
సిరిసిల్లకల్చరల్/విద్యానగర్(కరీంనగర్): రాజులు, జమీందారీ వ్యవస్థలో పెళ్లి వారం రోజుల వేడుక కాగా, తర్వాత కాలంలో సాదాసీదాగా మారి ఇప్పుడు మూడు, ఐదు రోజుల ముచ్చటయింది. పసుపు దంచడంతో మొదలయ్యే పెళ్లి వేడుకల్లో ఒకరోజు మెహందీ, మరో రోజు సంగీత్, గానా భజాన, ఇంకోరోజు మంగళ స్నానాలు, కూరాడు, పెళ్లికూతురు ముస్తాబు మరుసటి రోజు పెళ్లితంతు అన్ని కూడా కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు.
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ
పెళ్లి నాటి జ్ఞాపకాలను భద్రంగా దాచుకునేలా ఫొటోగ్రఫీకి పెద్ద పీట వేస్తున్నారు. ఆహ్వానంతో మొదలయ్యే ఫొటోగ్రఫీ ప్రీ వెడ్డింగ్, హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్ని వేడుకలను చిరస్థాయి జ్ఞాపకాలుగా మిగుల్చుకునేలా ఫొటో, వీడియోగ్రఫీలకు ప్రాధాన్యత పెరిగింది. రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఫొటోగ్రఫీ చార్జీలు పెరగడం చూస్తే వధూవరులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం అర్థమవుతుంది.
నవంబర్ వరకు ముహూర్తాలు
ఈనెల 24 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈనెలలో 26,30,31, ఆగస్టులో 1,3,5,7,8,9, 10,11,12,13,14,17 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం. ఇది శూన్యమాసం పెళ్లి ముహూర్తాలు లేవు. మళ్లీ సెప్టెంబర్‌లో 23, 24,26,27,28, అక్టోబరులో 1,2,3,4,8,10,11,12,22, 24,29,30,31, నవంబర్‌లో 1,2,7,8,12,13,15,22,23, 26,27,29,30వ తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. – నమిలకొండ రమణాచార్యులు, కరీంనగర్
ఆధునికతకు ప్రాధాన్యత
పెళ్లి, ఇతర కార్యక్రమాల్లో ఆధునీకతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా అలంకరణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. సంప్రదాయలతోపాటు శోభాయాయానంగా ఉండేలా డేకరేషన్ చేస్తున్నారు. – గోగుల ప్రసాద్, ఈవెంట్ ఆర్గనైజర్, కరీంనగర్
ఇదీ చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!
పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 25 శ్రావణమాసం మొదలు నవంబర్ చివరి వరకు ఊరువాడ పెళ్లి సందడి నెలకొననుంది. బంగారు నగల దుకాణాలు, పెళ్లివస్త్రాలయాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి వంటి జిల్లాల్లో సుమారు 5వేలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని ముహూర్తాలు నిర్ణయించే పురోహితులు చెప్తున్నారు. కాగా, మారిన కాలానికి అనుగుణంగా సంగీత్, మెహెందీ, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ వంటి అదనపు కార్యాలు చోటు చేసుకుంటూ వివాహ వ్యయాన్ని భారీగా పెంచేశాయి. జీవితంలో ఒకేసారి జరిగే వేడుకనే కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వివాహాలకు భారీగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక్కో పెళ్లికి రూ.10 లక్షలకు తగ్గకుండా ఖర్చు పెడుతుండడం ఇప్పుడు సర్వసాధారణమైంది. – సిరిసిల్లకల్చరల్/విద్యానగర్(కరీంనగర్)