సరదాగా కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన సిరిసిల్లా మండలం తంగళ్లపల్లిలో చోటు చేసుకుంది
పందెం ఓ యువకుడి ప్రాణాలు తీసింది!
Jun 12 2014 4:40 PM | Updated on Aug 17 2018 7:40 PM
కరీంనగర్: సరదాగా కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లా మండలం తంగళ్లపల్లిలో చోటు చేసుకుంది. 15 నిమిషాల్లో ఫుల్ బాటిల్ మద్యం తాగుతానంటూ రవి అనే వ్యక్తి పందెం కాశారు. నాసిరకం మద్యం సేవించడ కారణంగానే ఊపిరి ఆడక మరణించినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఫుల్ బాటిల్ తాగుతూ..మధ్యలోనే పడిపోయాడని మృతుడి స్నేహితులు వెల్లడించారు.
తక్కువ సమయంలోనే మద్యం తాగిన రవి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందారు. ఇదే ఘటనలో మరో ఇద్దరు కోమాలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. కోమాలోకి వెళ్లిన వ్యక్తులకు చికిత్స అందిస్తున్నారు. సరదా కోసం పందెం కాసి మృత్యువాత పడటంపై స్థానికులు అందోళన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement