కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, ధర్మారం, సుల్తానాబాద్ తదితర మండలాల్లో జరిగిన 12 చోరీ ఘటనలలో వీరు నిందితులు. నిందితులు భాగ్యలక్ష్మి, బయ్యాల శంకర్, సమ్మయ్యల స్వస్థలం కరీంనగర్ జిల్లా వీణవంక. ఈ మేరకు పెద్దపల్లి డీఎస్పీ నల్లమల్లారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.