కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం కావడంతో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు దాదాపు 20 వేల మంది భక్తుల స్వామి వారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు.
(మాల్యాల)