Representative image
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అజయ్‌ది తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీ. అజయ్‌తో పాటు మరో ముగ్గురిని వరుస దొంగతనాల కేసులో నాలుగు రోజుల క్రితం ఎల్ఎండీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నాలుగు రోజుల నుంచి థర్డ్ డిగ్రీ ఇవ్వడంతో భరిచలేక అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసుల వేధింపులే అజయ్ ఆత్మహత్యాయత్నానికి కారణమంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అజయ్‌కు కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అతడి నడుము విరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు.
ఇటీవలే, మట్టి ట్రాక్టర్లను విడుదల చేసేందుకు బాబు అనే వ్యక్తిని లంచం అడిగిన కేసులో సీపీ కార్యాలయానికి ఎల్ఎండీ సీఐ, ఎస్సై అటాచ్ అయ్యారు. ఇప్పుడు ఇన్‌చార్జ్ సీఐ సారధ్యంలో మరో ఘటన జరిగింది. అరెస్ట్ చూపించి, కోర్టులో హాజరుపర్చకుండా చిత్రహింసలు పెడుతున్న కొందరు జిల్లాలోని పోలీసుల తీరుపై తరచూ విమర్శలు వస్తున్నాయి. దొంగతనం కేసులో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపించక చిత్రవధ చేయడంతోనే సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు అజయ్ కుటుంబీకుల ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: నానమ్మ మరణవార్త.. ఆ సమయంలో పోలీసులు..: దీప్కే ఆగ్రహం


