సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలో కలకలం రేపింది. బాలికల వాష్‌రూంలో స్కూల్ అటెండర్ రహస్యంగా కెమెరాలు అమర్చాడు. టాయిలెట్‌కు వెళ్లిన బాలికలకు టాయిలెట్‌లో కెమెరా ఉండటాన్ని గుర్తించారు. భయాందోళనకు గురైన బాలలికలు స్కూల్ హెడ్ మాస్టర్‌కి ఫిర్యాదు చేశారు.
కరీంనగర్ పోలీసుల వివరాల మేరకు.. గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న నిందితుడు కెమెరాలు పెట్టినట్లు తెలిపారు. బాలికలు మద్యాహ్న సమయంలో టాయిలెట్‌కు వెళ్లగా అక్కడ కెమెరాలు అమర్చినట్లు బాలికలు స్కూల్ ప్రధానోపాధ్యుడికి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలికలు సమాచారంతో తల్లిదండ్రులు, స్కూల్ హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేశారు.
మరోవైపు గంగాధరలోని పాఠశాల ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితుడి వద్దనున్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


