ఎన్టీపీసీ ఆరో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ | power generation problem in 6th unit of ramagundam ntpc thermal power station | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ ఆరో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్

Apr 20 2015 3:23 PM | Updated on Sep 3 2017 12:35 AM

కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆరో యూనిట్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

జ్యోతినగర్ : కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆరో యూనిట్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వివరాల ప్రకారం... సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బాయిలర్ ట్యూబ్ లీకేజీ చోటు చేసుకోవడంతో విద్యుదుత్పత్తి ఆగిపోయింది. వెంటనే ప్లాంట్ సిబ్బంది మరమ్మత్తు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం నాటికి ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని ప్లాంట్ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement