ఎస్సై పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎస్సై పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 26 2026 11:50 PM | Updated on Nov 26 2026 11:50 PM

ఎస్సై పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు ● 20 కేంద్రాల్లో 14 వేల మందికి పైగా అభ్యర్థులు ● పారదర్శకంగా నిర్వహించాలి ● సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌క్రైం: జిల్లాలో ఈ నెల 29న నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహణపై చీఫ్‌ సూపరింటెండెంట్లు, పోలీస్‌ నోడల్‌ అధికారులు, బయోమెట్రిక్‌ సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 20 కేంద్రాల్లో 14 వేల మందికి పైగా అభ్యర్థులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. బయోమెట్రిక్‌ హాజరు నమోదులో లోపాలు తలెత్తకుండా చూడాలని, సాంకేతిక సమస్యలుంటే ప్రత్యామ్నాయంగా మాన్యువల్‌ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ నిషేధాజ్ఞలు అమలు చేయాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్‌ షీట్ల తరలింపులో భద్రత పాటించాలని, కేంద్రాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ కోరారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, ఇతర పోలీసు అధికారులు, కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement