చెట్టును ఢీకొన్న స్కూల్ వ్యాన్ | school van accident in karim nagar | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న స్కూల్ వ్యాన్

Jan 5 2016 12:06 PM | Updated on Nov 9 2018 4:44 PM

విద్యార్థులను స్కూల్‌కి తీసుకెళుతున్న వ్యాన్ చెట్టుకు ఢీకొనగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

- ఎనిమిది మందికి గాయాలు
- ఒకరి పరిస్థితి విషమం
 
మంతని: విద్యార్థులను స్కూల్‌కి తీసుకెళుతున్న వ్యాన్ చెట్టుకు ఢీకొనగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం రామకృష్ణాపురంలో జరిగింది. మేరి మీడియా పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులను టాటా ఏసీ వాహనంలో స్కూలుకి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో వ్యాన్ పట్టీలు విరిగిపోయాయి. దీంతో అదుపు తప్పిన వ్యాన్ చెట్టుకు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. అందులో పోలు నరేష్(9) అనే విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ అసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement