అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య | Karim nagar man shot dead in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య

Dec 15 2017 9:20 AM | Updated on Apr 4 2019 3:25 PM

Karim nagar man shot dead in America - Sakshi

కరీంనగర్‌ :  అమెరికాలో దుండగుల చేతిలో మరో తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒహియోలోని ఓ మాల్‌లో పనిచేస్తున్న  కరీంనగర్‌ జిల్లా వాసి కరేంగ్లే కరుణాకర్‌ (53)పై ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గత వారం (డిసెంబర్‌ 8) చోటుచేసుకుంది. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించగా  చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కాగా  కాల్పులకు పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు కరుణాకర్‌కు భార్య విజయ, కుమారుడు అంకిత్‌ ఉన్నారు. వీరు ప్రస్తుతం కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు. కరుణాకర్‌ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement