కరీంనగర్ జిల్లాలోని సల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ (35) అనే యువరైతు విద్యుత్‌షాక్‌తో శుక్రవారం మృతి చెందాడు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని సల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ (35) అనే యువరైతు విద్యుత్‌షాక్‌తో శుక్రవారం మృతి చెందాడు. వివరాలు.. శ్రీనివాస్ రెండు ఎకరాల విస్తీర్ణంలో వరిని సాగు చేశాడు. పొలానికి నీరు పెట్టేందుకు మధ్యాహ్నం మోటార్ వద్దకు శ్రీనివాస్ వెళ్లాడు. మోటార్ స్టార్ట్ చేసేందుకు స్టార్టర్‌ను నొక్కడంతో విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ స్టార్టర్ వదలకపోవడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు గమనించి అక్కడికి వెళ్లి చూశారు.
వెంటనే 108 కి సమాచారం అందించినప్పటికి ఆలస్యం కావడంతో మరో వాహనంలో హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతునికి భార్య స్రవంతి, కుమారుడు శివ, కూతురు శ్రీవాణి ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(సుల్తానాబాద్)