బోయినపల్లి అంత్యక్రియలకు కేసీఆర్ | CM KCR to attend funeral of Boinapally venkata rama rao | Sakshi
Sakshi News home page

బోయినపల్లి అంత్యక్రియలకు కేసీఆర్

Oct 28 2014 10:01 AM | Updated on Aug 15 2018 9:22 PM

బోయినపల్లి అంత్యక్రియలకు కేసీఆర్ - Sakshi

బోయినపల్లి అంత్యక్రియలకు కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీం నగర్ వెళ్లనున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బోయినపల్లి వెంకట రామారావు అంత్యక్రియాల్లో ఆయన పాల్గొంటారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీం నగర్ వెళ్లనున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బోయినపల్లి వెంకట రామారావు అంత్యక్రియాల్లో ఆయన పాల్గొంటారు.  ఉదయం 11.30 గంటలకు కేసీఆర్ హెలికాప్టర్లో బయల్దేరి కరీంనగర్ చేరుకుంటారు. అధికార వర్గాల మేరకు ఆయన కరీంనగర్ చేరుకున్న వెంటనే నేరుగా బోయినపల్లి వెంకట రామారావు అంత్యక్రియలకు హాజరవుతారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తర్వాత హైదరాబాద్ తిరిగి పయనమవుతారు.

బోయినపల్లితో కేసీఆర్ అనుబంధం

బోయినపల్లి వెంకట రామారావు కుటుంబంతో సీఎంకు ప్రత్యేక అనుబంధముంది. బోయినపల్లి కుమారుడు హనుమంతరావు సీఎంకు చిన్ననాటి క్లాస్మేట్. కేసీఆర్ సతీమణి శోభ, హనుమంతరావు సతీమణి సరళకుమారి వరుసకు అక్కాచెల్లెళ్లు కూడా. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి హనుమంతరావు పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో బోయినపల్లితో కేసీఆర్కు ప్రత్యేక సాన్నిహిత్యం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement