జమ్మికుంట తహశీల్దార్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు! | Sakshi
Sakshi News home page

జమ్మికుంట తహశీల్దార్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు!.. వెల్లడించిన ఏసీబీ

Published Wed, Mar 13 2024 9:12 PM

ACB Reveals jammikunta Tahsildar Rajini Assets - Sakshi

సాక్షి, కరీంనగర్‌: జమ్మికుంట తహశీల్దార్ రజినీ ఆస్తులను ఏసీబీ ప్రకటించింది. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.20 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 22 ఓపెన్‌ ఫ్లాట్స్‌, 7 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు పేర్కొంది. కిలోలకొద్దీ బంగారం, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బినామీ పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తుల కొనేందుకు తహశీల్దార్ రజినీ అడ్వాన్స్‌ చెల్లించినట్లు తెలిపింది. 

జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇంట్లో ఇవాళ ఏసీబీ సోదాలు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేశారు. హన్మకొండలోని కేఎల్‌ఎన్‌ రెడ్డి కాలనీలో తహశీల్దార్ రజని బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement