బాత్‌రూమ్ పైకప్పు కూలి వ్యక్తి మృతి | man died due to roof collapse | Sakshi
Sakshi News home page

బాత్‌రూమ్ పైకప్పు కూలి వ్యక్తి మృతి

Dec 7 2015 1:18 PM | Updated on Sep 3 2017 1:38 PM

మరుగుదొడ్డి శుభ్రం చేస్తుండగా పైకప్పు కూలిపోవడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

సుల్తానాబాద్: మరుగుదొడ్డి శుభ్రం చేస్తుండగా పైకప్పు కూలిపోవడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామ పంచాయతీ ఉద్యోగి సాయిలు(50) జెడ్పీ హైస్కూల్లోని మరుగుదొడ్డిని  శుభ్రం చేస్తుండగా  పై కప్పు కూలిపోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement