అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చిన్న బోనాల గ్రామంలో బుధవారం జరిగింది.
సిరిసిల్ల: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చిన్న బోనాల గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన అంబటి నారాయణ(44) తనకున్న రెండెకరాల భూమితో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో వర్షాలు లేకపోవడంతో.. మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.