కరీంనగర్ జిల్లాలో రైతు ఆత్మహత్య | farmer commits suicide in karim nagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్ జిల్లాలో రైతు ఆత్మహత్య

Jan 27 2016 11:24 AM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోనే తండ్రి కూడా తనువు చాలించాడు.

చిగురుమామిడి: అప్పుల బాధతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోనే తండ్రి కూడా తనువు చాలించాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎస్‌కే బురాన్(50) కౌలు రైతు. ఇతనికి కొడుకు యాకూబ్ వ్యవసాయంలో సాయ పడుతుంటాడు.
 
గత రెండేళ్లుగా వ్యవసాయం కలసి రాకపోవటంతో అప్పులు రూ. 4 లక్షల వరకు మిగిలాయి. అవి తీరేదారి కానరాక యాకూబ్ నెల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అధికారులెవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కౌలు రైతుగా యాకూబ్‌ను గుర్తించలేదు. దీంతో ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం అందాల్సిన సాయం రాదనే మనోవేదనతో బురాన్ మంగళవారం రాత్రి పొలంలోనే ఉరి వేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement