రాజ్యాంగంతోనే తెలంగాణ | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగంతోనే తెలంగాణ

Nov 26 2026 11:50 PM | Updated on Nov 26 2026 11:50 PM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ ఏర్పడిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగం రాసినప్పుడే చేసిన చట్టం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. ఒక సామాన్యుడి గా ఉన్న తనకు మంత్రి పదవి రావడం రాజ్యాంగ పుణ్యమేనన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అగ్నిమాపక ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా తబ్రేజ్‌

కరీంనగర్‌క్రైం/కరీంనగర్‌ అర్బన్‌: తెలంగాణ అగ్నిమాపకశాఖ జిల్లా ఉద్యోగుల సంఘం ఎన్నికలు స్థానిక టీఎన్జీవో కార్యాలయ భవనంలో ఏకగ్రీవంగా జరిగాయి. రాష్ట్ర అడహక్‌ కమిటీ అధ్యక్షుడు జి.దామోదర్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాస్‌, పి.శ్రీనివాస్‌, కోశాధికారి కృష్ణ పర్యవేక్షణలో ప్రక్రియను నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎండీ.తబ్రేజ్‌, ఉపాధ్యక్షుడిగా జి.గణేశ్‌, కార్యదర్శిగా పి.శ్రీధ ర్‌ రెడ్డి, కోశాధికారిగా వి.శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని ఎంప్లాయీస్‌ జేఏసీ జిల్లా చైర్మన్‌, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సర్దార్‌ హర్మిందర్‌ సింగ్‌, నగర అధ్యక్షుడు మారుపాక రాజేష్‌ భరద్వాజ్‌, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అ ధ్యక్షుడు కోట రామస్వామి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement