
లాల్‌బహదూర్‌మృతదేహం
శంకరపట్నం(మానకొండూర్): శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులో గురువారం ఉత్తర్‌ప్రదేశ్ వాసి గుండెపోటుతో మృతిచెందినట్లు హెడ్‌కానిస్టేబుల్ జయశంకర్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లాల్‌బహుదూర్(50) కొంతకాలంగా శంకరపట్నం మండలంలో ఐస్‌క్రీమ్‌లు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు.
ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడే మృతి చెందాడు. స్థానికులు కేశవపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని హెడ్‌కానిస్టేబుల్ జయశంకర్ పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.