breaking news
marriages and functions
-
కల్యాణ వైభోగమే : మూడు రోజుల పెళ్లి, ఆధునికతకు పెద్ద పీట
సిరిసిల్లకల్చరల్/విద్యానగర్(కరీంనగర్): రాజులు, జమీందారీ వ్యవస్థలో పెళ్లి వారం రోజుల వేడుక కాగా, తర్వాత కాలంలో సాదాసీదాగా మారి ఇప్పుడు మూడు, ఐదు రోజుల ముచ్చటయింది. పసుపు దంచడంతో మొదలయ్యే పెళ్లి వేడుకల్లో ఒకరోజు మెహందీ, మరో రోజు సంగీత్, గానా భజాన, ఇంకోరోజు మంగళ స్నానాలు, కూరాడు, పెళ్లికూతురు ముస్తాబు మరుసటి రోజు పెళ్లితంతు అన్ని కూడా కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు.వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పెళ్లి నాటి జ్ఞాపకాలను భద్రంగా దాచుకునేలా ఫొటోగ్రఫీకి పెద్ద పీట వేస్తున్నారు. ఆహ్వానంతో మొదలయ్యే ఫొటోగ్రఫీ ప్రీ వెడ్డింగ్, హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్ని వేడుకలను చిరస్థాయి జ్ఞాపకాలుగా మిగుల్చుకునేలా ఫొటో, వీడియోగ్రఫీలకు ప్రాధాన్యత పెరిగింది. రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఫొటోగ్రఫీ చార్జీలు పెరగడం చూస్తే వధూవరులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం అర్థమవుతుంది.నవంబర్ వరకు ముహూర్తాలుఈనెల 24 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈనెలలో 26,30,31, ఆగస్టులో 1,3,5,7,8,9, 10,11,12,13,14,17 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం. ఇది శూన్యమాసం పెళ్లి ముహూర్తాలు లేవు. మళ్లీ సెప్టెంబర్‌లో 23, 24,26,27,28, అక్టోబరులో 1,2,3,4,8,10,11,12,22, 24,29,30,31, నవంబర్‌లో 1,2,7,8,12,13,15,22,23, 26,27,29,30వ తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. – నమిలకొండ రమణాచార్యులు, కరీంనగర్ఆధునికతకు ప్రాధాన్యతపెళ్లి, ఇతర కార్యక్రమాల్లో ఆధునీకతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా అలంకరణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. సంప్రదాయలతోపాటు శోభాయాయానంగా ఉండేలా డేకరేషన్ చేస్తున్నారు. – గోగుల ప్రసాద్, ఈవెంట్ ఆర్గనైజర్, కరీంనగర్ ఇదీ చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 25 శ్రావణమాసం మొదలు నవంబర్ చివరి వరకు ఊరువాడ పెళ్లి సందడి నెలకొననుంది. బంగారు నగల దుకాణాలు, పెళ్లివస్త్రాలయాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి వంటి జిల్లాల్లో సుమారు 5వేలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని ముహూర్తాలు నిర్ణయించే పురోహితులు చెప్తున్నారు. కాగా, మారిన కాలానికి అనుగుణంగా సంగీత్, మెహెందీ, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ వంటి అదనపు కార్యాలు చోటు చేసుకుంటూ వివాహ వ్యయాన్ని భారీగా పెంచేశాయి. జీవితంలో ఒకేసారి జరిగే వేడుకనే కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వివాహాలకు భారీగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక్కో పెళ్లికి రూ.10 లక్షలకు తగ్గకుండా ఖర్చు పెడుతుండడం ఇప్పుడు సర్వసాధారణమైంది. – సిరిసిల్లకల్చరల్/విద్యానగర్(కరీంనగర్) -
కరోనాతో కల్యాణాలకు తెర..! వర్చువల్ వివాహాలకు సై..!
హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో నివసించే స్వప్నకు అస్ట్రేలియాలో నివసించే అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. గత ఏడాది జనవరిలో నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం.. అదే ఏడాది మే నెల 25న పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. అయితే ఆ ముహూర్తం కాస్తా లాక్డౌన్లో కొట్టుకుపోయింది. అనం తరం కరోనా తగ్గుముఖం పట్టినా ఆస్ట్రేలియా నుంచి పెళ్లికొడుకు వచ్చే పరిస్థితి లేక.. శుభముహూర్తాల్లేక ఈ ఏడాది మే నెలలో పెళ్లి చేయాలని నిర్ణయించి మళ్లీ ముహూర్తం పెట్టుకున్నారు. కానీ కరోనా మరోసారి కాదు కూడదు అంది. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండడంతో విమాన సర్వీసుల రాకపోకలపై ఆస్ట్రేలియా అంక్షలు విధించింది. దీంతో పెళ్లికొడుకు ఈసారి కూడా అక్కడి నుంచి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సాక్షి, హైదరాబాద్: ‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి..’అన్నాడో సినీ కవి. కానీ కొంతకాలంగా పెళ్లిళ్లకు ముహూర్తాలు కలిసిరావడం లేదు. గత ఏడాది పెద్ద సంఖ్యలో ముహూర్తాలకు కరోనా అడ్డుపుల్ల వేసింది. తప్పదు అనుకున్న కొన్ని జంటలు మినహా, ఏమైనా సరే తమకు నచ్చిన విధంగా పెళ్లిళ్లు చేసుకోవాలని ఆశించిన జంటలన్నీ 2021కి వాయిదా వేసుకున్నాయి. ఈ ఏడాది హుషారుగా వివాహాలకు సిద్ధమవుతున్న జంటలకు తొలుత శుక్ర మూఢమి దెబ్బ కొట్టింది. దాదాపు 70రోజుల పాటు శుభకార్యాలకు అవకాశం లేకుండా చేసింది. దీంతో ఉసూరుమంటూ మే నెల 1 నుంచి వైశాఖ మాసం కాబట్టి జూన్ నెల దాకా బాగా ముహూర్తాలు ఉన్నాయిలే అని చాలామంది పెళ్లిళ్లకు అన్ని ముందస్తు ఏర్పాట్లూ చేసేసుకున్నారు. అయితే శుభ ముహూర్తాలు లేని 3 నెలలూ కాస్త నెమ్మదించిన కరోనా.. మరోసారి విరుచుకుపడింది. ఆయా కుటుంబాలను పెళ్లి సందడి నుంచి దూరం చేస్తోంది. ముందు ముహూర్తం.. వెనకే కరోనా ఇతర శుభకార్యాల మాటేమో గానీ.. నూరేళ్ల పంట పెళ్లిని మాత్రం వీలైనంత ఘనంగా, అధిక సం ఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో చేసుకోవాలని అంతా భావిస్తారు. కానీ కరోనా భాజాభజంత్రీలకు బ్రేక్ వేస్తోంది. అనూహ్య రీతిలో విరుచుకుపడుతున్న సెకండ్ వేవ్.. అన్ని ఏర్పాట్లూ చేసుకుని వివాహాలకు సిద్ధమైనవారిని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వధువో, వరుడో రావాల్సిన పెళ్లిళ్లన్నీ దాదాపుగా వాయిదా పడ్డాయి. అంతర్జాతీయంగా చాలా దేశాలు భారత్‌ని రెడ్ జోన్ కంట్రీగా పరిగణిస్తూ మనదేశానికి రాకపోకలపై ఆనేక రకాల ఆంక్షలు పెడుతుం డడమే దీనికి కారణం. మరోవైపు స్థానిక ఆంక్షలు, నిబంధనలు నడుమ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో, ఒకవేళ వివాహ ఏర్పాట్లు చేసినా ఆహ్వానం అందుకున్న అతిధులు ఈ పరిస్థితుల్లో వస్తారో రారో, సందేహాలతో.. ఇప్పటికే మరి కొందరు పెళ్లిళ్లను రద్దు చేసుకుంటున్నట్టు సమాచారం. కొన్ని జంటలు మాత్రం మే నెలాఖరుకు కేసులు తగ్గుముఖం పడతాయని, వ్యాక్సినేషన్ ఊపందుకుంటుందని ఆశాభావంతో ఉన్నాయి. కొందరు మాత్రం వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత కరోనాను ఎదుర్కొంటూనే రకరకాల సర్దుబాట్లతో పెళ్లికి సై అంటున్నారు. వర్చువల్...డెస్టినేషన్ ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలు ఆన్లైన్ అవుతున్నాయి. నిబంధనలు కఠినంగా ఉన్నా, సులభతరం చేసినా పెళ్లికి ప్రత్యక్షంగా హాజరు కావడం కంటే... వర్చువల్‌గా అటెండ్ అవడమే సురక్షితమని చాలామంది ఆహ్వానితులు భావిస్తున్నారని వెడ్డింగ్ విష్ లిస్ట్ అనే సంస్థ నిర్వాహకులు కనికా సుభాష్ చెప్పారు. ఈ కారణంగానే పలు జంటలు తమ పెళ్ళిళ్ల విషయంలో వర్చువల్ ప్లాన్స్‌కి ఓటేస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ నగరాల్లో నిబంధనలు శరవేగంగా మారుతున్నాయి. కొన్ని ప్రభుత్వాలు లాక్డౌన్ వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీంతో కొంతమంది తమ పెళ్లిళ్లను తక్కువ నిబంధనలు ఉన్న గోవా లాంటి చోట్లకు మారుస్తున్నారని (డెస్టినేషన్ వెడ్డింగ్స్) ఆన్లైన్ వెడ్డింగ్ ప్లాట్ ఫామ్ వెడ్డింగ్ బ్రిగేడ్‌కు చెందిన సన్నా వోహ్రా తెలిపారు. అయితే ఈ విధంగా ప్లాన్ చేసేవారు... తాము వెళ్లబోతున్న ప్రాంతంలో ఆకస్మిక నిబంధనలు వచ్చిపడే అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ప్లాన్–బీ కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉందని వెడ్డింగ్ ప్లానర్ హరీష్ సూచించారు. వివాహం, విందు వేళల్లో మార్పులు రాత్రి కర్ఫ్యూ వల్ల వివాహ వేడుకలలో భాగమైన విందుల వేళలూ మారిపోయాయి. విందు విషయానికి వస్తే బ్రంచ్ లేదా లంచ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. పెళ్లి టైమ్ కూడా వీలున్నంత వరకూ ఉదయం వేళలోనే ఉండేలా చూస్తున్నారు. పరిమిత సంఖ్యలో ఆతిథులను ఆహ్వానించాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కేవలం వదువు, వరుడు కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, చాలావరకు ప్రస్తుతం పెళ్లిళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదనే భావనలో ఉన్నారు. కరోనా పరిస్థితుల నుంచి తేరుకున్న తర్వాతే వెడ్డింగ్ చేసుకోవడం మేలని పెళ్లి వాయిదాకే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే చేసుకున్న అడ్వాన్స్ బుకింగ్‌లు రద్దు చేసుకుంటున్నారు. అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కొందరు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, కేటరింగ్ తదితర ఏర్పాట్ల నిర్వాహకులు పెళ్లి ఎప్పుడు జరిగితే అప్పుడు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. ఆధారిత రంగాలపై ప్రభావం పెళ్లి రెండు కుటుంబాలకు సంబంధించిందే అయినా.. ఆ పెళ్లి జరిగే తీరుతెన్నులపై కొన్ని పదుల, వందల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉంటాయన్న విషయం తెలిసిందే. వరుసగా పెళ్లిళ్లకు వచ్చిపడుతున్న అడ్డంకులతో ఫంక్షన్ హాల్స్ మొదలుకుని కేటరింగ్ సంస్థలు ఇంకా అనేక రంగాలకు చెందిన వారు తీవ్రంగా నష్టపోనున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా జనవరి నుంచే ఫంక్షన్‌హాళ్లకు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు, ఇతర ఏర్పాట్లకు చాలామంది ముందస్తు బుకింగ్‌లతో అడ్వాన్స్‌లు భారీగా చెల్లించారు. తీరా సెకండ్‌వేవ్ విజృంభణతో శుభకార్యాలు వాయిదా వేసుకోగా ఇప్పుడివి వెనక్కి రావడం లేదని, ఈ విధంగా కూడా నష్టపోయామని పెళ్లిళ్లను వాయిదా వేసుకున్న వారు వాపోతున్నారు. చాలావరకు వాయిదాకే మొగ్గు ఏప్రిల్ నెలాఖరు నుంచి జరగాల్సిన పెళ్లిళ్లు చాలావరకు ఆగిపోయాయి. ఇండియా రెడ్ జోన్ అని విదేశాలు ప్రకటించడంతో విదేశీ సంబంధాలు కుదుర్చుకున్నవారు వాయిదా వేయక తప్పడం లేదు. పెళ్లికి ఇరువైపు కుటుంబాల అమ్మమ్మలు, తాతయ్యలు వంటి పెద్దలంతా తప్పకుండా ఉండాల్సిందే. కానీ ఇప్పటి పరిస్థితుల్లో వారి ఆరోగ్యానికి సమస్యలొస్తాయని వెనకాడుతున్నారు. దాదాపుగా మే నెలలో పెట్టుకున్న ముహూర్తాలన్నీ వాయిదాపడినట్టే. దీంతో చాలామంది అడ్వాన్సుల రూపంలో చెల్లించిన రూ.లక్షలు నష్టపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గితే గానీ వివాహాలు ఊపందుకోవు. –డి.వి.కోటిరెడ్డి, అవినాష్‌రెడ్డి మ్యారేజ్ బ్యూరో మళ్లీ అక్టోబర్‌లోనే మంచిరోజులు పోయిన ఏడాదంతా కరోనా. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఏప్రిల్ నెలాఖరు దాకా మంచి రోజులు లేకపోవడం వల్ల పెళ్లిళ్లు జరగలేదు. తాజాగా మొదలవుతున్న పెళ్లిళ్ల సీజన్ జూన్ 26 వరకూ కొనసాగుతుంది. ఈ కరోనా కారణంగా కొన్ని పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి కొందరు ఇళ్లలోనే చేసేద్దామంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఈ సీజన్లో కూడా పెద్దగా పెళ్లిళ్లు జరిగేలా లేవు. ఆ తర్వాత మంచి రోజులు అంటే మళ్లీ అక్టోబర్ దాకా ఆగాల్సిందే. –ఒరుగంటి కళ్యాణ రామశర్మ, పురోహితులు -
జనంపై ‘రద్దు’ రుద్దుడు ఏల?
డేట్లైన్ హైదరాబాద్ పెద్ద నోట్ల రద్దు ఫలితంగా వైద్యం అందక కొందరు, మందు గోలీ కొనుక్కోలేక ఇంకొందరు పిచ్చి వాళ్లలా రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. సామాన్యుల ఇళ్లలో శుభకార్యాలన్నీ ఆగిపోయాయి. అధికారపక్ష పెద్దల, రాజకీయ నేతల ఇళ్లలో వందల కోట్ల ఖర్చుతో జరిగే పెళ్లిళ్లు, దావత్‌లు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే పెద్ద నోట్ల రద్దు ఎవరిని కట్టడి చెయ్యడానికి? అని అనుమానం కలుగుతోంది. రెండున్నరేళ్లలో చూపించలేని అచ్చే దిన్ను యాభై రోజుల్లో చూపిస్తాను అంటున్నారు ప్రధాని. దేశంలో పెద్ద నోట్లు రద్దయ్యి సరిగ్గా రెండు వారాలు గడిచాయి. దేశమం తటా ప్రజలు రోడ్ల మీద, పాలకులు ఏసీ గదుల్లో, రాజకీయ పక్షాలు చట్ట సభల్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఎవరి వాదన వాళ్లది. ప్రజలయితే కష్ట పడుతున్నారు. ప్రజలు తమను కష్టపెట్టడం కోసం ప్రభుత్వాలను ఎన్ను కోరు. తమను కష్టాల కడలి దాటిస్తారని నమ్మి రాజకీయ పార్టీలకు పట్టం కడతారు. అంతే కానీ తమ కష్టార్జితాన్నే లాగేసుకుని, దానికి లేనిపోని లెక్కలు అంట గట్టి, ఆ లెక్కలే సరిగా చెప్పకుంటే జైలులో పెడతామని బెదిరిస్తారని ఎవరు ఊహిస్తారు? పది శాతం కూడా లేని దొంగలను పట్టుకునే సమర్థ్ధత, వ్యూహాలు, ఎత్తుగడలు లేక... మిగిలిన 90 శాతం మందిపైన రాత్రికి రాత్రి తలా తోక లేని నిర్ణయాలను నెత్తిన బండ ఎత్తేసినట్టు విసురుతారని తెలిస్తే ప్రజలు వాళ్లకు ఓట్లేసి గద్దె మీద కూర్చోబెట్టరు కదా! ప్రజలు కష్టపడు తున్నారని విపక్షాలు, ఇష్టపడుతున్నారని అధికార పక్షీయులు... ఎవరి వాదన వారు చేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ నాయకుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, కవి గారు చెప్పినట్టు ‘‘ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖ పడాలి నంద నందనా’’ అన్న తీరున అచ్చే దిన్, అచ్చే దిన్ అని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఎటువంటి ‘అచ్చే దిన్’ ఇచ్చారో ఇవ్వాళ రోడ్ల మీద బారులు తీరిన సామాన్య ప్రజలను చూస్తే అర్థం అవుతుంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై క్యూ లైన్లలోనే మరణిస్తున్న వారిని చూస్తే తెలుస్తుంది. విపరీత పని భారంతో మానసిక ఒత్తిడికి గురయి చనిపోతున్న బ్యాంకు సిబ్బందిని చూస్తే అవగతమవుతుంది. యాభై రోజుల్లో ‘అచ్చే దిన్’ వచ్చేనా? సామాన్యుల ఇంట పెళ్లిళ్లు తదితర శుభకార్యాలన్నీ ఆగిపోయాయి. అధికార పక్ష పెద్దల, రాజకీయ నేతల ఇళ్లలో వందల కోట్ల ఖర్చుతో జరిగే పెళ్లిళ్లు, దావత్‌లు ఏ ఆటంకం లేకుండా జరుగుతూనే ఉన్నాయి. ఈ రెండు వారాల్లోనే మంచి ముహూర్తాలున్నాయని దేశమంతటా పెళ్లిళ్లు పెట్టుకున్నారు. పేదింటి పెళ్లిళ్లు ఆగిపోయారుు లేదా అరకొర ఏర్పాట్లతో అయిందని అనిపించు కున్నాయి. కలవారింటి పెళ్లిళ్లలో టన్నుల కొద్దీ ఖరీదయిన భోజనం వండి వార్చారు. వేల, లక్షల లీటర్ల స్కాచ్ విస్కీ ఏరులై పారింది. హైదరాబాద్‌లో గత వారం కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ నేత ఇంట జరిగిన పెళ్లి సందడిని చూస్తే... పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎవరిని కట్టడి చెయ్యడానికి? అని అనుమానం కలిగింది. చెల్లె పెళ్లి కోసం దాచుకున్న రూ. 50 వేల కోసం బిచ్చం ఎత్తుకున్నట్టు బ్యాంకు అధికారుల ముందు చేతులు జాపి ప్రాధేయ పడుతున్న ఒంటరి మహిళను కట్టడి చెయ్యడానికి ఇది ఉపయోగపడిందే తప్ప... పెళ్లి పేరిట కోట్లాది రూపాయలను స్కాచ్ విస్కీగా ప్రవహింప చేసిన సంపన్నుడిని మాత్రం ఏ ఇబ్బందీ పెట్టలేక పోయింది. వైద్యం అందక కొందరు, మందు గోలీ కొనుక్కునే చిల్లర దొరకక ఇంకొందరు పిచ్చి వాళ్ల లాగా రోడ్లు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. అచ్చే దిన్ ఎక్కడా అని సందు సందు వెతుకుతూనే ఉన్నారు . రెండున్నర సంవత్సరాల్లో చూపించలేని అచ్చే దిన్ను యాభై రోజులు ఆగండి చూపిస్తాను అంటున్నారు మన ప్రధాని. సంచలన ప్రచారాలను నమ్మే, ఆచరించే విశ్వాసాలు పునాదిగా నడిచే రాజకీయాల నుండి ఎదిగిన వారు కాబట్టి ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. నిజంగా అశేష ప్రజానీకం ఈ నిర్ణయాన్ని ఇష్టంగా భరిస్తున్నారా? లేక ప్రభుత్వాన్ని నిందిస్తున్నారా? తేల్చే పరీక్ష ఎన్నికలు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల గడువు ఉన్నా రెండు, మూడు మాసాల్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అది తేలిపోతుంది. మినీ భారత్‌గా భావించే ఉత్తరప్రదేశ్ కూడా ఆ ఐదింటిలో ఉంది. 2014 పార్ల మెంటు ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్నిచ్చిన రాష్ట్రమది. ఆ పార్టీ నాయ కత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి 2019 దాకా ఢోకా లేకపోయినా... ఉత్తర ప్రదేశ్ ఫలితాల ప్రభావం మాత్రం కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ భవి ష్యత్తును మాత్రం నిర్ణయిస్తుంది. ఎవరి తీరు వారిది మోదీజీ రాజకీయ విశ్వాసాలే పునాదిగా అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల గురించి పెద్దగా మాట్లాడుకోవలసిన పని లేదు. ఇక గత 70 ఏళ్లలో అత్యధిక కాలం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు, వాటి ముఖ్యమంత్రులు ఏం మాట్లాడినా... ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎదురు దాడి అస్త్రాన్ని ఎంచుకుంటోంది. కమ్యూనిస్ట్‌లు అధికారంలో ఉన్న రాష్ట్రాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సహజంగానే వాళ్లు ఈ నిర్ణయాన్నే కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ నిర్ణయాన్నయినా సిద్ధాంత రీత్యా వ్యతిరేకించవలసిందే. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టేతర రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి ముఖ్య మంత్రులు ఈ వ్యవహారంలో ఏం చేస్తున్నారు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసేసి చేతులు దులుపుకుంటాను అంటే కుదరదు. దాని ఫలితాలు, మంచి చెడులు ప్రత్యక్ష ప్రభావం చూపేది రాష్ట్రాల మీద, వాటి ప్రభుత్వాల మీద. రాష్ట్రాల సమాహారమే కేంద్రం. రాష్ట్రాలు లేకుండా కేంద్రం అనేది ప్రత్యేకంగా ఉండదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని ఆందోళన బాట పట్టారు కూడా. ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్ర నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తే, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన వ్యతిరేకించింది. కేసీఆర్ అభినందనీయుడు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాన మంత్రి మోదీ ప్రకటించిన వెంటనే ఆ చర్యను తీవ్రంగా విమర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కొద్ది సమయంలోనే తన స్వరాన్ని కొంత తగ్గించి ప్రధాన మంత్రిని కలవడానికి నేరుగా ఢిల్లీ పయనమయ్యారు. ఈ నిర్ణయం మీద తమ ప్రభుత్వ వైఖరి కేంద్రానికి తెలపడానికి ఢిల్లీ వెళ్ళిన తొలి ముఖ్య మంత్రిగా ఆయన కు మార్కులు వెయ్యాల్సిందే. చంద్రశేఖర్ రావు అటు ఎన్డీఏ కూటమికి గానీ ఇటు ఎన్డీఏ వ్యతిరేక కూటమికిగానీ చెందిన పార్టీ నేత కారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత ఈ రెండేళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి స్వతంత్రంగానే ఉంటూ వ చ్చింది. కేంద్రానికీ, రాష్ట్రానికీమధ్య ఉండే సంబంధాలే కొనసాగాయి. పైగా చంద్రశేఖర్ రావు ఎన్నడూ పెద్ద నోట్లు రద్దు చెయ్యండని కేంద్రాన్ని కోరిన నాయకుడూ కారు. కాబట్టి తన రాష్ట్ర ప్రజల తరఫున ఆయన కేంద్రం దగ్గరికి వెళ్లి ఈ విషయంలో మాట్లా డిందంతా ఆయన అనుకూల ఖాతాలో జమవుతుంది. తాత్కాలికమో, దీర్ఘ కాలికమో ఏదరుుతేనేం దేశమంతా కేంద్ర నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బం దులను ఎదుర్కొంటున్నది. అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలకూ డబ్బు కటకట తప్పదు. చంద్రశేఖర్ రావు ఢిల్లీ యాత్ర తెలంగాణ ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారాన్ని పెద్దగా ఏమీ సాధించినట్టు కనపడదు. అయితే లోపల ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఆయన చొరవ మాత్రం అభి నందనీయమే. ‘రద్దు’ అన్న బాబు నోట అసహనం మాట మరి ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చెయ్యాలని కోరుతూ మొట్ట మొదట ప్రధానికి లేఖ రాసింది ఆయనే. ఆ కోణంలో మాత్రమే కాకుండా ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటున్న పార్టీగా ఆయనేం చేస్తున్నారు? అనేదీ ముఖ్యమే. ఈ చర్య అనుకూల ఫలితాలను ఇచ్చి ఉంటే... ఇదంతా తన లేఖ కారణంగానే అని ఆయన తప్పక ప్రచారం చేసుకునేవారే. కానీ ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతో ఈ నిర్ణయం తననే తీవ్ర అసహ నానికి గురి చేసిందన్నారు. అదే నిజమరుుతే అంత అసహనాన్ని రేకెత్తించే నిర్ణయం తీసుకోవాలని మోదీ మీద ఒత్తిడి తెస్తూ ఆయన ఆ లేఖను ఎందుకు రాసినట్టు? పదే పదే పెద్ద నోట్లను రద్దు చెయ్యాలని ఎందుకు కోరినట్టు? అని ప్రశ్నించకూడదు. ప్రశ్నించే వాళ్ళంతా ఆయన దృష్టిలో ఉన్మాదులు, అభివృద్ధి వ్యతిరేకులు. ఈ విషయంలోనైతే జాతి వ్యతిరేకులు, దేశ ద్రోహులు అని కూడా అంటారేమో. పోనీ అదలా ఉంచితే ఈ విపత్తు వల్ల ప్రజలకు కలుగు తున్న కష్టాలను కడతేర్చడానికి ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ల లేదు, ప్రధానితో ఎందుకు మాట్లాడలేదు. మాట వినకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఎందుకు ఉపసంహరించలేదు? ఆయన అమరావతి నుండే అన్నీ చక్కబెడుతున్నారని తెలుగుదేశం నాయకులు దబాయించేస్తారు. పోనీ అది నిజమే అయితే మరి ఫలితాలేవి? ఏపీలో కూడా జనం బ్యాంకుల చుట్టూ తిరుగు తూనే ఉన్నారు, నానా కష్టాలూ అనుభవిస్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడయినా అంతే. రాష్ట్రాన్ని విడగొట్టండి అని కేంద్రానికి లేఖ రాస్తారు, ఇంకా ఆలస్యం ఎందుకు శాసనసభలో విభజన తీర్మానం పెట్టండి అని నిలదీస్తారు. తీరా నిర్ణయం జరిగిపోయాక ఎవరిని అడిగి చేశారీ పని? అని కళ్లు ఎర్ర చేస్తారు. ఏపీకి పదిహేనేళ్ల పాటూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటారు. కుదరదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు రక్తం సలసలా కాగిపోతుంది. అయినా ప్రత్యేక ప్యాకేజీతోనే సర్దుకుపోతారు. చంద్రబాబుకు తీవ్ర అసహనం కలిగినా, ఆయన రక్తం సలసలా మరి గినా ఆయన్ను చల్లగా చల్లార్చే మంత్రం మోదీ దగ్గర ఎలాగూ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈలోగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నగదు రహిత, కార్డు సహిత జీవితాన్ని ఎలా అలవాటు చేసుకోవాలో పాఠాలు చెబుతూ ఉంటారు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com