‘తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నారు’

Etela Rajender షparticipated in Samagra Vyavasayam- Sustira vyavasayam Programme - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరోనా అసలు కథ ఇప్పుడే మొదలవుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగిన సమగ్ర వ్యవసాయం - సుస్థిర వ్యవసాయం అనే కార్యక్రమంలో  మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైంది. ప్రస్తుతం ఇతర దేశాల, రాష్ట్రాల నుండి ప్రజలు వస్తున్నందున  పల్లెలు, పట్టణాలు క్షేమంగా ఉండే పరిస్థితి లేదు. మొదటి రెండు నెలలు లాక్ డౌన్  విషయంలో సీరియస్ గా వ్యవహరించాం కాబట్టే.. ఎక్కువ స్థాయిలో విస్తరించలేదు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కరోనా విషయంలో  అప్రమత్తంగా ఉండాలి. కరోనాను లైట్  తీసుకోవద్దు. జూన్, జూలై నెలలో ఎక్కువగా కరోనా విస్తరించే ప్రమాదం ఉంది.  ఏది సాధించాలన్నా, ఏది శోధించాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యం. కరోనా అదుపులోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేస్తే  వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ను హుజురాబాద్ నియోజక వర్గానికి తీసుక వస్తా. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానానికి రైతులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఈ సంవత్సరం 71 వేల ఎకరాల్లో తెలంగాణ రైతులు పంట పండించారు. దేశంలో అందరికి తెలంగాణ రైతులు అన్నం పెడుతున్నారు. రాబోయే రోజుల్లో  తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నారు అని పేర్కొన్నారు. ('బాబు.. విగ్రహం కళ్లలోకి చూసే దండ వేశావా')

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top