
సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో హుండీలు నిండిపోయాయి. దీంతో కానుకలు వేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ గర్భగుడి, అంత ర్భాగంలో మొత్తం 18 హుండీలు ఉండగా.. 13 హుండీలు నిండాయి. భక్తులు కానుకలు వేయకుండా అధికారులు హుండీలకు వ్రస్తాన్ని చుట్టారు. దీంతో భక్తులు ఆలయ పరిసరాల్లో కానుకలను సమర్పించుకుంటున్నారు. ఇదే అదనుగా కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
జనవరి 27న హుండీలు లెక్కించగా.. రూ.10.80 కోట్ల ఆదాయం సమకూరింది. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. చిల్లర నాణేలను బ్యాంకర్లు తీసుకోకపోవడం.. లెక్కింపులోనూ జాప్యం జరగడంతో హుండీలు నిండిపోవడానికి కారణమని చెబుతున్నారు. బుధవారం హుండీలను లెక్కింపునకు ఏర్పాట్లు చేశామని, చిల్లర సమస్యపై దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు.