కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. హరితహారంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బస్సుయాత్ర ద్వారా బస్వాపూర్ వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తారు. బస్వాపూర్, హుస్నాబాద్, చిగురుమామిడి, ముల్కనూర్, కొత్తపల్లి, నుస్తులాపూర్, తిమ్మాపూర్, అలుగునూర్ వద్ద మొక్కలు నాటుతారు.
రాత్రి కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి వద్ద నున్న ఉత్తర తెలంగాణభవన్‌లో బసచేస్తారు. ఆదివారం ఉదయం కరీంనగర్‌లో మొక్కలు నాటి యాదాద్రికి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి జిల్లాలోని పెద్దపల్లికి చేరుకుని పెద్దపల్లి, ధర్మారంలో మొక్కలు నాటి రాయపట్నం మీదుగా ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తారు.