అగ్రకులాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా విద్యా సంస్థలు, ఉద్యోగాలు, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో ఆందోళన నిర్వహించారు.
అగ్రకులాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా విద్యా సంస్థలు, ఉద్యోగాలు, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని కరీంనగర్-సిరిసిల్ల రహదారిపై బోయిన్‌పల్లి వద్ద మంగళవారం ఉదయం అఖిల పక్షాల ఆధ్వర్యంలో రాస్తా రోకో జరిగింది. ఓసీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులు తీవ్రంగా పోటీ ఉన్న ఓపెన్ కేటగిరీతో నష్టపోతున్నారని విద్యార్థులు ఆరోపించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.