NRI murdered
-
USA: భారతీయుల వరుస హత్యలు.. స్పందించిన వైట్‌హౌస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వారిపై ఇటీవలి కాలంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. కొందరు వ్యక్తుల దాడుల్లో భారతీయులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో వరుస దాడులపై అమెరికాలోని వైట్ హౌస్ వర్గాలు స్పందించాయి. ఈ క్రమంలో భారతీయులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు శ్వేతసౌధం స్పష్టం చేసింది. అలాగే, అమెరికాలో జాతి వివక్షకు, హింసకు తావులేదని తేల్చి చెప్పింది. వివరాల ప్రకారం.. అమెరికాలో భారత సంతతి వారిపై దాడులను వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలో జాతివివక్షకు, హింసకు తావు లేదని తేల్చింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్బీ తాజాగా ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారతీయులపై దాడులపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘జాతి, ప్రాంతం, స్త్రీపురుష బేధాలు సహా మరే ఇతర కారణాలతో జరిగే దాడులైనా క్షమార్హం కాదు. అమెరికా ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తోంది. వీటిని అరికట్టేందుకు బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది. ఈ దాడుల కారణమైన వారికి కఠినంగా శిక్షిస్తాం అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. నిన్న(గురువారం) కూడా మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అలబామాలో హోటల్ నడుపుతున్న ప్రవీణ్ రావూజీభాయ్ పటేల్‌ను అద్దె గది కోసం వచ్చిన ఓ కస్టమర్ గన్‌తో కాల్చి చంపాడు. మరోవైపు.. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ తెలిపారు. అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, స్థానిక పోలీసులు దీనిపై వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు భారత్‌లో ఉన్న విద్యార్థుల కుటుంబసభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయని చెప్పారు. మరణాలు ఇవే.. ఇక, ఇటీవలి కాలంలో అమెరికాలో జరిగిన దాడుల్లో వివేక్ తనేజా హత్యకు గురయ్యాడు. సయ్యద్ మజర్ అలీపై కొందరు దాడి చేసి అతడి ఫోన్, వ్యాలెట్ దోపిడీ చేశారు. శ్రేయాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య కూడా మృతి చెందినట్టు బయటపడింది. -
కారులో ఉన్న అజ్ఞాత వ్యక్తే హత్యకు పాల్పడ్డాడా?
సాక్షి, అమరావతి బ్యూరో : వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ మృతిపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవర్, గన్‌మెన్ లేకుండా ఏ రోజూ ఒంటరిగా కారులో బయటకు వెళ్లని జయరామ్ బుధవారం తానే డ్రైవింగ్ చేసుకుంటూ కారులో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?.. జయరామ్ మృతి చెందడానికి ముందు ఆయనతో పాటు కారులో ఉన్నది ఎవరన్నది ఇప్పుడు కీలక అంశమైంది. హైదరబాద్‌లో ఉన్న ఆయన సమీప బంధువులపైనా అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. జయరామ్ భార్య, పిల్లలు ఆమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్న జయరామ్ ఫ్యాక్టరీ, బ్యాంకు కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం ఇంటి నుంచి ఒంటరిగా తానే స్వయంగా కారును నడుపుకుంటూ బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎవ్వరికీ ఫోన్లో అందుబాటులో లేకుండాపోయారు. ఆ తర్వాత గురువారం సాయంత్రం మాత్రం తాను విజయవాడ వస్తున్నానని బస చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వారికి సూచిస్తూ బెజవాడలో ఉన్న తన సిబ్బందికి ఫోన్ ద్వారా మేసేజ్ పంపించారు. తర్వాత ఆయన భార్యతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో ఏం మాట్లాడారు అన్న దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. విజయవాడలోని తన బస ఏర్పాట్ల గురించి పంపిన మేసేజ్ ఆయన ఫోన్ నుంచి వెళ్లిన లాస్ట్ మేసేజ్‌గా పోలీసులు గుర్తించారు. తరువాత కొద్ది గంటల్లోనే ఆయన అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డారు. కారులో ఉన్నదెవరు? నందిగామ సమీపంలోని కీసర టోల్గేట్, ఐతవరం సమీపంలో ఓ కార్లో జయరామ్ మృతదేహం లభ్యమైంది. శుక్రవారం తెల్లవారుజామున కారులోని మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇతర డాక్యుమెంట్లను పరిశీలించిన పోలీసులు కారులో ఉన్న మృతదేహం చిగురుపాటి జయరాందేనని గుర్తించారు. కార్లో వెనక సీట్లో రక్తపుమడుగులో ఉన్న జయరామ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆయన తలపై బలమైన గాయాలున్నాయేమోనని చూడగా.. తలపై ఎలాంటి గాయాలు లేనట్లు తేలింది. రోడ్డు ప్రమాదం జరిగిన దాఖలాలు కూడా అక్కడ కనిపించడం లేదు. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టోల్గేట్ల వద్ద సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా కారులో తెల్లదుస్తులు ధరించిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ కనిపించడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ కారులో ఉన్న అజ్ఞాత వ్యక్తే ఈ హత్యకు పాల్పడ్డాడా? లేదా అతనికి ఇంకెవరైనా సాయం చేశారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న డ్రైవర్‌ను కాదని.. తానే స్వయంగా కారును డ్రైవింగ్ చేసుకుంటూ బయటకు వచ్చిన జయరామ్ ఆ తర్వాత ఎక్కడెక్కడకు వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? అన్న విషయాలు బయటకొస్తేనే అసలు జయరామ్ హత్యకు కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మద్యంలో సైనెడ్ కలిపారా? దిండుతో ఊపిరాడకుండా చంపేశారా? జయరామ్ తలపై ఎలాంటి గాయాలు లేవని నిర్ధారించుకున్న పోలీసులు ఇది కచ్చితంగా హత్యనేనని తేల్చినట్లు తెలిసింది. ఎందుకంటే జయరామ్ చెవి, ముక్కు నుంచి రక్తం కారినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో జయరామ్‌ను ఏదైనా దిండులాంటి వస్తువుతో ఊపిరాడకుండా చేసి చంపేయడంతోనే అతని ముక్కు, చెవి వెంట రక్తం కారి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.లేదా కారులో ఉన్న మద్యం సీసాలను బట్టి అందులో సైనెడ్ కలిపి జయరామ్‌కు తాగించడం వల్ల కూడా అలా జరిగే అవకాశాలు లేకపోలేదని వారు అంటున్నారు. సమీప బంధువులపైనాసందేహాలు.. చిగురుపాటి హత్యకు హైదరాబాద్‌లోనే కుట్ర జరిగిందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్య కుట్రలో ఆయన బంధువుల పాత్ర ఏమైనా ఉందా? అన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జయరామ్ సమీప బంధువు, మేనకోడలు శిఖా చౌదరిని విచారణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య
కరీంనగర్ : అమెరికాలో దుండగుల చేతిలో మరో తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒహియోలోని ఓ మాల్లో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా వాసి కరేంగ్లే కరుణాకర్ (53)పై ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గత వారం (డిసెంబర్ 8) చోటుచేసుకుంది. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కాగా కాల్పులకు పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు కరుణాకర్‌కు భార్య విజయ, కుమారుడు అంకిత్ ఉన్నారు. వీరు ప్రస్తుతం కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. కరుణాకర్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఎన్నారై దారుణహత్య
హైదరాబాద్: పాతబస్తీలో దారుణం వెలుగుచూసింది. తన భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే అనుమానంతో ఓ ఎన్నారై వ్యక్తిని దారుణంగా హతమార్చి.. అనంతరం మృతదేహాన్ని తన ఇంట్లోనే పూడ్చిపెట్టాడో ప్రబుద్ధుడు. వివరాలు.. ఫతేదర్వాజాకు చెందిన సయ్యద్ ఇమ్రాన్(35) గత కొంత కాలంగా విదేశాల్లో స్థిరపడి ఈ మధ్యే నగరానికి తిరిగివచ్చాడు. అతనికి ఫలక్‌నుమా రైతుబజార్ సమీపంలో నివాసముండే ఫాతీమాతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు గుర్తించిన ఫాతీమ భర్త సయీద్ బారాబూద్ అతన్ని దారుణంగా హతమార్చి బండ్లగూడలోని హాషామాబాద్‌లోని తన ఇంట్లో పూడ్చి పెట్టాడు. ఈ నెల 4న (శనివారం) ఇమ్రాన్ అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు లభించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు జరిపగా విషయం బయటపడింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి
అదృశ్యమైన ఐదు రోజులకు మృతదేహం లభ్యం హైదరాబాద్: నగరంలో ఓ ఎన్ఆర్ఐ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంటి నుంచి వాకింగ్‌కని వెళ్లి ఐదు రోజుల తర్వాత శవమై కనిపించాడు. బోయిన్పల్లి పోలీసుల కథనం ప్రకారం...పాత బోయిన్పల్లి రాజారెడ్డి కాలనీకి చెందిన గౌతమ్‌రెడ్డి (30) ఎనిమిదేళ్ల క్రితం కెన్యా వెళ్లి వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అతనికి ఎనిమిది నెలల క్రితం కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన యామినితో వివాహమైంది. గౌతమ్‌రెడ్డి గత నెల 29న కెన్యా నుంచి రాజారెడ్డి కాలనీలోని తన ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి 7.20కి వాకింగ్‌కు వెళ్లొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు 30న బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని డెయిరీ ఫారం వద్ద చెట్ల పొదల్లో ఒంటిపై దుస్తులు కాలిపోయి, కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని చూడగా మృతదేహం పక్కనే ఖాళీ పెట్రోల్ బాటిల్, ఓ పర్సు పడి ఉన్నాయి. పర్సు ఆధారంగా మృతుడిని ఎన్ఆర్ఐ గౌతమ్‌రెడ్డిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గౌతమ్‌రెడ్డికి నగరంలో శత్రువులెవరూ లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏం జరిగి ఉంటుంది? గౌతమ్‌రెడ్డి మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 29న సాయంత్రం ఇంటికి చేరుకున్న గౌతమ్‌రెడ్డి.. ఇంట్లో ఉన్న మూడు గంటల్లో ఏదైనా సంఘటన జరిగిందా అని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై మృతుడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు నోరు విప్పితేనే అసలు విషయం బయటకు వస్తుందంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు గౌతమ్‌రెడ్డి సెల్‌ఫోన్ పట్టుకెళ్లాడని, వాచ్ ధరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తొలుత పేర్కొన్న కుటుంబ సభ్యులు ఆ తర్వాత సెల్‌ఫోన్ తీసుకెళ్లలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
బోయిన్ పల్లిలో ఎన్ఆర్ఐ దారుణ హత్య