తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క విశ్వవిద్యాలయానికి తెలంగాణకు చెందిన వీసీలు లేరని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క విశ్వవిద్యాలయానికి తెలంగాణకు చెందిన వీసీలు లేరని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 664 టీచింగ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థలను విజిలెన్స్ విచారణ పేరుతో వేధించడం సరికాదని అభిప్రాయపడ్డారు.