శాతవాహన వర్సిటీ వద్ద ఉద్రిక్తత

quarrel between two student organisations - Sakshi

మనుధర్మ శాస్త్రాన్ని తగులబెట్టిన విద్యార్థులు

ఘర్షణపడిన ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు

భారీగా మోహరించిన పోలీసులు

కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వద్ద స్థానిక యువకులకు, కాలేజీ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 
యూనివర్సిటీ దగ్గర మనుధర్మ శాస్త్రాన్ని పీడీఎస్‌యు, డీఎస్‌యు, బీఎస్‌ఎఫ్‌ విద్యార్థులు తగులబెట్టారు. దీంతో ఈ సంఘాల విద్యార్థులు, స్థానిక యువకులు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నగర పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ అక్కడకు చేరుకుని కమలాసన్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఆయన వారితో మాట్లాడి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top