కరీంనగర్ టౌన్: కరీంనగర్‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని డీఈవో వై.తిరుపతిరావు పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ని ర్వహించిన జిల్లాస్థాయి ‘ప్రహరి యువ సురక్ష’ అవగాహన శిక్షణ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి గైడ్ టీచర్ రక్షణ కవచంలా ఉండాలన్నారు. మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడటం పోలీసు, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం గైడ్ టీచర్లు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు కె.అశోక్‌రెడ్డి, దాసి శ్రీనివాస్, ఉమారాణి, భగవంతయ్య, యాంటీ నార్కోటిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ రఫీక్ ఖాన్, రిసోర్స్ పర్సన్లు అట్ల శ్రీనివాస్ రెడ్డి, సంపత్, పథ్వీరెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని శనివారం అంగడికొచ్చినంత జనం కూడా బీజేపీ ర్యాలీకి రాలేదని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ ర్యాలీని చూసి కాంగ్రెస్‌కు వణుకుపుట్టిందనడం హాస్యాస్పదమన్నారు. గురువారం నగరంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ బీజేపీ ర్యాలీ చేపట్టిన ప్రాంతంలో ప్రతి శనివారం అంగడి జరుగుతుందని, ఆ అంగడికి ఎంత జనం వస్తారో అంత జనం కూడా ర్యాలీకి రాలేదన్నారు. రాహుల్‌గాంధీ అగ్గిరాజేస్తేనే వణుకుపుట్టి బీజేపీ జాతీ య అధ్యక్షుడు నితిన్ నబీ కరీంనగర్‌కు రావా ల్సి వచ్చిందన్నారు. బండి సంజయ్‌ని అసమర్థుడని గతంలో సునీల్‌రావు అన్నాడని, పార్టీ మారగానే అసాధ్యుడు అయ్యాడా అని ప్రశ్నించారు. ఎండీ.తాజ్, పి.మల్లేశం, జి.శ్రీనివా స్‌రెడ్డి, జీడీ.రమేశ్, దన్నాసింగ్ పాల్గొన్నారు.
పాల విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్
కరీంనగర్ అర్బన్: పాల విప్లవ పితామహుడు డా.వర్గీస్ కురియన్ అని కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్.రాజేశ్వర్‌రావు కొనియాడారు. గురువారం నగరంలోని డెయిరీలో కురియన్ జయంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ కురియన్ స్ఫూర్తితో కరీంనగర్ డెయిరీని రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దామన్నారు. రానున్న కాలంలో డెయిరీకి రోజుకు 5లక్షల లీటర్ల వరకు పెంచనున్నామని వెల్లడించారు. ఎండీ పి.శంకర్‌రెడ్డి, సంస్థ అడ్వైజర్ వి.హన్మంతరెడ్డి, డైరెక్టర్లు ఎం.ప్రభాకర్‌రావు, టి.స్వామిరెడ్డి, ఎం.ప్రకాశ్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
రేపు మెగా జాబ్‌మేళా
కరీంనగర్ అర్బన్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 28న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చిత్రామిశ్రా వెల్లడించారు. జిల్లా ఉపాధి కార్యాలయం, టాస్క్, ఐటీఈసీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్‌లో జాబ్‌మేళా ఉంటుందన్నారు. ఇందులో 15 ఐటీ, ఐటీఈఎస్, నాన్‌ఐటీ రంగాల కు చెందిన కంపెనీలు పాల్గొంటాయని, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐటీఐ, డిప్లొమా తదితర కోర్సులు 2023–2026లో పూర్తి చేసినవారు అర్హులని వివరించారు. అభ్యర్థుల వయోపరిమితి 18–30 సంవత్సరాల మధ్య ఉండాలని, ఆసక్తి గలవారు 3 నుంచి 4 సెట్ల రెజ్యుమ్ కాపీలతో హాజరుకావాలన్నారు.
బాధ్యతలు కేటాయింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సహాయ కమిషనర్లకు అదనపు బాధ్యతలు కేటాయిస్తూ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశాలు జారీ చేశా రు. అదనపు కమిషనర్ ఆయాజ్‌కు రెవెన్యూ (డిజిటల్ కీ), డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్‌కు కరీంనగర్ మున్సిపల్ ప్రజా వాణి, డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్‌కు చే యూత పింఛన్లు (డిజిటల్ కీ), సహాయ కమిషనర్ రాజమనోహర్‌కు మెప్మా, డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్ నియంత్రణలో సిటీ శానిటేషన్ పర్యవేక్షణ (ఫ్యూయల్ ఫైళ్లు మినహాయించి) అప్పగించారు. ఇప్పటివరకు ఆయా విభా గాలు చూస్తున్న అధికారులు బాధ్యతలను కొత్త అధికారులకు అప్పగించాలన్నారు.


