మిర్రర్ రైటింగేల్ | bandari kartika gets 5 awards for mirror writing | Sakshi
Sakshi News home page

మిర్రర్ రైటింగేల్

Jan 24 2014 12:19 AM | Updated on Sep 2 2017 2:55 AM

మిర్రర్ రైటింగేల్

మిర్రర్ రైటింగేల్

కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్‌స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బండారి కార్తీక తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మిర్రర్ రైటింగ్(అక్షరాలను తిరగేసి రాయడం)లో ఐదు రికార్డులు సాధించింది.

కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్‌స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బండారి కార్తీక తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మిర్రర్ రైటింగ్(అక్షరాలను తిరగేసి రాయడం)లో ఐదు రికార్డులు సాధించింది. గురువారం పాఠశాలలో నిర్వహించిన పరీక్షలో కార్తీక తెలుగులో 16 పేజీలు మహాత్మా గాంధీ జీవి త చరిత్ర, హిందీలో 13 పేజీలు మదర్ థెరిస్సా జీవిత చరి త్ర, ఇంగ్లిష్‌లో 16 పేజీలు అబ్దుల్ కలాం జీవిత చరిత్రను మిర్రర్ రైటింగ్‌లో రాసింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డు, మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్, వరల్డ్ అమేజింగ్ రికార్డ్, ఆర్‌హెచ్‌ఆర్ రికార్డ్ సాధించి అబ్బురపరిచింది. చిన్నప్పటినుంచే మిర్రర్ రైటింగ్‌లో ప్రావీణ్యం ఉన్న కార్తీక పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకు ప్రతిపాదించారు.     

- కోరుట్ల, న్యూస్‌లైన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement