సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీ నేతల విభేదాలు లేనవి క్లారిటీ ఇచ్చారు ఎంపీ ఈటల రాజేందర్. అన్ని పార్టీల్లో అంతర్గత విభేదాలు సాధారణంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో దేశంలో మావోయిస్టుల లొంగుబాటు, ఎన్‌కౌంటర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టాండే తమ స్టాండ్ అని స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీలో విభేదాలు లేవు. విభేధాలు అనేవి సోషల్ మీడియా సృష్టి. అంతర్గత విభేదాలు సహాజం, అన్ని పార్టీల్లో ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తాం. హుజురాబాద్‌లో జరిగే సమావేశాలకు నాకు సమాచారం ఉంది. వ్యక్తిగత కారణాలతో అన్ని కార్యక్రమాలకు రాలేకపోయాను’ అని చెప్పుకొచ్చారు.


