వ్యాధుల బారిన పడినవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటమే లక్ష్యంగా ప్రభుత్వాస్పత్రులను ప్రక్షాళన చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే తన చర్యలను ముమ్మరం చేసింది.
కరీంనగర్: వ్యాధుల బారిన పడినవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటమే లక్ష్యంగా ప్రభుత్వాస్పత్రులను ప్రక్షాళన చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే తన చర్యలను ముమ్మరం చేసింది. నిద్రావస్థలో ఉన్న ఆసుపత్రులను మేలుకొల్పడానికే తాను ఆసుపత్రుల్లో బసచేస్తున్నానని డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు.
ఆదివారం మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో డప్పుకొట్టి దండోరా వేసిన రాజయ్య.. ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు.