కరీంనగర్ పట్టణలోని డాక్టర్స్ వీధిలోని నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
భవనంపై నుంచి దూకి యువకుని ఆత్మహత్య
Jan 20 2016 12:19 PM | Updated on Aug 29 2018 8:38 PM
కరీంనగర్: కరీంనగర్ పట్టణలోని డాక్టర్స్ వీధిలోని నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. అశోక్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు, అతని పూర్తి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Advertisement


