కరీంనగర్ జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ గ్యాస్‌సిలిండర్ పేలింది.
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ గ్యాస్‌సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో సామంతుల అంజయ్య(25) అనే యువకుడు ఇంట్లో ఉన్నాడు. మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.