కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లిలో గుడుంబా స్ధావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.
వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లిలో గుడుంబా స్ధావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గుడుంబా తయారీలో ఉపయోగించే వెయ్యిలీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేసి మరో వందలీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులతో గుడుంబా తయారీదారులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.