డిగ్రీ పరీక్షల్లో నకిలీ అభ్యర్థులు | fake students arrested in degree exams | Sakshi
Sakshi News home page

డిగ్రీ పరీక్షల్లో నకిలీ అభ్యర్థులు

Mar 16 2016 1:19 PM | Updated on Aug 20 2018 4:27 PM

అసలైన అభ్యర్థుల్లా డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఇద్దరు నకిలీలను పరీక్షా కేంద్రం సిబ్బంది పట్టుకున్నారు.

కోరుట్ల: అసలైన అభ్యర్థుల్లా డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఇద్దరు నకిలీలను పరీక్షా కేంద్రం సిబ్బంది పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకంది. బీకామ్ మూడో సంవత్సరం కమర్షియల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్‌మెంట్ పరీక్షను రిజ్వాన్ పాషా, అమీర్ పాషా అనే విద్యార్థులు రాయాల్సి ఉండగా వారికి బదులు నవీద్, జమీర్ అనే వారు రాస్తున్నారు. కళాశాల సిబ్బంది పరిశీలనలో విద్యార్థులు నకిలీలని బయటపడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు విచారణ ప్రారంభించారు. నవీద్, జమీర్ ఎంబీయే పూర్తి చేసిన వారు కావడం గమనార్హం. 
 

Advertisement
 
Advertisement
Advertisement