్లు ేచేయటమా?, సాల్మన్‌ను హత్య ేచేసిన వారిని కఠినంగా శిక్షించాలి. సాల్మన్‌పై దాడి చేసిన టీడీపీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది’ అని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది.


