కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
Nov 30 2015 12:41 PM | Updated on Nov 6 2018 7:56 PM
జగిత్యాల: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని విద్యానగర్‌కు చెందిన కమటం శ్రీనివాస్ కి అదే మండలంలోని జాప్తాపురం గ్రామానికి చెందిన సుధారాణితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. శ్రీనివాస్ ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు.
సుధారాణి స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ అత్తమామలతో ఉంటోంది. కొన్ని రోజులుగా కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆమె ఆదివారం రాత్రి ఉరేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి గంగారాజం దంపతులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
Advertisement
Advertisement